E-Paper
Advertisement

BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?
Advertisement

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సరికొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఎల్లుండి ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌‌చార్జిల్లో వణుకు పుడుతున్నట్టు సమాచారం. గతంలో మోడీ వచ్చిన సమయంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలకు చివాట్లు పెట్టారు. అంతర్గత కుమ్ములాటలు మాని అధికారంలోకి వచ్చేలా కష్టపడాలని హితవు పలికారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయినా మీరంతా ఏం చేస్తున్నారని అంతర్గత భేటీలో వారికి క్లాస్ పీకినట్టు తెలిసింది.ఈ విషయం కాస్త బయటకు రావడంతో రాష్ట్ర నాయకత్వం సైతం ఎంపీలకు మరోసారి క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.అంతర్గత సమావేశంలో చర్చించిన అంశం బయటకు ఎలా వచ్చిందని ఫైర్ అయినట్టు తెలిసింది.

త్వరలోనే పార్టీలో ఫిల్టర్..

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాలు (బెంగాల్,పుదుచ్చేరి, అస్సాం)లో సత్తా చాటిన విషయం తెలిసిందే.వచ్చే ఏడాది పంజాబ్, యూపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు 2028 చివర్లో జరగాల్సిఉన్నది. అయితే, ఇప్పటి నుంచే బీజేపీ ఆపరేషన్ తెలంగాణ చేపట్టనున్నట్టు సమాచారం. బెంగాల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన సునీల్ బన్సల్, భూపేంద్రయాదవ్ వంటి చాణక్య నేతలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నారు.రాష్ట్రంలో పార్టీ అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నది.అందుకు గల కారణాలు.. నేతల మధ్య ఆధిపత్య పోరు, ఎవరు పార్టీకోసం నిజంగా పనిచేస్తున్నారు? ఎవరు నటిస్తున్నారో వారి చిట్టా తీస్తారని తెలుస్తోంది. అనంతరం ఆ నివేదికను పార్టీ జాతీయ అధిష్టానానికి పంపనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మోడీ ఏం చెప్తారు?

Advertisement

తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్న ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.ఆ సభలో ఆయన ఏం మాట్లాడుతారు? తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారో ప్రజలకు వివరిస్తారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మీద ఎప్పటిలాగే విమర్శలు చేసి వెళ్లిపోతారా? అనేది తెలియాల్సి ఉన్నది. మీటింగ్ అయిపోయాక వెంటనే తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారా? లేక మరోసారి ఎంపీలు, కేంద్రమంత్రులతో ఆయన సమావేశం నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది. ఒకవేళ మోడీ అంతర్గత సమావేశం నిర్వహించకపోతే స్థానిక ఎంపీలు ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే మోడీ ఏం అంటారో అని భయంలో జంకుతున్నట్టు సమాచారం.

BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

Advertisement

ప్రతి ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. మరి దీనిమీద రాష్ట్ర నాయకత్వం ఎటువంటి కౌంటర్ ఇవ్వడం లేదు. కానీ, బెంగాల్ వంటి రాష్ట్రంలోనే ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ.. తెలంగాణలో పొత్తుతో వెళ్తుందా?లేదా ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి అధికారంలోకి వస్తుందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే బీజేపీకి కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే మంచి పట్టు ఉన్నది. క్షేత్రస్థాయిలో పార్టీకి కేడర్ లేదు. గెలుపు గుర్రాలు సైతం లేరు. డబ్బులు ఖర్చు చేసేవారు తక్కువే. ఇన్ని మైనస్‌ల మధ్య బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అంతధీమాగా ఎలా ఉందనేది బిగ్ క్వశ్చన్. అందుకోసం ఎటువంటి రాజకీయ ఎత్తులు వేయనున్నారని రానున్న కాలమే సమాధానం చెప్పాలి.

 

 

Related News

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!

కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !

Big Stories

Advertisement
×