E-Paper
Advertisement

Janasena : పవన్‌కు అనారోగ్య సమస్యలు..కారణం వారేనట?

Janasena : పవన్‌కు అనారోగ్య సమస్యలు..కారణం వారేనట?
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురై సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరో వారం తర్వాత ప్రజా కార్యక్రమాల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఉన్నట్టుండి ఆయన ఎందుకు అనారోగ్యం బారిన పడ్డారు అనేది ఎవరికి తెలియరాలేదు. సర్జరీ జరిగిందనే విషయం బయటకు రావడంతో జనసైనికులు సైతం తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తమ అభిమాన నటుడికి ఏం జరిగిందోనని అభిమానులు సైతం కాస్త అయోమయానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు సైతం ఆరా తీసినట్టు తెలిసింది. ఇదిలాఉండగా, పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురవడానికి జనసైనికులే కారణమని రైల్వేకొడూరు ఎమ్మెల్యే ఆరవశ్రీధర్ బాధితురాలు పేర్కొన్నది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.

వారిద్దరే కారణమట..

జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, మరోనాయకుడు తాతం శెట్టి నాగేంద్రపై ఆ వీడియోలో సదరు బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురికావడానికి వారిద్దరే కారణమన్నారు. జనసేన నాయకుల తీరు వల్లనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. సొంత పార్టీ నేతలు చేసే పనుల కారణంగా మనస్తాపంతో ఆయన ఆస్పత్రిలో చేరారంటూ ఆరవ శ్రీధర్ బాధితురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసి నెల రోజులు గడుస్తోందని.. అయితే, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యల కోసం జనసేన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని.. ఆ కమిటీ విచారణ కూడా జరిపినట్లు బాధితురాలు గుర్తుచేశారు.అయినా, ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని ఆరోపించింది.

తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కదా?

Advertisement

ఒక మహిళకు అన్యాయం చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం దారుణమని, మరల తెచ్చి పార్టీలో పెట్టుకోవడం సరికాదని ఆమె అన్నారు.త్రిసభ్య కమిటీ తీర్పు రాకుండానే ఆరవ శ్రీధర్‌..పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, జనసేన జెండా మెడలో వేసుకుని తిరుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నది. అయినప్పటికీ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆమె ఫైర్ అయ్యారు. వీరిపై చర్యలు తీసుకుంటేనే మరల ఇటువంటి చర్యలు రిపీట్ కావని, లేదంటే జనసైనికులు చేసే పనుల మూలాన పవన్ మస్తస్తాపానికి గురై అనారోగ్య సమస్యల బారిన పడే ఆస్కారం ఉందన్నారు.

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం.. శనివారం కవిత ప్రకటన, అంతా రెడీ, బీఆర్ఎస్ నేతల ఆరా

నాగబాబు సీరియస్..

Advertisement

తాజాగా జనసేన ఎమ్మెల్సీ, పవన్ సోదరుడు నాగబాబు సైతం జనసైనికుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మధ్య నెలకొన్న పంచాయితీపై ఆయన స్పందించారు. పవన్ సొంత నియోజకవర్గంలో రాజకీయ గొడవలు తలెత్తడం మంచిదికాదని ఫైర్ అయ్యారు. జనసైనికులు ఓపికగా ఉండాలని సూచించారు. జరిగిపోయిన విషయం గురించి మరల తీయొద్దని, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరైనా అడిగారా? అని ఫైర్ అయ్యారు. వర్మ మ్యాటర్‌ను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, జనసైనికులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దని నాగబాబు స్పష్టంచేశారు. పార్టీ కోసం పవన్ అహర్నిషలు పాటుపడుతున్నారని, ఆయనకు చెడ్డపేరు తేవొద్దని నాగబాబు జనసైనికులకు హితవు పలికారు. మొత్తానికి జనసైనికుల తీరు వల్లే పవన్ ఒత్తిడికి గురవుతున్నారని, మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుందా?రాదా? అనే ఆందోళనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×