E-Paper
Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పాశం.. విషం..! మ‌రీ అంత‌ఘోర‌మా? జ‌ర్న‌లిస్ట్‌ యాద‌గిరి ప‌ర్స‌న‌ల్ కామెంట్స్‌పై జ‌నసేన మండిపాటు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పాశం.. విషం..! మ‌రీ అంత‌ఘోర‌మా? జ‌ర్న‌లిస్ట్‌ యాద‌గిరి ప‌ర్స‌న‌ల్ కామెంట్స్‌పై జ‌నసేన మండిపాటు!
Advertisement

అటు తిరిగి ఇటు తిరిగీ నాగేశ్వ‌ర్ క‌థ తెలంగాణ‌కు చేరింది. అస‌లు ఇది తెలంగాణ‌కు సంబంధమే లేని విష‌యం. ఆంధ్ర‌లో మొద‌లైన లొల్లి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌కు, నాగేశ్వ‌ర్ జ‌గ‌న్‌కు వ‌త్తాపు ప‌లుకుతున్నాడ‌నే కోణంలో మొద‌లైన తంటా.. తెలంగాణ‌కు పెంట తెచ్చిపెట్టింది. ఇవాళ దీనిపై తెలంగాణ మేథావులు రౌండ్ టేబుల్ స‌మావేశం కూడా పెట్టారు. అక్క‌డ కేసులు లేవు.. గీసులు లేవు.. అన్నీ మాఫీ.. వ‌దిలేద్దాం.. అని ఆంధ్రా స‌ర్కారే ప్ర‌క‌టించుకుంటుంటే.. ఇక్క‌డ చ‌ల్ల‌బ‌డిన ఇష్యూను తెలంగాణ అని ట్యాగ్‌లైన్ త‌గిలించి.. రౌండ్ టేబుల్ స‌మావేశం పెట్టారు. దీనికి విమ‌ల‌క్క‌తో పాటు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పాశం యాద‌గిరిని కూడా ప్ర‌త్యే ఆహ్వానితులుగా పిలిచారు.

పాశంతో ఎట్లుంటదో తెలుసుగా…! అంతా పెంట పెంట చేసేస్తాడు.. స‌బ్జెక్టు ఏదైనా! ఇక్క‌డా అదే జ‌రిగింది. ప‌వ‌న్‌ను తిట్టే నెపంతో మొత్తం సినీ ఇండ‌స్ట్రీని చుల‌క‌న చేయ‌డం వివాద‌స్ప‌ద‌మైంది. సినిమాల్లో న‌టించే వారికి శీల‌ముండ‌ద‌న్నాడు. చ‌దువుండ‌ద‌న్నాడు. వారు తిరుగుబోతుల‌న్నాడు. తాగుబోతుల‌న్నాడు. తీసేవ‌న్నీ బూతు సినిమాల‌న్నాడు.. అబ్బో.. ఇంకా చాల‌నే అన్నాడు. ఇక ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యానికొచ్చాడు. వ‌చ్చే ముందు .. ముందు జాగ్ర‌త్త‌గా క‌వి శ్రీ‌శ్రీ మాట‌లు కోట్ చేశాడు. ఏ మాట‌లు.. నువ్వు ప్ర‌జా జీవితంలోకి రాక‌పోతే అంతా ప్రైవేటే.. కానీ ప‌బ్లిక్‌లోకి వ‌స్తే.. ప‌ర్స‌న‌ల్ విష‌యాల జోలికొస్తాం..! అని మొద‌లు పెట్టాడు. తెలంగాణ గురించి, ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే హ‌క్కు ప‌వ‌న్‌కు లేద‌న్నాడు. నాగేశ్వ‌ర్ కాలిగోటికి కూడా ప‌వ‌న్ ప‌నికి రాడ‌న్నాడు.

Advertisement

లిల్లీపుట్ అని తిట్టాడు. ఐదుగురిని చేసుకున్నావ్ సిగ్గుందా? అని మంద‌లించాడు. సినిమాల్లో ఉంటే ఎంత మందిని చేసుకున్నా… నీ జోలికి వ‌చ్చేవారిమి కాదు.. అని స‌మర్థించుకున్నాడు. సోనియాల‌ను ఇటాలియ‌న్ అని విమ‌ర్శిస్తారు.. నువ్వు మాత్రం విదేశీయురాల‌ని పెళ్లి చేసుకున్నావ్‌..! మీ బీజేపీ వాళ్లే బుద్దే ఇది..! అని తిట్టిపోశాడు. చేగువెరా బొమ్మ‌లు పెట్టుకుని గ‌ద్ద‌ర్‌ను కూడా మోసం చేశారు. అస‌లు నీకు డిప్యూటీ సీఎం ఇచ్చుడే ఎక్కువ‌. ఆ సీఎంది కూడా దొంగ‌బుద్దే.. అని ప‌నిలో ప‌ని చంద్ర‌బాబును అర్సుకున్నాడు.

ఓవైపు నాగేశ్వ‌ర్ ఈ క‌థ‌కు ముగింపు ప‌లుకుదాం.. నేను బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెబుతున్నా.. నా వ్యాఖ్య‌ల్ని వెనుక్కి తీసుకున్నా..! అని చెప్పినా.. ఇక్క‌డ దీన్ని ఇంకా మంట‌లు రేపే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. మ‌రోవైపు తాజాగా పాశం యాద‌గిరి మాట్లాడిన మాట‌ల‌పై జ‌న‌సేన లీడ‌ర్లు భ‌గ్గుమంటున్నారు. సినీ ఇండ‌స్ట్రీని తిట్టిన వైనం ప‌ట్ల మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితం గురించి ఇంత ఘోరంగా మాట్లాడాతాడా? ఇదేనా తెలంగాణ .. ప‌వ‌న్‌కు ఇచ్చే మ‌ర్యాదా? అని విమ‌ర్శిస్తున్నారు. ఇది ఇంత‌టితో ఆగుతుందా? మ‌రింత రాజ‌కీయ రంగు పులుముకుంటుందా? చూడాలి!

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×