E-Paper
Advertisement

డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక

డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక
Advertisement

Kavitha: డీలిమిటేషన్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు బిల్లులు లింక్ చేసి పార్లమెంటుకు తీరుకురావడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. డీలిమిటేషన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్‌పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

Advertisement

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్-నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై ఆమె స్పందించారు.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రయత్నంలో తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణకు ఉన్న 3.13 శాతాన్ని బేస్‌లైన్‌గా పరిగణించాలన్నారు. పునర్విభజన తర్వాత ఈ శాతం ఏ మాత్ర తగ్గకుండా చూడాలన్నారు.

Advertisement

రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర.. మరోసారి ఉద్యమం తప్పదంటూ  హెచ్చరిక

నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందన్నారు. అన్ని‌రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం తగదన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై కాసింత అసహనం వ్యక్తంచేశారు. మహిళా బిల్లును ఓబీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టాలని చూస్తున్నారని, 33 శాతం కోటాలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఇస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.

ALSO READ: లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు

పార్లమెంట్‌లో ఇవాళ మహిళ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరగతుందన్నారు. మహిళలకు చాలా ముఖ్యమైన రోజని, అదే విధంగా నియోజకవర్గాల పెంపుపై కూడా చర్చ జరగాలన్నారు. మహిళ బిల్లును ఇప్పటికే పాస్ అయ్యిందని, ఇప్పుడు డిలిమిటేషన్ బిల్లుకు మహిళా బిల్లును లింక్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉందన్నారు. ఈ రెండు అంశాలు వేర్వేరన్నారు. మహిళల భుజంపై తుపాకి పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని చూస్తోందన్నారు. నియోజకవర్గాలను 50 శాతం పెంచుతామని చెబుతోందని, చూడటానికి కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరగుతుందన్నారు.

 

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

Big Stories

Advertisement
×