E-Paper
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode October 2nd ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌: మనోజ్‌, రోహిణిలను విడదీసేందుకు ప్రభావతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా..?              

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode October 2nd ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌: మనోజ్‌, రోహిణిలను విడదీసేందుకు ప్రభావతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా..?              
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: అత్తయ్య నుంచి తనను కాపాడమని అందుకోసం ఏదైనా ప్లాన్‌ ఇవ్వమని రోహిణి భయపడుతూ మీనా, శృతిలను అడుగుతుంది. అందుకు శృతి వెటకారంగా మాట్లాడుతూ.. నువ్వు మమ్మల్ని ప్లాన్‌ అడగటమేంటి..? ఎవరిని ఎలా బోల్తా కొట్టించాలో మాకన్నా నీకే బాగా తెలుసు.. నీ దగ్గరే కన్నింగ్‌ ప్లాన్స్‌ చాలానే ఉంటాయి కదా అంటుంది. మీనా మాత్రం కామాక్షి దగ్గరకు వెళ్లి అత్తయ్యకు చెప్పమని చెప్పు అనగానే..

ఆవిడ చెబితే వింటుందా..? మామయ్య చెబితేనే అత్తయ్య వినడం లేదు కదా అంటుంది రోహిణి. అయితే ఏదైనా నాటకం ఆడి ఇంట్లో రోహిణి వల్లే అంతా హ్యపీగా ఉందని తెలిసేలా చేద్దామని శృతి ఐడియా ఇస్తే.. ఐడియా బాగుంది కానీ ఇంట్లో ఉన్న మీనా, బాలు ఎప్పటికైనా ఈ విషయం అత్తయ్యకు చెప్తారని అప్పుడు అత్తయ్య తనను ఇంట్లోంచి గెంటి వేస్తుందని భయపడుతుంది రోహిణి. అయితే మేము చెప్పినా చెప్పకపోయినా కామాక్షి చెప్తుందని అబద్దం చెప్పడం అత్తయ్యకు ద్రోహం చేయడం ఒక్కటేనని మీనా అనడంతో రోహిణి కోపంగా మీనాను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

రోహిణి తన రూంలోకి వెళ్లి మనోజ్‌కు దగ్గర అయినట్టు.. మనోజ్ తో రోమాన్స్‌ చేసినట్టు ప్రభావతి కల కంటుంది. తర్వాత ఉలిక్కిపడి లేచి వెంటనే మనోజ్‌ రూం దగ్గరకు వెళ్లి మనోజ్‌ను పిలుస్తుంది. మనోజ్‌ బయటకు రాగానే.. రోహిణితో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. దానికి దూరంగా ఉండమంటే ఎందుకు రూంలో గడియ పెట్టుకుని ఎందుకు పడుకున్నారు అంటూ ప్రశ్ని్స్తుంది. అది నిన్ను మాయ చేస్తుంది. తన మాటలు చేతలతో నిన్ను తన వశం చేసుకుంటుంది జాగ్రత్తగా ఉండు అంటూ ప్రభావతి చెప్పగానే.. మనోజ్‌ సరే అంటూ లోపలికి వెళ్లిపోతాడు. అంతా గమనిస్తున్న రోహిణి కోపంగా ప్రభావతిని తిట్టుకుంటుంది.

తర్వాత మీనా చెప్పినట్టు రోహిణి, కామాక్షి దగ్గరకు వెళ్తుంది. రోహిణిని చూసి కామాక్షి వెటకారంగా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అందుకు రోహిణి తన కష్టాలు చెప్పుకోవడానికి వచ్చానంటుంది. నీకు లోకంలో ఎవరికీ లేని కష్టాలు ఉన్నాయి మరి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంది. కోటీశ్వరురాలినని చెప్పి పెళ్లి చేసుకోవడం, ఎప్పుడో చచ్చిన తండ్రిని మళ్లీ చంపడం, బూడిద తీసుకురావడం, పార్లర్ అమ్మి అందులోనే పని చేయడం ఎన్ని కష్టాలో నీకు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అయినా రోహిణి అవేమీ పట్టించుకోకుండా ప్రభావతి తనను వేధిస్తున్న విషయం చెప్పి బాధపడుతుంది. అప్పుడే అక్కడకు ప్రభావతి వెళ్లడంతో రోహిణి షాక్‌ అవుతుంది.

Advertisement

ప్రభావతిని చూసిన రోహిణి బెడ్‌రూంలోకి వెళ్లి దాక్కుంటుంది. తాను అక్కడ ఉండటం ప్రభావతి చూస్తే చంపేస్తుందని భయపడుతుంది. అయితే కామాక్షి మాత్రం రోహిణిని బెడ్‌రూంలో పెట్టి లాక్‌ చేసి ప్రభావతితో హాల్లో కూర్చుని మాట్లాడుతుంది. అయితే బెడ్‌రూంలో ఏసీ వేసుకుని మాట్లాడుకుందామని ప్రభావతి వెళ్తుంటే.. లోపల ఏసీ పనిచేయడం లేదని కామాక్షి అబద్దం చెప్తుంది. ఏంటో విషయం ఇక్కడే చెప్పమని అడుగుతుంది. అందుకు ప్రభావతి ఊర్లోకి ఎవరో స్వామిజీ వచ్చారట. ఆయన దగ్గరకు వెళ్లి తాయెత్తు తీసుకొచ్చి రోహిణికి కట్టాలని మనోజ్‌, రోహిణిలను విడదీయాలని.. మనోజ్‌కు కోటీశ్వరురాలితో పెళ్లి చేయాలని చెప్తుంది. అంతా విన్న రోహిణి షాక్‌ అవుతుంది. అత్తయ్య అనుకున్నట్టే నా కాపురంలో నిప్పులు పోసేలా ఉంది అని బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Serial Today Episode October 2nd ‘పొదరిల్లు’ సీరియల్‌: గోపిక మనసును మహా మారుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode October 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినితో చాలెంజ్ చేసిన జ్యోత్స్న – సూరజ్ లో మార్పు వచ్చినట్టేనా..?              

Nindu Noorella Saavasam Serial Today Episode October 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ – పార్థు టూర్ క్యాన్సిల్ అవుతుందా…?    

లవ్ స్టోరీ బయటపెట్టిన హైపర్ ఆది..ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ!

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మామూలు సంపాదన కాదుగా?

సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!

ఏకంగా 50 కట్స్ తో టీవీలోకి ధురంధర్ 2.. ఎప్పుడు? ఏ ఛానల్ అంటే?

Big Stories

Advertisement
×