E-Paper
Advertisement

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!
Advertisement

ఉద్య‌కారుల సంక్షేమం కోసం కేకే క‌మిటీ సంప్ర‌దింపుల వేగం పెరిగింది. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో ఉద్య‌మ‌కారుల ఇష్యూ సీరియ‌స్‌గా న‌డుస్తోంది. ఎవ‌రిని ఉద్య‌మకారులుగా గుర్తించాలి? ఎన్ని కేట‌గిరీలుగా విభ‌జించాలి? దీని ప్ర‌కారం ఎలాంటి సంక్షేమ ఫ‌లాలు అందివ్వాలి..? అనే విష‌యాల‌పై లోతుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా కోదండ‌రామ్‌ను ముందుంచింది స‌ర్కార్‌. దీంతో అంతో ఇంతో ఉద్య‌మ‌కారుల‌కు కూడా కేకే క‌మిటీపై గురి కుదురుతోంది. అయితే గ‌తంలో కేసీఆర్ వీరిని పూర్తిగా విస్మ‌రించాడ‌నే విష‌యాన్ని రేవంత్ మ‌ళ్లీ జ‌నాల్లో బాగా ప్రొజెక్ట్ చేయాల‌నుకుంటున్నాడు. అందుకే మొన్న ఆయ‌న సంద‌ర్భం కాకున్నా.. ఉద్య‌మకారులెవ‌రూ కేసీఆర్ ప‌క్క‌న లేర‌ని, ఆయ‌న‌ను న‌మ్మ‌క‌నే దూరంగా ఉన్నార‌ని గుర్తు చేశారు.

Advertisement

దీంతో పాటు కేసీఆర్‌.. ఉద్య‌మ‌కారుల‌కు ఏమీ చేయ‌లేదా? ప‌దేళ్లుగా స‌ర్కార్ నుంచి ఎలాంటి ల‌బ్ది చేకూర‌లేదా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. దీంతో అప్ప‌టి సంగ‌తులు మ‌ళ్లీ నెమ‌రు వేసుకుంటున్నారు. యాది చేసుకుంటున్నారు. కేసీఆర్ మీదున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌, అసంతృప్తి ఏంటంటే.. ఉద్య‌మ స‌మ‌యంలో 1200 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని కేసీఆర్ కూడా ప‌దే ప‌దే ప్ర‌జా వేదిక‌ల మీద చెబుతూ వ‌చ్చారు. రికార్డుల్లో కూడా ఉంది.

అంటే కేసీఆర్ మేలు చేసింది కేవ‌లం అమ‌రుల కుటుంబాల‌కే. అదీ సగం మందికి కూడా కాదు. అప్ప‌ట్లోనే దీనిపై తీవ్ర అభ్యంత‌రాలు, నిర‌స‌న వ్య‌క్త‌మ‌య్యింది. కానీ, కేసీఆర్ ప‌ట్టించుకుంటే క‌దా..? డోంట్ కేర్ అన్నాడు. ఇచ్చింది తీసుకోండి.. మూసుకోండి..! అన్న‌ట్టుగానే ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉండింది. ఆ పాల‌న కూడా వ‌న్ మ్యాన్ ఆర్మీలాగే కొన‌సాగింది. దీంతో ఉద్య‌మ‌కారులు లోలోన ర‌గిలిపోయారు త‌ప్ప‌.. బ‌య‌ట‌కు ఏం చెప్ప‌లేక‌పోయారు.

Advertisement

వేరు పార్టీలోకి వెళ్ల‌లేక‌పోయారు. ఉన్న‌దాంట్లో ప్ర‌శాంతంగా ఉండ‌లేక‌పోయారు. దీన్ని కాంగ్రెస్ స‌ర్కార్ అందిపుచ్చుకున్న‌ది. త‌న మ్యానిఫెస్టోలో ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల‌ స్థ‌లం, పింఛ‌న్ 25వేలు ఇవ్వ‌డంతో పాటు.. వారికి త‌గిన గుర్తింపును కూడా ఇస్తామ‌న్నారు. దీంతో కేసీఆర్ మీద ఉన్న అసంతృప్తి కాంగ్రెస్ వైపు మ‌ళ్లేలా చేసింది ఉద్య‌మ‌కారుల‌ను.

ఇప్పుడు దీనిపై క‌స‌రత్తు సాగుతోంది. ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించ‌డం ఒక భాగ‌మైతే.. అమ‌రుల కుటుంబాలంద‌రికీ మేలు జ‌ర‌గ‌లేద‌న్న‌ వాస్త‌వం కూడా ఇంకా సజీవంగానే ఉంది. దీని మీద కూడా ఉద్య‌మ‌కారులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ పాల‌న‌లో అన్యాయం జ‌రిగిన అమ‌రుల కుటుంబాల‌ను కూడా ఈ స‌ర్కార్ ప‌ట్టించుకోవాల‌ని, కేకే క‌మిటీలో వీరికి తగిన ప్ర‌యార్టీ ఇచ్చి డిష్క‌ష‌న్‌కు పెట్టాల‌ని.

కేసీఆర్ ఒక్కో కుటుంబానికి కొంత ఆర్థిక సాయం, ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ స‌ర్కార్ కూడా కొన‌సాగించాల‌నేది ఉద్య‌మ‌కారుల డిమాండ్‌గా ఉంది.

Related News

అస‌మ్మ‌తి అధిష్టానంపై… అసంతృప్తి మీడియాపై! మీడియాను టార్గెట్ చేస్తే ప‌లుచ‌న‌య్యేది లీడ‌ర్లే..

రాజీనామాకు కొండా నో…! మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణే ప‌రిష్కార‌మా? మంత్రి ప‌ద‌విపై అంచ‌నాలు, లెక్క‌ల్లో ఆశావ‌హులు..

ఉత్కంఠ! అధిష్టానం నిర్ణయం ఫైనల్! వెంటనే స్పందిస్తే బెటర్ అంటున్న రేవంత్ టీం!

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

తెలంగాణతో మోడీ తీరు ఇదే!? సీఎం కలుపుకుపోదామనుకున్నా.. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం!

ఆమె అంటే ఎందుకంత జంకు… గజ్జు మంటున్న ప్ర‌భుత్వ‌ పెద్దలు.. ఆచితూచి వ్య‌వ‌హారం అందుకే!

కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!

Big Stories

Advertisement
×