E-Paper
Advertisement

Andhra King Thaluka Movie Review : ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ

Andhra King Thaluka Movie Review : ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ
Advertisement

Andhra King Thaluka Movie Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేస్తున్న సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఎనర్జి కనిపించడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈయనకు హిట్ లేదు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీపైన ఆయన ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఇది ఓ ఫ్యాన్ బయోపిక్. రామ్ ఫస్ట్ టైం పెన్ను పట్టుకుని ఓ పాట రాశాడు. అంతే కాదు ఓ పాట కూడా పాడాడు. వీటితో పాటు భాగ్యశ్రీ బోర్సె – రామ్ కెమిస్ట్రీ కూడా సినిమాపై హోప్స్ పెట్టుకునేలా చూసింది. ఈ రోజు రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం…

కథ :

ఆంధ్ర కింగ్ సూర్య కుమార్ (ఉపేంద్ర) తన 100 సినిమాకు బడ్జెట్ అడ్డంకులు వచ్చి ఆగిపోతుంది. 3 కోట్ల సాయం కోసం హీరో సూర్య కుమార్ చాలా ట్రై చేస్తాడు. ఉన్న ఇల్లును కూడా అమ్మాలని చూస్తాడు. అలాంటి టైంలో.. కనీసం కరెంటు కూడా అందుబాటులో లేని లంక గ్రామానికి చెందిన వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని).. హీరో అకౌంట్‌లో 3 కోట్లు డిపాజిట్ చేస్తాడు. తనకు ఇంత సాయం చేసిన సాగర్ ఎవరు..? అతని కథ ఏంటి? మహాలక్ష్మీ (భాగ్యశ్రీ బోర్సె)తో ఉన్న ప్రేమ కథేంటి ? లంక గ్రామాల్లో ఉండే సాగర్‌కి ఆ 3 కోట్లు ఎలా వచ్చాయి అనేది సినిమాలో చూస్తాం.

విశ్లేషణ :

Advertisement

హీరోల హీరోయిజం చూపించే సినిమాలను ఇప్పటి వరకు చూశాం. కానీ, ఈ సినిమాలో తన అభిమాన హీరో కోసం ఓ ఫ్యాన్ చూపించే ఫ్యానిజాన్ని డైరెక్టర్ మహేష్ బాబు చూపించాడు. ఓ అభిమాని కోసం హీరో వెతుక్కుంటూ వచ్చి కలుసుకోవడం అనేది ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్ ఇచ్చే అంశమే. ఆ ఒక్క సీన్‌ను థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేయించడం కోసం 2 గంటల 46 నిమిషాల సినిమాను రన్ చేయించాడు డైరెక్టర్. అదే సినిమాకు మైనస్ అయింది.

కథలోకి వెళ్లడానికి టైమేమీ తీసుకోలేదు. డైరెక్టర్ పాయింట్‌కి వచ్చాడు. ఆ తర్వాతనే ప్రేక్షకుడికి.. అభిమానికి అసలు పరిక్ష. హీరో రామ్ పోతినేని – హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె మధ్య కెమిస్ట్రీ పర్లేదు. కానీ, వారి మధ్య వచ్చే లవ్ సీన్స్‌ను కూడా సాగదీశారు అనేలానే ఉంది.

Advertisement

లంక గ్రామాల్లో కరెంట్ సప్లై లేదు.. 2002 సంవత్సరంలో జరిగిన కథ అని చెప్తూ వాటిని లాజిక్కులు వెతక్కుండా ఓ ప్రయత్నం చేశారు. లంక గ్రామంలో చిన్నపాటి థియేటర్ కట్టడం అనేది లాజిక్కు అందడం లేదు. ‘గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోయే ప్రొజెక్టర్..’ అని హీరో తండ్రి చేత ఓ డైలాగ్ అయితే పెట్టించారు కానీ, అదే.. సినిమా చూసే ఆడియన్ బుర్రకు తట్టదా అని ఆలోచించలేకపోయాడు డైరెక్టర్. అవును… సముద్ర తీరంలో అలా… ప్రొజెక్టర్ పెడితే.. గాలికి కొట్టుకుపోవడం తప్పా.. ఏం జరుగుతుంది. అలాగే సినిమా చూడటానికి రాజమండ్రి లాంటి టౌన్‌లో AC థియేటర్ విడిచిపెట్టి… సముద్రంలో అంత దూరం ప్రయాణించి సాగర్ థియేటర్‌కు ఎందుకు రావాలి..? ఇలాంటి కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఈ సినిమాలో…

వీటికి తోడు… ప్రిడిక్టబుల్ స్టోరీ. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు థియేటర్‌లో కూర్చున్న ఆడియన్ కథను అంచనా వేస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా ట్విస్ట్ లాంటివి లేకుండా.. ఆడియన్‌ మెదడుకు ఎలాంటి పని చెప్పకుండా.. సాధాసీదాగా వెళ్తుంది కథ.

అయితే, ఎమోషనల్ సీన్స్‌ మాత్రం సినిమాకు హైలైట్. హీరో – అభిమాని మధ్య వచ్చే సీన్స్. సాగర్ – మహాలక్ష్మీ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్. సాగర్ – వాళ్ల అమ్మానాన్నల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటినీ డైరెక్టర్ బాగా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వకపోవచ్చు.

ఫర్ఫామెన్స్ గురించి అంటే.. రామ్ పోతినేని ఎప్పటాలానే. లుక్స్ డిఫరెంట్ ఉన్నా.. నటనలో మాత్రం గత చిత్రాల్లో చూసినట్టే కనిపిస్తుంది. డైలాగ్ డెలవరీ కూడా అదో టోన్‌లో ఉంటుంది. ఉపేంద్ర.. ఆయనంతలో ఆయన నటించాడు. భాగ్యశ్రీ బోర్సె.. గ్లామర్ సినిమాకు చాలా ఉపయోగపడింది. మురళి శర్మ.. డైలాగ్స్ తక్కువ ఉన్నా.. పర్లేదు. రావు రమేష్… ఫుల్ లెన్త్ రోల్‌లో కనిపించినా… ఎక్కడా కనిపించడు. బహుశా రావు రమేష్ గత సినిమాల్లో ఫుల్ డామినేటివ్ పాత్రలు చేశాడు. అది ఇక్కడ లేకపోవడం వల్ల అలాంటి ఫీలింగ్ వచ్చిందేమో. కమెడియన్ సత్య పాత్రను కూడా అంతగా ఏం ఉపయోగించుకోలేదు.

టెక్నికల్‌గా.. ముందు సినిమా ఎడిటింగ్ మరింత చేయాల్సింది. కనీసం 20 నుంచి 25 నిమిషాలు ట్రిమ్ చేస్తే అవుట్ పుట్ మరోలా ఉండేదేమో. సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు కూడా పర్లేదు.

ప్లస్ పాయింట్స్ :

రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సె & ఉపేంద్ర
సెకండాఫ్
క్లైమాక్స్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

కథ & కథనం
ప్రిడిక్టబుల్ స్టోరీ
ట్విస్టులేమీ లేకపోవడం
ఫాస్టాఫ్
స్లో నరేషన్

మొత్తంగా… నిజమైన అభిమానికి ఈ సినిమా నచ్చుతుందా…??

Andhra King Thaluka Movie Rating : 2.5 / 5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×