E-Paper
Advertisement

Maithili Thakur: మైథిలి ఠాకూర్, ప్రధాని మోదీపై డీప్‌ఫేక్ దాడి.. సోషల్ మీడియాలో వికృత క్రీడ..!

Maithili Thakur: మైథిలి ఠాకూర్, ప్రధాని మోదీపై డీప్‌ఫేక్ దాడి.. సోషల్ మీడియాలో వికృత క్రీడ..!
Advertisement

Maithili Thakur: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ సాంకేతికత పెరిగే కొద్దీ అది కొందరు ఆకతాయిల చేతిలో ప్రమాదకరమైన ఆయుధంగా మారుతోంది. తాజాగా బీహార్ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అలీనగర్ స్థానం నుండి బీజేపీ తరఫున గెలుపొంది, బీహార్‌లోనే అత్యంత పిన్న వయస్కురాలిగా (25 ఏళ్లు) ఎమ్మెల్యే పగ్గాలు చేపట్టిన ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వికృత దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ‘జిధి పవన్ అహిర్’, ‘పంకజ్ యాదవ్’ అనే అకౌంట్ల పేరిట కృత్రిమ మేధ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన ప్రచారానికి తెరలేపారు. మైథిలి ఠాకూర్ ప్రధాని నరేంద్ర మోదీతో, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో పెళ్లి చేసుకున్నట్లుగా డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ ద్వారా నకిలీ ఫోటోలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా, పంకజ్ యాదవ్ అనే వ్యక్తి ప్రధాని మోదీపై కూడా ఒక అసభ్యకరమైన వీడియోను రూపొందించాడు. ఒక మహిళతో ప్రధాని సన్నిహితంగా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి, దానికి “ఓ అందమైన అమ్మాయితో మోదీ..” అంటూ హిందీలో జుగుప్సాకరమైన క్యాప్షన్లు జోడించాడు.

Advertisement

ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియా యాక్టివిస్ట్ అమృతా మిశ్రా (@Amrita_2121) ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బట్టబయలు చేశారు. సదరు వ్యక్తులు ఆర్జేడీ (RJD) పార్టీ సానుభూతిపరులని, వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ నిండా ఇలాంటి ద్వేషపూరిత పోస్టులే ఉన్నాయని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె బీహార్ పోలీసులను (@bihar_police), పాట్నా పోలీసులను కోరారు.

కేవలం తన సంగీత ప్రతిభతో స్వయంకృషితో పైకి వచ్చి, ఇప్పుడు ప్రజాసేవలోకి వచ్చిన ఒక యువతిపై ఇలాంటి దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం పిరికిపంద చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.

Advertisement

ఈ ఘటనపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేను, దేశ ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నీచమైన వీడియోలు సృష్టించడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని వారు ఆరోపిస్తున్నారు. ఏఐ (AI) టెక్నాలజీని సృజనాత్మకతకు కాకుండా, ఇలాంటి దుర్మార్గపు పనులకు వాడటం ప్రజాస్వామ్యానికి పెను ముప్పు. ఈ తరహా ఫేక్ వీడియోలు సమాజంలో అలజడి సృష్టించడమే కాకుండా, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి.

పోలీసు యంత్రాంగం ఇలాంటి సైబర్ నేరగాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం కేసు నమోదు చేసి వదిలేయకుండా, టెక్నాలజీని దుర్వినియోగం చేసి మహిళల పరువు తీస్తున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. లేదంటే భవిష్యత్తులో మరెందరో మహిళలు ఇలాంటి డీప్‌ఫేక్ దాడులకు బలయ్యే ప్రమాదం ఉంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×