E-Paper
Advertisement

PAK VS SL: పాకిస్తాన్ లో శ్రీలంక ప్లేయ‌ర్ల‌కు VVIP సెక్యూరిటీ.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

PAK VS SL: పాకిస్తాన్ లో శ్రీలంక ప్లేయ‌ర్ల‌కు VVIP సెక్యూరిటీ.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
Advertisement

PAK VS SL: పాకిస్తాన్ – శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రస్తుతం సందిగ్ధంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ తన సొంత గడ్డమీద శ్రీలంకతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఇందులో ఇప్పటికే ఒక మ్యాచ్ ముగిసింది. ఇక రెండవ మ్యాచ్ రావల్ పిండి వేదికగా నవంబర్ 13 గురువారం రోజున జరగాల్సి ఉంది. కానీ ఈ రెండవ వన్డే ని భద్రతా కారణాల దృశ్యా రీ షెడ్యూల్ చేశారు.

Also Read: Ind vs Sa 1st Test: టాస్ ఓడిన టీమిండియా.. ముగ్గురు స్పెషల్ బౌలర్లతో గిల్ స్కెచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Advertisement

ఇటీవల ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మహతి దాడితో శ్రీలంక క్రికెటర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ బాంబు దాడిలో 12 మంది మరణించారు. ఈ సంఘటన తర్వాత పాక్ లో మ్యాచ్ లు ఆడడానికి శ్రీలంక జట్టు భయపడుతోందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.

స్వదేశానికి వెళ్ళిపోతాం:

సుమారు 9 మంది శ్రీలంక ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్ళిపోతామని ఆ జట్టు మేనేజ్మెంట్ ని కోరారు. కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం అందుకు అంగీకరించలేదు. వన్డే సిరీస్ తో పాటు ముక్కోనపు సిరీస్ ని కూడా ముగించుకున్న తర్వాతే స్వదేశానికి రావాలని వారిని ఆదేశించింది. దీంతో శ్రీలంక ఆటగాళ్లు పాకిస్తాన్ లోనే ఉన్నారు. ఒకవేళ తమ ఆదేశాలను ఖాతరు చేయకుండా స్వదేశానికి తిరిగి వచ్చే ప్లేయర్లపై దర్యాప్తు ప్రారంభిస్తామని కూడా ఆ దేశ బోర్డు హెచ్చరించింది. ” మేము ప్లేయర్లతో సంప్రదింపులు జరిపాము. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో కలిసి వారి భద్రతకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చాము” అని తెలిపింది శ్రీలంక క్రికెట్ బోర్డు. శ్రీలంక క్రికెటర్లకు అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వి హామీ ఇవ్వడంతో శ్రీలంక బోర్డు వెనక్కు తగ్గినట్లు సమాచారం. వారి భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన హామీ ఇచ్చారట.

శ్రీలంక క్రికెటర్లకు భారీ భద్రత:

Advertisement

మోహ్సిన్ నఖ్వి శ్రీలంక క్రికెటర్లకు హామీ ఇచ్చిన విధంగానే వారికి అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పించారు. ఈ వన్డే సిరీస్ లో తొలి వన్డేలో ఇప్పటికే శ్రీలంక జట్టును ఓడించి 1-0 తో ఆదిక్యంలో ఉంది పాకిస్తాన్ జట్టు. ఇక రెండవ వన్డే నేడు రావల్ పిండి స్టేడియం వేదికగా జరగబోతోంది. ఈ రెండవ వన్డే కోసం శ్రీలంక జట్టు హోటల్ నుండి రావాల్పిండి మైదానానికి బయలుదేరింది.

Also Read: Mohsin Naqvi: పాకిస్తాన్ నుంచి పారిపోతామని బెదిరింపులు.. శ్రీలంక ప్లేయర్ల కాళ్ళు పట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ

ఈ క్రమంలో వారికి భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసింది పాకిస్తాన్. ఈ కాన్వాయ్ చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లో పర్యటిస్తున్నాడా..? అన్న విధంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శ్రీలంక క్రికెటర్లకు పాకిస్తాన్ ఏర్పాటు చేసిన భద్రతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీవీఐపీ సెక్యూరిటీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×