E-Paper
Advertisement

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన జై షా…ఆ ప్లేయ‌ర్ కు శిక్ష త‌గ్గింపు?

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన జై షా…ఆ ప్లేయ‌ర్ కు శిక్ష త‌గ్గింపు?
Advertisement

Mohammad Nawaz Banned Following ICC Anti-Doping Breach:  ఐసీసీ ( ICC) బాస్ జై షా పైన (Jay shah) తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ దేశానికి అమ్ముడుపోయాడని… అతనిపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏ ఒక్కరు అనుకూలంగా వ్యవహరించిన ఇండియన్స్ చాలా సీరియస్ అవుతారన్న సంగతి తెలిసిందే. ఐసీసీ బాస్ హోదాలో ఉన్న జై షా, పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ నవాజ్ కు అనుకూలంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న మహమ్మద్ నవాజ్ (Pakistan Star Mohammad Nawaz ) నిషేధాన్ని తగ్గించారు జై షా. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్ కు అనుకూలంగా వ్యవహరించాడని.. ఐసీసీ చైర్మన్ హోదాలో ఉన్న జై షాను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. అతనిపై దేశద్రోహి ముద్ర కూడా వేస్తున్నారు. అమిత్ షా కొడుకు అయినప్పటికీ.. పాకిస్తాన్ కు ఎవరు సపోర్ట్ గా నిలిచిన ద్రోహి కింద చూస్తామంటూ క్రికెట్ అభిమానులు రెచ్చిపోతున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నవాజ్.. శిక్ష తగ్గించిన ఐసీసీ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మహమ్మద్ నవాజ్ డోపింగ్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 2026 టీ20 ప్రపంచ కప్ సమయంలో నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా డోపింగ్ టెస్టులు నిర్వహించగా… అందులో మనోడు గంజాయి తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయాడు. ఈ క్రమంలో వెంటనే మహమ్మద్ నవాజ్ పైన ఐసీసీ యాక్షన్ తీసుకుంది. ఫిబ్రవరిలో ఈ సంఘటన జరగగా.. మూడు నెలల పాటు నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఫిబ్రవరిలో సంఘటన జరిగితే… మే ఒకటో తేదీ నుంచి తాత్కాలిక సస్పెన్షన్ మహమ్మద్ నవాజ్ పై ప్రారంభమైంది.

శిక్షకాలం ఎందుకు తగ్గించారంటే ?

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నట్లు మహమ్మద్ నవాజ్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ కింద నవాజ్ కు మూడు నెలల తాత్కాలిక నిషేధం విధించారు. దీన్ని మేము ఒకటవ తేదీ నుంచి ప్రారంభించారు. అంటే ఈ లెక్కన ఆగస్టు త‌ర్వాతే మళ్లీ నవాజ్ క్రికెట్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో తాజాగా పెద్ద మనసు చేసుకున్న ఐసీసీ బాస్ జై షా, ఒక నెలపాటు శిక్షను తగ్గించారు. అంటే ఈ నెల‌లో మ‌ళ్లీ క్రికెట్ ఆడే అవ‌కాశం ద‌క్కింది. కానీ 2026 ఫిబ్రవరి 7వ తేదీ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ నుంచి మేము ఒకటవ తేదీ వరకు నవాజ్ సాధించిన వ్యక్తిగత రికార్డులను మాత్రం ఐసీసీ రద్దు చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ కు జై షా అనుకూలంగా వ్యవహరించాడని ట్రోలింగ్ జరుగుతోంది.

Advertisement

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

 

Related News

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి

జో రూట్ పెద్ద ఫులిష్ గాడు..99 ప‌రుగుల వ‌ద్ద నేనుంటే, సెంచ‌రీ చేసుకునేవాడు

41 ఏళ్ల‌ రొనాల్డో ఆడుతున్న‌ప్పుడు, రోహిత్ శ‌ర్మ ఆడితే మీకేం నొప్పి?

శ్రేయ‌స్ అయ్య‌ర్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…జాకబ్‌ బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే

వెన్నుపోటు పొడిచిన అట్కిన్సన్…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై రాజుకున్న వివాదం

2027 వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ ఔట్..19న లార్డ్స్ లో రిటైర్మెంట్?

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

Big Stories

Advertisement
×