E-Paper
Advertisement

Kerala Medu Vada Recipe: కేరళ స్టైల్ మెదు వడలు.. ఇంట్లోనే క్రిస్పీగా తయారు చేయండిలా !

Kerala Medu Vada Recipe: కేరళ స్టైల్ మెదు వడలు.. ఇంట్లోనే క్రిస్పీగా తయారు చేయండిలా !
Advertisement

Kerala Medu Vada Recipe: సౌత్ ఇండియాలో బ్రేక్ ఫాస్ట్ అనగానే..అందరికీ గుర్తొచ్చేది వేడివేడి ఇడ్లీ , క్రిస్పీగా ఉండే మెదు వడ. ముఖ్యంగా కేరళ స్టైల్‌లో చేసే మెదు వడలు పైన కరకరలాడుతూ.. లోపల దూదిలా మెత్తగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తాయి. సరైన పద్ధతిలో పిండిని రుబ్బడం, అవసరం అయిన అన్ని పదార్థాలు కలపడం ద్వారా హోటల్ స్టైల్ వడలను మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో ఈ వడలను తింటే.. ఆ రుచే వేరు. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

Advertisement

మినపప్పు: 2 కప్పులు

పచ్చిమిర్చి: 3-4

Advertisement

అల్లం:ఒక అంగుళం ముక్క

కరివేపాకు:రెండు రెమ్మలు

మిరియాలు: 1 టీస్పూన్

ఉల్లిపాయ: 1

బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు: రుచికి తగినంత

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:
1. మొదట మినపప్పును శుభ్రంగా కడిగి, కనీసం 3 నుంచి 4 గంటల పాటు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి. పప్పు బాగా నానితేనే వడలు మెత్తగా వస్తాయి.

2. నానిన పప్పులోని నీటిని పూర్తిగా వడకట్టి, గ్రైండర్‌లో లేదా మిక్సీలో వేయాలి. రుబ్బేటప్పుడు నీటిని చాలా తక్కువగా (అవసరమైతేనే స్పూన్లతో) పోయాలి. పిండి వెన్నలా మెత్తగా, గట్టిగా ఉండాలి.

3. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, చేత్తో ఒకే దిశలో 5 నిమిషాల పాటు బాగా కలపాలి. దీనివల్ల పిండిలో గాలి చేరి వడలు గుల్లగా వస్తాయి.

4. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, మిరియాల పొడి, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

5. బాణలిలో నూనె వేడి చేయాలి. చేతిని నీళ్లతో తడుపుకుని, కొంచెం పిండిని తీసుకుని గుండ్రంగా చేసి మధ్యలో రంధ్రం చేయాలి.

6. కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వడలను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీయాలి.

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×