E-Paper
Advertisement

‘పాపం ప్రతాప్’ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. ప్రీమియర్లు క్యాన్సిల్ అయినట్టేనా?

‘పాపం ప్రతాప్’ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. ప్రీమియర్లు క్యాన్సిల్ అయినట్టేనా?
Advertisement

Papam Prathap: ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డు సినిమాల విడుదలపై కోలుకోలేని దెబ్బ వేస్తోంది. సినిమా విడుదలకు గంటల సమయం ముందుగా విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు సెన్సార్ బోర్డ్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయాయి అయితే తాజాగా మరో సినిమా విడుదలపై సెన్సార్ వ్యవహార శైలి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రముఖ నటుడు తిరువీరు(Thiruveer) హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమా(Papam Prathap) ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ నేపథ్యంలోనే నేడు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లు ప్రసారం చేయనున్నారు.

పాపం ప్రతాప్ కు సెన్సార్ సమస్యలు..

ఇలా ప్రీమియర్లకు సర్వం సిద్ధం అయినప్పటికీ సెన్సార్ బోర్డు నుంచి అనుమతి లభించకపోవడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ అవుతున్నారు. ఈ సినిమాకు విభిన్న రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇలా చివరి నిమిషంలో సెన్సార్ బోర్డు కారణంగా చిక్కులు ఎదురుకావడంతో చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అనుమతి తెలపకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.

NOC సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే..

Advertisement

సెన్సార్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం.. సాధారణంగా ఏదైనా ఒక సినిమాలో జంతువులకు సంబంధించిన సన్నివేశాలను పెడితే కనుక తప్పనిసరిగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పాపం ప్రతాప్ సినిమాకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకపోవడంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరి కొన్ని గంటలలో ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి అడ్డంకులు ఎదురు కావడం అనేది బాధాకర విషయం అని చెప్పాలి

తక్కువ టికెట్ ధరతో రాబోతున్న పాపం ప్రతాప్..

Advertisement

మరి సెన్సార్ బోర్డు అడిగిన విధంగానే అనిమల్ వెల్ఫేర్ బోర్డు అఫ్ ఇండియా నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్ అందజేస్తేనే ఈ సినిమా యధావిధిగా సాయంత్రం ప్రీమియర్లు అలాగే రేపు విడుదలకు నోచుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరికి చేరువ కావాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్ ధరలను కూడా పూర్తిగా తగ్గించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి టైంలో సెన్సార్ నుంచి ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో చిత్ర బృందం ఆందోళన చెందుతున్నారు మరి ఈ సినిమా విషయంలో చిత్రబృందం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Also Read: మృణాళ్ సినిమా హిట్ అవ్వాలంటే మూవీలో వాళ్లు చనిపోవాల్సిందేనా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×