E-Paper
Advertisement

రివ్యూ: కామ్రేడ్‌ కళ్యాణ్‌.. మెప్పించిండా? 

రివ్యూ: కామ్రేడ్‌ కళ్యాణ్‌.. మెప్పించిండా? 
Advertisement

చిత్రం: కామ్రేడ్‌ కళ్యాణ్‌;

నటీనటులు: శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌, రాధికా శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు;

Advertisement

సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌; సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌; ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌;

నిర్మాత: వెంకట కృష్ణ కర్నాలి, సీత కర్నాటి;

రచన, దర్శకత్వం: జానకిరామ్‌ మారెళ్ల;

Advertisement

విడుదల: 09-10-2026

సినిమా కథ:

1992 నాటి ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కళ్యాణ్ (శ్రీవిష్ణు) మాడగులలోని ఒక సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. తన తల్లి (రాధికా శరత్‌కుమార్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతున్న కళ్యాణ్ ఊరికి ఒరియా అమ్మాయి సితార (మహిమా నంబియార్) వస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే సితార వాళ్ల అన్న చేసిన అప్పుల కారణంగా విలన్ బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) ఆ కుటుంబం వెనుక పడతాడు. ఆ అప్పు తాను తీరుస్తానని కళ్యాణ్ మాటిస్తాడు. ఆ డబ్బు కోసం కళ్యాణ్ ఎలాంటి సాహసాలు చేశాడు? ఈ కథలోకి నక్సలిజం, పోలీసులు ఎలా ఎంటరయ్యారు? చివరకు కళ్యాణ్ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేదే ఈ చిత్ర కథాంశం. కామెడీ ఎంటర్టైనర్ గా  వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అని తెలుస్తుంది.

సినిమా విశ్లేషణ:

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. నక్సలిజం, పోలీస్ బ్యాక్‌డ్రాప్ వంటి సీరియస్ పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఎక్కడా బోర్ కొట్టించకుండా పూర్తిగా వినోదాత్మకంగా మలచడానికి ప్రయత్నించారు. సినిమా ప్రారంభం మనుషుల అన్వేషణతో కాస్త సీరియస్‌గా ప్రారంభమైనా, ఆ తర్వాత పూర్తిగా శ్రీవిష్ణు మార్క్ కామెడీ జోన్‌లోకి వెళుతుంది. మొదటి భాగం అంతా నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతుంది. ద్వితీయార్థంలో ఎమోషన్స్‌తో పాటు ఫన్ కంటిన్యూ అయినప్పటికీ, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లాజిక్‌ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా కేవలం నవ్వుల కోసం చూస్తే ఈ సినిమా చక్కటి అనుభూతిని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ మొదలుకొని సెకండ్ హాఫ్ కి వరకు శ్రీవిష్ణు వన్ మ్యాన్ షోగా రావడంతో జనాలకు స్టోరీ బాగా నచ్చేసింది.

ప్లస్ పాయింట్లు:

శ్రీవిష్ణు స్వాగ్ మరియు సహజమైన కామెడీ టైమింగ్

సత్య, సుదర్శన్ కామెడీ ట్రాక్ (థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది)

ప్రథమార్థంలో వచ్చే ఫన్ ఎపిసోడ్స్

రాధికా శరత్‌కుమార్ మరియు ఇతర నటీనటుల అభినయం

డైలాగ్స్ కొన్ని సందర్భలలో

మైనస్ పాయింట్లు:

సెకండాఫ్‌ లో కొన్ని చోట్ల నెమ్మదించిన కథనం

సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లో లాజిక్ లెస్ సీన్స్

ఎడిటింగ్ కాస్త తగ్గించి ఉంటే బాగుండు

చివరి అఖరి మాటగా:

మంచి వినోదాన్ని పంచుతూ, ఎలాంటి టెన్షన్స్ లేకుండా వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి నవ్వుకోవడానికి ఓ చక్కటి ఆప్షన్ ఈ ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Rating : 2.5/5

Also Read :శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

Related News

‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. ప్రేమ గెలిచిందా? తండ్రి మాట గెలిచిందా?

‘అనకాపల్లి’ మూవీ రివ్యూ..రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ మెప్పించిందా?

సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ … సీఎం కొడుకు హిట్ కొట్టాడా?

‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ మూవీ రివ్యూ.. ఆఖరి చిత్రం ఎలా ఉందంటే?

తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ హిట్ కొట్టాడా?

తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ.. కార్తికేయ నిర్మాతగా సక్సెస్ కొట్టారా?

Big Stories

Advertisement
×