E-Paper
Advertisement

బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు ఇదే క‌రెక్టు ధమ్కీ.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి..!

బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు ఇదే క‌రెక్టు ధమ్కీ.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి..!
Advertisement

మ‌న ద‌గ్గ‌ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌మంటే స‌గం ట‌ర్ము పూర్త‌యినా ఇంకా భ‌య‌ప‌డుతున్నారు. ఒక‌రికిస్తే ఇంకొక‌రితే తంటా.. నేనే సీనియ‌ర్ నాకు ఇయ్య‌క‌పోతే రాజీనామాకు సిద్దం అంటాడు ఒక ఎమ్మెల్యే. నాకు మాటిచ్చారు షేర్‌ఖాన్‌.. మాట త‌ప్పుతున్నారు.. ఇంత‌కు ఇంత అనుభ‌విస్తారు అని శ‌పిస్తాడు మ‌రొక ఎమ్మెల్యే.. నాకు స్పీక‌ర్ గిరీ వ‌ద్దు ఏమీ వ‌ద్దు.. మంత్రి ఇవ్వండి.. హోం మినిస్ట్రీకి నేను ఫ‌ర్‌ఫెక్ట్ సూట్ అవుతానంటాడు మ‌రో ద‌ళిత ఎమ్మెల్యే. ఇలా ఎవ‌రికి వారు అక్క‌డ ఢిల్లీలో లాబీయింగులు.. ఇక్క‌డ గ‌ల్లీలో బెదిరింపులు.. రెండేండ్లుగా సాగుతున్నాయి. సాగుతూనే ఉన్నాయి.

కానీ ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌లో మాత్రం ఇందుకు భిన్నం. మొన్న‌టికి మొన్న సీఎంగా కొత్త అవ‌తారం ఎత్తిన డీకే శివ కుమార్‌.. అక్క‌డ త‌న‌దైన మార్కు పాల‌న‌ను షురూ చేశాడు. మంత్రివ‌ర్గాన్ని మార్చాడు. సీనియ‌ర్ల‌ను త‌ప్పించాడు. 20 మందికి అవ‌కాశం క‌ల్పించాడు. కొత్త‌గా ప‌ది మందికి అవ‌కాశం ఇచ్చాడు. కానీ దేశముదుర్లు ఊరుకుంటారా? మాకు మంత్రి ప‌దవి ఇయ్య‌వా..? అయితే రాజీనామా చేస్తామ‌ని బెదిరింపుల‌కు దిగారు.

Advertisement

కానీ అక్క‌డున్న‌ది రేవంత్ రెడ్డి కాదు.. డీకే శివ‌కుమార్‌. అందుకే ఈ ఉడ‌త ఊపుల‌కు భ‌య‌ప‌డ‌లేదు. ఉల్టా ధ‌మ్కీ ఇచ్చాడు. ఇప్పుడే రాజీనామా చేసేయండి.. క్ష‌ణాల్లో ఆమోదించేస్తా.. ఎన్నిక‌ల‌కు పోదామ‌న్నాడు. అంటే ఉన్న ఎమ్మెల్యే గిరీ కూడా పోత‌ద‌ని చెప్పేశాడ‌న్న‌మాట డైరెక్టుగా. ఇండైరెక్టుగా.

అంత బ‌లంగా ఉంద‌క్క‌డ పార్టీ, ప్ర‌భుత్వం. అక్క‌డ మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన 113 సీట్ల‌కు 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మీరు కాక‌పోతే ఇంకొక‌రు… ఉప ఎన్నిక‌కు కూడా రెడీ అని తొడ‌గొట్టి మ‌రీ చెప్పిన‌ట్ట‌య్యింది బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు. దీంతో కుక్కిన పేనులా ప‌డి ఉండాల్సిన అగ‌త్యం ఏర్ప‌డింది వారికి. అంతే మ‌రి లీడ‌ర్ గ‌ట్టిగా ఉండి.. ధృడ‌మైన నిర్ణ‌యాలు తీసుకంటే.. ప్ర‌భుత్వాన్ని ప‌టిష్టంగా న‌డ‌ప‌గ‌ల‌న‌నే విశ్వాసం నిండిన వ్య‌క్తి సీఎంగా ఉంటే.. ఇలాంటి డేరింగ్ నిర్ణ‌యాలు, డ్యాషింగ్ కామెంట్లే ఉంటాయి.

Advertisement

కానీ అక్క‌డి ఫార్మూలాతో ఇక్క‌డ తెలంగాణ‌లో గ‌ట్టెక్కిన కాంగ్రెస్ పార్టీ మాత్రం స‌కాలంలో పూర్తి చేయాల్సిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేదు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ వ‌స్తోంది. భ‌య‌ప‌డి. ఓడిపోతామోన‌ని. కానీ అక్క‌డ ఆ ప‌రిస్థితి లేదు. త‌మ మీద త‌మ‌కు విశ్వాసం ఉన్న స‌ర్క‌ర్‌గా.. ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా మ‌ళ్లీ గెలిపించుకోగ‌లుగుతామ‌నే ధీమాతో ఉన్న సీఎంగా అక్క‌డ ప్ర‌త్యేక ముద్ర కొన‌సాగుతోంది.

అందుకే అప్పుడు, ఇప్పుడు డీకే శివ‌కుమార్ వార్త‌ల్లో లీడ‌ర్‌గా ఉంటున్నాడు. త‌నదైన మార్కు రాజ‌కీయాల‌తో ఎప్పుడూ చ‌ర్చ‌లో నిలుస్తున్నాడు. ఇంకో విష‌యం.. తెలంగాణ‌లో కేసీఆర్ ద‌య‌వ‌ల్ల రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరుతో ప‌క్క పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ఓ సంప్ర‌దాయంగా మారింది. కాంగ్రెస్ వ‌చ్చిన త‌రువాత కూడా ఇది కొన‌సాగింది. ఓ ప‌ది మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. కానీ దొంగే దొంగా దొంగా అని అరిచిన‌ట్టుగా బీఆరెస్ గ‌గ్గోలు పెట్ట‌డంతో ఈ జంపింగ్‌ల ప్ర‌క్రియ‌కు బ్రేక్ ప‌డింది. తెలంగాణ రాజ‌కీయ‌ల‌కు, క‌ర్ణాట‌కా పాలిటిక్స్‌కు ఎంత తేడా క‌దా!

Tags

Related News

కేటీఆర్, అర్వింద్ .. ఇద్ద‌రి నోటా ఒకే మాట‌! రేవంత్ టార్గెటెడ్‌గా కామెంట్స్‌.. పార్టీ లైన్ దాటి ప‌ర్స‌న‌ల్ అటాక్‌..!

హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ ‘స‌న్’ స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!

లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!

Big Stories

Advertisement
×