E-Paper
Advertisement

‘డోరతీ’ మూవీ రివ్యూ.. కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

‘డోరతీ’ మూవీ రివ్యూ.. కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Dorothy Movie Review:చిత్రం: డోరతీ
నటీనటులు: కీర్తి సురేశ్‌, సనంత్‌, రిషికాంత్, రామచంద్రన్‌ దురైరాజ్‌, సౌందరరాజ, జీవా సుబ్రమణియన్‌, ముత్తుకుమార్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్‌.తిరునావుక్కరుసు
ఎడిటర్‌: గణేశ్‌ శివ
నిర్మాత: జ్యోతి దేశ్‌పాండే, గునీత్‌ మోంగా కపూర్‌, అచిన్‌ జైన్‌
రచన, దర్శకత్వం: కార్తిక్‌ సుబ్బరాజ్

డోరతీ..సినిమా కథ:

1995 నాటి తమిళనాడు పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సుబ్బు (సనత్) గ్యాంగ్‌స్టర్ కుటుంబానికి చెందిన కుమారుడు. కార్తి (రిషికాంత్) అణగారిన వర్గానికి చెందిన యువకుడు. ఇద్దరూ చిన్ననాటి నుంచి విడదీయరాని ప్రాణ స్నేహితులు. సుబ్బు ఇంట్లో పరిస్థితులు హింసాత్మకంగా ఉన్నప్పటికీ, అతను మాత్రం చాలా మెతక మనిషిగా ఉంటాడు. ఆ కుటుంబంలోకి కోడలిగా ప్రవేశించే ‘డోరతీ’ (కీర్తి సురేష్) పాత్రతో సుబ్బుకి మంచి అనుబంధం ఏర్పడుతుంది. అయితే ఊహించని విధంగా డోరతీ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతుంది. ఆమె మరణం వెనుక తన కుటుంబసభ్యులే ఉన్నారని భావించిన సుబ్బు ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత సుబ్బు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? స్నేహితుడైన కార్తికి సుబ్బుకి మధ్య వచ్చిన విభేదాలు ఏంటి? చివరకు వీరిద్దరి కథ ఎలాంటి ముగింపునకు చేరింది అనేదే ఈ చిత్ర కథాంశం.

డోరతీ సినిమా విశ్లేషణ:

Advertisement

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఏ సినిమా చేసినా అందులో ఒక బలమైన సామాజిక అంశం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈసారి ఆయన సమాజంలో అంతగా చర్చించని లింగ వివక్ష, ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష వంటి సున్నితమైన పాయింట్‌ను ఎంచుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. కమర్షియల్ హంగులకు దూరంగా, ఒక ఆర్ట్ ఫిలిం ఫీలింగ్‌తో ఈ కథను డీల్ చేశారు. గతకాలపు నేపథ్యాన్ని ఎంచుకున్న విధానం, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. అయితే, దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బలంగా ఉన్నప్పటికీ, రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్‌ను మెప్పించేలా స్క్రీన్‌ప్లేను రక్తి కట్టించడంలో అక్కడక్కడా తడబడ్డారు. సెకండాఫ్‌లో వేగం మందగించడం వల్ల సినిమా కొంత నెమ్మదిగా సాగుతుంది.

also read:ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

డోరతీ మూవీ ప్లస్ పాయింట్లు:

Advertisement

సుబ్బు పాత్రలో సనత్ నటన, చూపించిన వేరియేషన్స్
ఇళయరాజా అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం
1995 నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన సినిమాటోగ్రఫీ, మేకింగ్
రిషికాంత్ అభినయం
కీర్తి సురేష్ పాత్ర (పరిధి చిన్నదైనా గుర్తుండిపోతుంది)
రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సాగే బోల్డ్ పాయింట్

డోరతీ మూవీ మైనస్ పాయింట్లు:

నెమ్మదిగా సాగే కథనం
కొన్ని సాగదీత సన్నివేశాలు
అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ జోనర్ లేదా ముగింపు సులభంగా కనెక్ట్ కాకపోవడం

చివరి అఖరి మాటగా:

మాస్ మసాలా ఎంటర్‌టైనర్లను ఆశించేవారికి కాకుండా, కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాలు, భావోద్వేగభరిత కథలను ఇష్టపడేవారికి ‘డోరతీ’ ఒక విభిన్నమైన అనుభూతిని పంచుతుంది.

Keerthy Suresh Dorothy Movie Rating :- 2.5/5

Related News

తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ.. కార్తికేయ నిర్మాతగా సక్సెస్ కొట్టారా?

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

Big Stories

Advertisement
×