E-Paper
Advertisement

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!
Advertisement

Oh sukumari Movie Review:హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువ అనే భయంతో ఎక్కువ సినిమాలు చేసేసానంటూ చెప్పిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. తెలుగులో నటించిన 6వ చిత్రం ఓ సుకుమారి.. మసూద చిత్రంతో హీరోగా తనను తాను నిరూపించుకున్న తిరువీర్ హీరోగా.. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణంలో జూలై 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ మంచి రాజు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరించారా? లేదా? ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే..

యాదగిరి (తిరువీరు) తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి. పల్లెటూర్లో సర్పంచ్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతడి తమ్ముడు (గవిరెడ్డి) తో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. వీరి తాత.. తమకున్న 80 ఎకరాల ఆస్తి కావాలంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికి ముందుగా మగ బిడ్డ కలిగితే వారికే చెందాలి అని వీలునామా రాసి ఉంచడంతో ఇద్దరూ కూడా పెళ్లి కోసం పలు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇక అన్న కంటే ముందే తమ్ముడు.. ఆస్తికోసం అప్పటికే గర్భంతో ఉన్న ఒక మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇక యాదగిరి కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ఊరికి చెందిన దామిని(ఐశ్వర్య రాజేష్)ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. అయితే ఆమె గురించి తెలుసుకోకుండానే తన తండ్రిని ఒప్పించి వివాహం చేసుకుంటాడు. ఊరి వాళ్లు కూడా దామినేని ముట్టుకుంటే కరెంటు షాక్ తగులుతుంది అనే విషయం దాచి .. ఊరంతా కలిసి పెళ్లి చేస్తారు. శోభనం రోజు ఆ విషయం తెలుసుకున్న యాదగిరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి.. అసలు దామినిని ముట్టుకుంటే ఎందుకు షాక్ తగులుతుంది? ఈ విషయం తెలుసుకున్న యాదగిరి ఏం చేశాడు ?చివరికి తాత చెప్పిన ఆ 80 ఎకరాలు ఎవరికి దక్కాయి? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

ALSO READ:The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

నటీనటుల ఫెర్మార్మెన్స్..

తిరువీర్ వాస్తవానికి మంచి యాక్టర్ అయినప్పటికీ ఈమధ్య ఎందుకో కథలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. అదే రొటీన్ నటన, సిల్లీ కామెడీతో బాగా బోర్ కొట్టించాడు. ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే.. ఎప్పుడూ దమ్మున్న కథలే ఎంచుకుంటుంది. కానీ ఈసారి ఎంచుకున్న క్యారెక్టర్ లో పసలేదు. ఇకపోతే తన వంతు అయితే ఆమె గట్టిగానే కష్టపడింది. మిగతా నటీనటుల విషయానికి వస్తే.. పెళ్లిళ్ల ఫోటోలు తీసుకునే వాడి పాత్రలో విష్ణు ఓయ్ కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించాడు . అలాగే మురళీధర్ గౌడ్, ఝాన్సీ లాంటి వాళ్లకి పెద్దగా స్క్రీన్ స్పేస్ లభించలేదు.

టెక్నికల్ ముచ్చట్లు:

Advertisement

ఈ సినిమాని థియేటర్లలో చూస్తుంటే ఏదో యూట్యూబ్ షార్ట్ ఫిలిం చూసినట్లే అనిపిస్తుంది. పెట్టిన బడ్జెట్ మొత్తం వేస్ట్ అని అనిపిస్తుంది . కెమెరా పనితనం అసలు బాగోలేదు. మ్యూజిక్ అరకొర గానే ఉంది. ఎడిటర్ ఇంకొన్ని సీన్లు కట్ చేసి ఉంటే పబ్లిక్ కి కాస్త సినిమాపై ఆసక్తి కలిగేదేమో.

ప్లస్ పాయింట్లు:

ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు

అక్కడక్కడ పరవాలేదు అనిపించిన కామెడీ

మైనస్ పాయింట్లు:

డైరెక్టర్ భరత్ దర్శన్ రాసుకున్న కథలో మ్యాటర్ లేదు. తీసిన విధానంలో గమ్మత్తు లేదు. హీరోయిన్ ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే లైన్ పట్టుకొని సినిమా మొత్తం లాగదీద్దాం అంటే ఎలా నడుస్తుంది.. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ అసలు ప్రేక్షకులకు ఎక్కలేదు.

చివరిగా:

కామెడీ పేరుతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు కానీ దీనిని చూస్తే నవ్వు రాకపోగా చిరాకు వేస్తుంది అనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతోంది. అసలు ఈ సినిమా థియేటర్ల వరకు ఎలా వచ్చిందో ఏమో కానీ ఈ కరెంటు షాక్ సినిమా ఖచ్చితంగా పబ్లిక్ కి గట్టిగానే తగిలింది.

రేటింగ్: 1.75/5

Related News

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

8 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ఒరిజినల్ తెలుగు సిరీస్.. ‘సూపర్ సుబ్బు’ అనిపించారా ?

Big Stories

Advertisement
×