ఇడ్లీ ఎంతో మంది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్. సాధారణంగా ఇడ్లీని సాంబార్, కొబ్బరి చట్నీతో తింటారు. అయితే చాలా సార్లు ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతాయి. అలాంటి సమయంలో మిగిలిన ఇడ్లీలతో చాలా రుచికరమైన ఇడ్లీ ఫ్రై తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ వంటకాన్ని చాలా ఇష్టంగా తింటారు.
ఇడ్లీ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీలు – ఆరు
నూనె – మూడు స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కరివేపాకులు – గుప్పెడు
ఆవాలు – అర స్పూన్
కారం – అర స్పూన్
మిరియాల పొడి – చిటికెడు
చాట్ మసాలా – ఒక స్పూన్
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
Also read: Simple Facepack: ఇంట్లో దొరికే ఈ 3 పదార్థాలతో ముఖాన్ని తెల్లగా మెరిపించేయండి
ఇడ్లీ ఫ్రై రెసిపీ
1. ముందుగా ఇడ్లీలను తీసుకుని చిన్న ముక్కలుగా లేదా పొడవుగా కట్ చేయాలి.
2. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె పోసి చిన్న మంటపై వేడి చేయాలి.
3. నూనె వేడయ్యాక ఇడ్లీ ముక్కలను అందులో వేసి వేయించాలి.
4. ఇడ్లీ ముక్కలు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
5. బయట భాగం కరకరలాడేలా ఉండాలి. తర్వాత వాటిని బయటకు తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో మిగిలిన నూనెలో ఆవాలు వేయాలి.
7. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలి.
8. తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.
9. ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత అందులో కారం, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
10. ఇప్పుడు ముందుగా వేయించిన ఇడ్లీ ముక్కలను పాన్‌లో వేసి బాగా కలపాలి.
11. అన్ని ముక్కలకు మసాలా సమంగా పట్టేలా కలపాలి. తర్వాత చాట్ మసాలా లేదా ఇడ్లీ పొడి చల్లి మరోసారి బాగా కలపాలి.
12. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే రుచికరమైన ఇడ్లీ ఫ్రై రెడీ అవుతుంది.
Also read: Bitter gourd: ఈ చిన్న చిట్కాలు కాకరకాయలోని చేదును తీసేయండి, పిల్లలు కూడా తింటారు
ఈ ఇడ్లీ ఫ్రైను వేడిగా ఉన్నప్పుడే తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దీనిని టమాటా సాస్, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో కూడా తినవచ్చు. సాయంత్రం టీతో కలిసి తింటే మంచి స్నాక్‌గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా పెట్టవచ్చు.