E-Paper
Advertisement

KCR : కూతురిపై కేసీఆర్ ఆగ్రహం..నెక్స్ట్ అదే చేస్తారా?

KCR : కూతురిపై కేసీఆర్ ఆగ్రహం..నెక్స్ట్ అదే చేస్తారా?
Advertisement

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు కల్వకుంట్ల కవిత మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం కవిత తనకంటూ సొంత ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నారు.సొంతంగా పార్టీ కూడా స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అని దానికి నామకరణం కూడా చేశారు. పాంచజన్యం పేరిట పార్టీ విధివిధానాలు సైతం ఖరారు చేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని, ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని కవిత స్పష్టంచేశారు. అయితే, కవిత పార్టీ పెట్టడం ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, ఆమె ప్రసంగంలో భాగంగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. అటు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు.

టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్..

కవిత పార్టీ స్థాపించడానికి ముందు సైతం తన పొలిటికల్ టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వెనుకబడిన వర్గాలు, అసలైన ఉద్యమకారుల కోసం తన పోరాటం ఉంటుందని ప్రకటించింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, అవినీతి అక్రమాలకు పాల్పడిందని.. ఆ పార్టీ నేతలు దోచుకుని దాచుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మారిపోయారని.. మరమనిషి అయ్యారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ హైడ్రా పేరిట కూల్చివేతలకు పాల్పడుతుంటే తండ్రిలా కాపాడాల్సిన కేసీఆర్ ఫాంహౌస్‌‌లో పడుకున్నారని.. ఆయన ఒకప్పటి ఉద్యమనేత కేసీఆర్ కాదని ఫైర్ అయ్యారు. ఆయన పూర్తిగా మారిపోయారని కవిత ఆరోపించారు.

పదేండ్లు పదవులు అనుభవించి..

Advertisement

రానున్న రోజుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిన అక్రమాలపై నిలదీస్తానని, అధికార పార్టీ ప్రజలకు ఇచ్చి నెరవేర్చని వాగ్దానాలపైనా ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మీద ప్రశ్నిస్తానని అనడం ఒకే. కానీ తనకు రాజకీయ జన్మను ఇచ్చిన బీఆర్ఎస్ మీద రీవెంజ్ తీసుకుంటానని ప్రకటించడంపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, తప్పుల్లో తనకూ భాగం ఉన్నందున క్షమించాలని కవిత బహిరంగ క్షమాపణ కోరారు. ఈ రకంగా బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆమె నిర్దారించినట్టు అయ్యిందని అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పదేండ్లు పాటు పదవులు అనుభవించాక కొత్తగా ఇప్పుడు పంపకాల్లో తేడాలు వచ్చాయని కొత్త పార్టీపెట్టినంత మాత్రాన ఆ పాపం పోతుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

9 మందితో ఎఫైర్స్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి.. వెండితెర ‘రెండో భార్య’ రియల్ లైఫ్ విషాదం!

Advertisement

కవిత కొత్త పార్టీ పెట్టడంపై గులాబీ బాస్ కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. గులాబీనేతలు సైతం పెద్దగా స్పందించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం స్పందించారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని తేల్చిచెప్పారు. ఇకపోతే కేసీఆర్ ఆదేశాల వల్లే బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఆమె మీద గానీ, తెలంగాణ రాష్ట్ర సేన మీద పెద్దగా కామెంట్స్ చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే , కాంగ్రెస్, ఇతర పార్టీలు కవిత పార్టీపై స్పందిస్తున్నాయి. ఇప్పుడు గనుక కవితను ఉద్దేశించి కామెంట్స్ చేస్తే ఆమె మరింత రెచ్చిపోయి బీఆర్ఎస్ బండారం మొత్తం బయటపెడుతుందని, అందుకే పెద్దగా ఎవరూ స్పందించవద్దని గులాబీ బాస్ బీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు సమాచారం. కవిత.. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం కేవలం కేసీఆర్‌కు దగ్గర వ్యక్తులకు మాత్రమే తెలుసునని తెలుస్తోంది.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×