E-Paper
Advertisement

Lunch Box Ideas: ఆఫీస్ లేదా స్కూల్.. ఈ సమ్మర్‌లో మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచే హెల్తీ లంచ్ ఆప్షన్స్!

Lunch Box Ideas: ఆఫీస్ లేదా స్కూల్.. ఈ సమ్మర్‌లో మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచే హెల్తీ లంచ్ ఆప్షన్స్!
Advertisement

Lunch Box Ideas: ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. మసాలాలు ఎక్కువగా ఉన్న బిర్యానీలు లేదా ఆయిల్ ఫుడ్స్ తింటే కడుపులో మంట, అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే వేసవిలో లంచ్ బాక్స్ అంటే.. కేవలం ఆకలి తీర్చడమే కాదు. అది మనల్ని రోజంతా యాక్టివ్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచేలా ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉండి.. త్వరగా అరిగే ఐదు అదిరిపోయే.. సమ్మర్ లంచ్ బాక్స్ రెసిపీలు మీ కోసం..

టాప్- 5 సమ్మర్ లంచ్ బాక్స్ ఐడియాస్:
వేసవిలో చల్లదనాన్నిచ్చే 5 రకాల వంటకాలు మీ లంచ్ బాక్స్‌ని టేస్టీగా, హెల్తీగా మారుస్తాయి.

Advertisement

1. చల్లని కమ్మని పెరుగన్నం:
వేసవికి పెరుగన్నాన్ని మించిన అమృతం లేదు. ఇది చర్మాన్ని, కడుపుని చల్లబరుస్తుంది.

ఎలా చేయాలి?: అన్నాన్ని మెత్తగా ఉడికించి.. పాలు లేదా పెరుగు కలపాలి. దీనికి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరతో పోపు పెట్టాలి.

Advertisement

చిట్కా: బాక్స్ తీసే సమయానికి పెరుగన్నం పుల్లగా అవ్వకుండా ఉండాలంటే.. అన్నం కలిపేటప్పుడు కొద్దిగా పాలు కలపండి. పైన కొన్ని దానిమ్మ గింజలు లేదా గ్రేప్స్ వేస్తే భలే రుచిగా ఉంటుంది.

2. నిమ్మకాయ పులిహోర లేదా లెమన్ రైస్:
నోటికి రుచిగా, కడుపుకు తేలికగా ఉండే ఆప్షన్ ఇది. నిమ్మకాయలోని విటమిన్ సి ఎండ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది.

ఎలా చేయాలి?: పొడిపొడిగా వండిన అన్నంలో నిమ్మరసం, పసుపు, ఉప్పు కలపాలి. వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి, కరివేపాకుతో పోపు వేయాలి.

చిట్కా: దీనికి సైడ్ డిష్‌గా కొంచెం పెరుగు లేదా ఉడికించిన ఎగ్ పెట్టుకుంటే ప్రోటీన్ కూడా అందుతుంది.

3. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ విత్ పనీర్ :
బరువు తగ్గాలనుకునే వారికి లేదా లైట్ గా తినాలనుకునే వారికి ఇది బెస్ట్.

ఎలా చేయాలి?: కీరదోస, టమాటో, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకోవాలి. అందులో కొంచెం నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా చల్లాలి. ప్రోటీన్ కోసం పనీర్ ముక్కలు లేదా ఉడికించిన శనగలు కలపాలి.

చిట్కా: కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఇది డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.

4. పుదీనా రైస్ :
పుదీనా సహజంగానే చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. దీని సువాసన వేసవిలో ఆకలిని పెంచుతుంది.

ఎలా చేయాలి?: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని పేస్ట్‌లా చేసి పోపులో వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం కలిపితే చాలు.

చిట్కా: మసాలాలు తక్కువగా వాడితేనే ఇది సమ్మర్ కి బాగుంటుంది. దీనికి రైతా (పెరుగు పచ్చడి) కాంబినేషన్ అదిరిపోతుంది.

5. రాగి అంబలి లేదా రాగి జావ :
అన్నం తినాలని లేనప్పుడు రాగి జావ అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగి ఒంటికి చాలా చలవ చేస్తుంది.

ఎలా చేయాలి?: రాగి పిండిని ఉడికించి చల్లారబెట్టాలి. అందులో పలచని మజ్జిగ, కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలిపి బాక్స్‌లో పోసుకోవాలి.

చిట్కా: ఇది తాగితే కడుపు నిండుగా ఉంటుంది.అందుకే ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.

Also Read: రోటీ, పరాటాల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ట్రెడిషనల్ పంజాబీ బైంగన్ బర్తా రెసిపీ ఇదిగో

సమ్మర్ బాక్స్‌లో ఉండాల్సిన మరికొన్ని..
మజ్జిగ : ఒక బాటిల్‌లో మజ్జిగ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే మధ్య మధ్యలో తాగడానికి బాగుంటుంది.

పండ్లు: పుచ్చకాయ ముక్కలు లేదా కర్బూజా ముక్కలు విడిగా చిన్న బాక్స్‌లో పెట్టుకోండి.

స్ప్రౌట్స్ : ఎనర్జీ కోసం కొన్ని మొలకెత్తిన గింజలు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×