E-Paper
Advertisement

ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌రేట్‌కు రేవంత్ పునాది…పోలీస్ అధికారుల‌నే వెంటాడుతామ‌నే అహం హ‌రీశ్‌ది!

ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌రేట్‌కు రేవంత్ పునాది…పోలీస్ అధికారుల‌నే వెంటాడుతామ‌నే అహం హ‌రీశ్‌ది!
Advertisement

ర‌క్ష‌ణ గురించి, ఇక్క‌డి పోలీసింగ్ వ్య‌వ‌స్థ గురించి గొప్ప‌గా చెప్పారు సీఎం. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లోని ఫ్యూచ‌ర్ సిటీ పోలీస్ క‌మిష‌న‌రేట్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ప్ర‌పంచంలోనే ఇది అద్భుత న‌గ‌రంగా కీర్తి గ‌డించ‌బోతుంద‌ని కూడా ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్రపంచంలో యుద్దాలు జ‌రుగుతున్నా.. ఇక్క‌డ మ‌నం సేఫ్‌గా ఉంటాం.. ఇక్క‌డి శాంతి భ‌ద్ర‌త‌లు అలాంటివి.. హైద‌రాబాద్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ అలాంటిది.. అని కీర్తించారు. కానీ ఇదే రోజు.. హ‌రీశ్ పోలీస్ వ్య‌వ‌స్థనే అవ‌మాన‌ప‌రిచేలా.. ప్ర‌భుత్వానికే మ‌చ్చ తెచ్చేలా ఓ కామెంట్ చేశారు.

రేవంత్ చెప్పిన‌ట్టు వినే పోలీస్ అధికారుల‌ను వ‌ద‌లేది లేద‌న్నారు. వారు రిటైర్ అయినా వారిని వెంటాడి వేటాడుతామ‌ని, వ‌ద‌ల‌బోమ‌ని అని అన్నారు. ఇది ఇవాళ కొత్త‌గా అన్న ప‌లుకులేమీ కావు. గ‌తంలో కేటీఆర్ కూడా చాలా సార్లే అన్నారు. హ‌రీశ్‌రావు కూడా ప‌లుమార్లు ఇవే వార్నింగులు ఇచ్చారు. గ‌తంలో ఐఏఎస్ అధికారుల‌ను కూడా కేటీఆర్ అవ‌మాన‌ప‌రుస్తూ మాట్లాడ‌ట‌మే కాదు….వారికీ వార్నింగిచ్చారు. మీ ఓవ‌రాక్ష‌న్ మానుకోండ‌ని కించ‌ప‌రిచిన‌ట్టు వ్యాఖ్యానించారు. ఇప్పుడిది మ‌ళ్లీ ఎందుకు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందంటే.. ఓ వైపు ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఫ్యూచ‌ర్ సిటీ .. అందులో పోలీస్ క‌మిష‌న‌రేట్‌కు కీల‌క‌మైన పునాది రాయి ప‌డిన వేళ .. అదే సంద‌ర్భంలో అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోలీస్ వ్య‌వ‌స్జనే సవాల్ చేసేలా.. వారి సేవ‌ల‌ను అవ‌మానించేలా అహంకారం కూడిన వ్యాఖ్య‌లు.. రెండూ ఒకే రోజు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌కు తావిచ్చింది.

Advertisement

కేసీఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో కూడా పోలీస్ వ్య‌వస్థ‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేశారు. ఇక్క‌డ పెట్టుబ‌డులు రావాల‌న్నా.. ప్ర‌భుత్వాలు స‌జావుగా న‌డిచి, జన జీవ‌నం శాంతియుతంగా మెల‌గాల‌న్నా.. పోలీస్ రంగం బ‌లంగా ఉండాల‌ని గ‌ట్టిగా న‌మ్మిన వ్య‌క్తి కేసీఆర్‌. ఆయ‌న అధికారంలోకి రాగానే పోలీస్ వాహ‌నాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో బ‌డ్జెట్ కేటాయింపులు.. వారికిచ్చే మ‌ర్యాద‌, గౌర‌వం, ప‌ర‌ప‌తి అంతా విభిన్నంగా సాగింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏ సీఎం కూడా పోలీస్ శాఖ‌కు ఇంత‌లా ప్రాధాన్యత‌నివ్వ‌లేదు. ఇప్పుడు రేవంత్ చేస్తున్న‌ది కూడా అదే. కానీ ఇక్క‌డ మొన్న‌టిదాకా ప‌దేళ్లు పాలించిన పార్టీ.. కీల‌క‌మైన శాంతి భ‌ద్ర‌త‌ల అంశంలో బాధ్య‌తార‌హితంగా వ్యాఖ్య‌లు చేయ‌డం.

స‌ర్కార్ ప‌టిష్ఠ‌త‌నే కాదు.. గౌర‌వాన్ని ప‌లుచ‌న చేసేలా.. ఇత‌ర రాష్ట్రాల‌కు, దేశాల‌కు కూడా ఇక్క‌డి పోలీసింగ్‌పై చుల‌క‌నబావం ఏర్ప‌డేలా.. వ్య‌హ‌రించ‌డ‌మే మ‌రీ ఓవ‌ర్‌గా అయ్యింది. బీఆరెస్ ప‌రిభాష‌లో చెప్పాలంటే ఓవ‌ర్ యాక్ష‌న్ అనే చెప్పాలి. త‌మ పార్టీ నేత‌ల‌పై నిఘా పెడుతున్నార‌ని, త‌మ ఇళ్ల వ‌ద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నార‌ని అన్న హ‌రీశు.. రేవంత్ చెప్పిన‌ట్లు ఆడే పోలీసు అధికారుల అంతు చూస్తామ‌ని బెదిరించారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రి ఫోనూ వ‌ద‌ల‌కుండా ట్యాపింగులు చేసిన ఈ నేత‌లు.. ఇప్పుడు హ్యాకింగుల గురించి మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా వారు త‌గ్గ‌డం లేదు.

Advertisement

సీఎం రేవంత్ అక్క‌డ ర‌క్ష‌ణ‌, పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌లు..అని జాతికి గొప్ప సందేశం ఇస్తున్న వేళ‌.. ఇక్క‌డ కీల‌క‌మైన పోలీస్ శాఖ‌ను చుల‌క‌న చేసి మాట్లాడే దోర‌ణి పాల‌కుల‌కు, ప్ర‌తిప‌క్షాల‌కు .. అంతిమంగా జ‌నాల‌కు మంచిది కాద‌నే అభిప్రాయాలైతే వ్య‌క్త‌మవుతున్నాయి. లాగులు పలిగేదాకా కొట్టండి.. అని త‌మ అధినేతే బాహాటంగా మాట్లాడే సంద‌ర్బంలో పోలీస్‌ను వెంటాడుతామ‌నే కామెంట్ కేటీఆర్, హ‌రీశ్‌లాంటి నేత‌ల నుంచి రావ‌డం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు. అంతిమంగా ప‌దేళ్ల పాల‌కులు.. ఇవాళ దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారా? అంటే….. వారి చేష్ట‌లు, మాట‌లు అలానే ఉన్నాయంటున్నారు జ‌నం.

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

Big Stories

Advertisement
×