E-Paper
Advertisement

రూటు మార్చిన వైసీపీ.. మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

రూటు మార్చిన వైసీపీ..  మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్
Advertisement

AP Political: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? కూటమి చేసే పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందా? జగన్ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా అదే రాగం అందుకున్నారా? తాజాగా రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

Advertisement

గురువారం కడపలో మీడియాతో మాట్లాడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లు కేవలం వైయస్సార్ పుణ్యమేనని అన్నారు. పోతిరెడ్డిపాడు, జీయన్‌యస్‌యస్ లాంటి కీలక ప్రాజెక్టులు ఆయన కట్టించినవేనని అన్నారు.

గాలేరు-నగరి, గండికోట ప్రాజెక్ట్‌లకు ఎన్టీఆర్ పేరు పెడితే వైయస్సార్ పూర్తి చేశారని కుండబద్దలు కొట్టేశారు. రాయలసీమలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఏ మాత్రం లేదన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ లాక్కున్న రోజు 1995 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదన్నారు. నికర జలాలతో ప్రాజెక్ట్ కట్టిన ఘనత వైయస్సార్‌కి ఆ క్రెడిట్ దక్కుతుందన్నారు.

Advertisement

ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్ఆర్‌కే చెందుతుంది

గండికోట ప్రాజెక్ట్‌కి మూడు టీయంసీ చాలని సీఎం చంద్రబాబు జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దాన్ని 20 టీఎంసీలుగా మార్చిన ఘనత వైయస్సార్‌కు దక్కుతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమన్నారు. అదే సమయంలో అమరావతికి 2 లక్షలు కోట్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

గొల్లపల్లె ప్రాజెక్ట్ వల్లే అనంతపురంకు కియా ప్రాజెక్ట్ వచ్చిందంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. గొల్లపల్లె ప్రాజెక్ట్ పూర్తి చేసింది వైయస్ఆరేనని, రాయలసీమలో హైకోర్టు ఉంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. దోపిడి కోసం అమరావతి నిర్మాణం చేస్తున్నారని, లక్షల కోట్లు అప్పులు చేసి మా ప్రాంతంపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.

ALSO READ: మంత్రి లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్స్.. ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న, జనసేనలో చర్చ

కూటమి తప్పులు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అధినేత బాటలో వైసీపీ నేతలు నడుస్తున్నారు. వైసీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, కూటమి పనులు చేస్తుంటే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×