E-Paper
Advertisement

‘సతీ లీలావతి’గా లావణ్య త్రిపాఠి ఎలా చేసిందంటే?.. ఫుల్ రివ్యూ..

‘సతీ లీలావతి’గా లావణ్య త్రిపాఠి ఎలా చేసిందంటే?.. ఫుల్ రివ్యూ..
Advertisement

Sathi Leelavathi Review : లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ ఒక మిస్టరీ థ్రిల్లర్. పెళ్లి తర్వాత కొన్ని సెలెక్టివ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ అందాల రాక్షసి ‘సతీ లీలావతి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. అయితే ఈ సినిమా ఫుల్ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చూసేద్దామా..

Read also-ఓటీటీలోకి రణవీర్ సింగ్ పాన్ ఇండియా ఫుల్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్ 2’.. ఫుల్ డిటైల్స్ ఇవే..

కథ ఏంటంటే..

Advertisement

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సక్సెస్‌ఫుల్ సినిమా డైరెక్టర్. తన భర్త రామ్ సేతు (దేవ్ మోహన్) అంటే ఆమెకు ప్రాణం. అయితే, రామ్ సేతు మాత్రం నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతేకాదు, లీలావతికి విడాకులు ఇచ్చి నికోలాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన భర్తను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని లీలావతి ఒక వినూత్నమైన ప్లాన్ వేస్తుంది. అసలు ఆ ప్లాన్ ఏంటి, దాని వల్ల మళ్లీ తన భర్తను దక్కించుకుందా అన్నది అసలు కథ. అది ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు..

లావణ్య త్రిపాఠి తన కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రలో కనిపించింది. లీలావతిగా ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. భర్తను కాపాడుకోవాలనే తపన ఉన్న భార్యగా ఎమోషన్స్‌ను బాగా పండించింది. నరేష్ తన అనుభవంతో మెప్పించగా, సప్తగిరి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. దేవ్ మోహన్, మడోన్నా వీరిద్దరూ తమ పాత్రల పరిధి మేరకు నటించినప్పటికీ, వారి పాత్రల చిత్రీకరణ అంత బలంగా లేదు.

విశ్లేషణ

Advertisement

సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఇల్లు పరిసరాలను అందంగా చూపించారు. అయితే, సినిమాకు ప్రధాన బలహీనత ఎడిటింగ్, స్క్రీన్ ప్లే. కథలో వేగం లేదు. ముఖ్యంగా డబ్బింగ్ విషయంలో చాలా అశ్రద్ధ వహించినట్లు కనిపిస్తుంది. ఇది ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని తగ్గిస్తుంది. సంగీతం పరంగా మిక్కీ జే మేయర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఎన్నో హిట్ సినిమాలను అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు తగిన న్యాయం చేయలేకపోయారు.

Read also-బాలీవుడ్ పై సిమ్రాన్ ఆగ్రహం..సౌత్ నటీనటులకు అవమానం తప్పదు!

దర్శకుడు కామెడీ ఎంటర్టైనర్‌గా దీన్ని మలచాలని చూసినా, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అది సాధ్యపడలేదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఎమోషన్ చాలా తక్కువగా ఉంది. సినిమా ప్రథమార్ధం పర్వాలేదనిపించినా, ద్వితీయార్ధం మాత్రం మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఊహించిన విధంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, రిఫరెన్స్‌లను వాడి మెగా అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. అవి ఎంతవరకూ సినిమాకు ప్లస్ అవుతాయే మున్ముందు చూడాలి మరి.. మొత్తానికి ‘సతీ లీలావతి’ ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా. కథలో కొత్తదనం ఉన్నా, కథనంలో పట్టు లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు.

బలాలు..

  • లావణ్య, దేవ్ మోహన్ మధ్య కెమిస్ట్రీ.
  • సంభాషణలు
  • క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్

బలహీనతలు..

  • సెకండ్ హాఫ్‌లో కొంత సాగదీత
  • క్లైమాక్స్

మొత్తంగా.. ఈ సినిమా కుటుంబ ఫ్రేక్షకులు ఓకే అనిపించినా.. ఓవరాల్‌గా మెప్పించలేక పోయింది..

Sathi Leelavathi Rating – 2 / 5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×