E-Paper
Advertisement

మెున్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, నేడు బోరుగడ్డ.. అయ్యో అయ్యో అయ్యయ్యో?

మెున్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, నేడు బోరుగడ్డ.. అయ్యో అయ్యో అయ్యయ్యో?
Advertisement

Borugadda Anil: అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం, ప్రత్యర్థులపై అసభ్యకర వ్యాఖ్యలతో విరుచుకుపడటం.. తీరా పవర్ పోయాక బాధితుల అవతారం ఎత్తడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఒకప్పటి వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ వంటి వారు.. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. వరుస కేసులు, పోలీసుల అరెస్ట్ దెబ్బకు శ్రీరెడ్డి, పోసాని గత కొద్ది కాలంగా సైలెంట్ అవ్వగా.. బోరుగడ్డ అనిల్ మాత్రం తాజాగా ఎదురుతిరిగారు. అది కూడా కూటమి ప్రభుత్వాన్ని వదిలేసి.. వైసీపీ అధినేత జగన్ ఇంటి ముందు నిరసన చేపట్టడం ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది.

సొంత పార్టీ నేతలే తనను రౌడీ షీటర్ అంటూ మీడియా వేదికలపై చెబుతుండటంతో బోరుగడ్డ అనిల్ తట్టుకోలేకపోయారట. జగన్ రెడ్డి కోసం ప్రత్యర్థులను నోటికి వచ్చినట్లు తిట్టి.. జైలు కెళ్లిన తనకు పార్టీలో కనీసం కార్యకర్త హోదా కూడా లేదని వాపోతున్నారు. సజ్జల రామకృష్టారెడ్డి వంటి వారు షర్ట్ నలగకుండా పార్టీ ఆఫీసుల్లో కూర్చుంటే.. జగన్ కోసం తాను మాత్రం 9 నెలలు జైల్లో ఉండి లాఠీ దెబ్బలు తిన్నానని ఏడ్చినంత పనిచేశారు. అలాంటి తనను.. ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించి ఎవరు నువ్వు? అంటూ అవమానిస్తారా? సజ్జలకు ఎంత ధైర్యం? నన్ను రౌడీ షీటర్ అనేంత మెుగోడా ఆ వెంకట్ రెడ్డి (వైసీపీ అధికార ప్రతినిధి) అంటూ ఎడాపెడా వాయించేశారు బోరుగడ్డ.

Advertisement

అయితే ఇక్కడ బోరుగడ్డ అనిల్ కు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. గత వైసీపీ పాలనలో అయనలెక్కే రాయలేని పదాలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి, పోసాని లాంటి వారికీ ఇదే పరిస్థితి ఎదురైంది. పోసాని కాస్త పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాబట్టి వైసీపీని పెద్దగా విమర్శించకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తన సినిమాలు ఏవో తాను చేసుకుంటూ బతుకున్నారు. అటు శ్రీరెడ్డి కూడా వైసీపీ నుంచి సరైన సపోర్ట్ లేక.. కేసులు, జైలు భయంతో క్షమాపణలు చెబుతూ బహిరంగ వీడియోను విడుదల చేసింది. నారా రోహిత్, చంద్రబాబు నాయుడులకు సారీ చెప్పి.. పెద్ద స్థాయిలో ఉన్న మీరు, మీరు చూస్కోండి గానీ.. చిన్నవాళ్లమైన తమను వదిలేయాలని ప్రాధేయపడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

తాజాగా బోరుగడ్డ వైసీపీపై ఎదురుదాడికి దిగడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మెుదలైంది. ప్రత్యర్థి పార్టీ నేతలను తిట్టేందుకు శ్రీరెడ్డి, బోరుగడ్డ లాంటి వారిని ఉపయోగించుకున్న వైసీపీ.. ప్రస్తుతం వారిని ‘యూజ్ అండ్ త్రో’ కింద వదిలేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే శ్రీరెడ్డి, బోరుగడ్డ, పోసాని విషయంలో వైసీపీ వాదన మరోలా ఉంది. పోసాని తమ పార్టీ వ్యక్తే అని వైసీపీ అంగీకరించినప్పటికీ.. శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ ను మాత్రం ఎప్పుడూ తమవారిగా చెప్పుకోలేదు. ఇప్పటికీ అదే మాటను వైసీపీ నేతలు చెబుతున్నారు.

Advertisement

Also Read: Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!

అయితే ఇక్కడే సహజంగా వైసీపీకి ఓ ప్రశ్న ఎదురవుతోంది. మీ పార్టీ వారు కానప్పుడు గతంలో టీడీపీ, జనసేన శ్రేణులు.. వారిపై ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ పార్టీవారు కానప్పుడు జగన్ పేరు చెప్పుకొని వారు ఆ విధంగా రెచ్చిపోతుంటే ఆ రోజుల్లోనే కంట్రోల్ చేయాల్సింది కదా అని నిలదీస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలపై వైసీపీ నేతల నుంచి సరైన సమాధానం ఇప్పటికీ లేదనే చెప్పాలి. మెుత్తం మీద వైసీపీ అధినేత జగన్ దృష్టిలో పడేందుకు విచక్షణారహితంగా మాట్లాడిన వారంతా.. ఇప్పుడు ఏదోక రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారే. ‘అధికార పీఠం శాశ్వతం కాదు. రేపు సీన్ మారితే ఆ నోటి దురదే తమ మెడకు చుట్టుకుంటుంది’ అని ఇప్పటికైనా నేతలు గుర్తిస్తే మంచిది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. అత్యంత చౌకగా లభించే.. టాప్-5 ఖరీదైన ఫోన్లు ఇవే!

Tags

Related News

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ ‘స‌న్’ స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

కుక్క‌ను నిలబెట్టినా గెలుస్తాం.. అహంకార‌పు మాట‌ల‌కు, చేష్ట‌ల‌కు కాలం చెల్లు!

Big Stories

Advertisement
×