E-Paper

కొత్త మలుపు రివ్యూ: సింగర్ సునీత కొడుకు హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

కొత్త మలుపు రివ్యూ: సింగర్ సునీత కొడుకు హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

Kotha Malupu Movie Review: ప్రముఖ గాయని సునీత తన మధురమైన గొంతుతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె వారసుడు ఆకాష్ గోపరాజు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం, నేడు (జూన్ 12న) థియేటర్లలోకి వచ్చింది. కోనసీమ అందాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

 కథేంటంటే?

హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేసే జాలీ యూత్ కమల్ (ఆకాష్). ఒక ఫ్యామిలీ మ్యారేజ్ కోసం ఈస్ట్ గోదావరిలోని ఒక పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే పల్లెటూరి అమ్మాయిని చూసి ఫస్ట్ సైట్‌లోనే లవ్‌లో పడిపోతాడు. అయితే, ఒక రాత్రి అనుకోని ఇబ్బందుల్లో ఉన్న కమల్‌ను ముఖం తెలియని ఒక అపరిచిత యువతి కాపాడుతుంది. తనను సేవ్ చేసిన ఆ అమ్మాయి కోసం కమల్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ అన్వేషణలో వరలక్ష్మి అతనికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌లోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది.కట్ చేస్తే.. తను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినే అని కమల్‌కు తెలిసే టైమ్‌కి, ఆమె మరొకరితో ఉన్న ఫోటో అతనికి దొరుకుతుంది. దాంతో ఇద్దరి మధ్య డౌట్స్, అపార్థాలు మొదలవుతాయి. అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? వరలక్ష్మి ఫాస్ట్ ఏంటి? వీరిద్దరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా స్టోరీ.

విశ్లేషణ 

డైరెక్టర్ శివ కేసనకుర్తి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దానికి గోదావరి బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్ జోడించి ప్రెసెంట్ చేసిన విధానం బాగుంది. ఫస్టాఫ్ అంతా పెళ్లి సందడి, పల్లెటూరి వాతావరణం, హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో చాలా ఫ్రెష్‌గా, ఫన్ నోట్‌తో సాగిపోతుంది. ముఖ్యంగా గోదావరి స్టైల్ కామెడీ అలరిస్తుంది.

సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ కాస్త సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. ప్రేమలో అనుమానం పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్, ఒకరి గతాన్ని బట్టి వర్తమానాన్ని జడ్జ్ చేయకూడదు అనే పాయింట్‌ను క్లైమాక్స్‌లో హృద్యంగా ఆవిష్కరించారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే మంచి మెసేజ్ ఇవ్వడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తాయి. డ్రామా కూడా కొంతవరకు ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే?

కమల్ పాత్రలో ఆకాష్ ఈజ్‌తో నటించాడు. ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లో మంచి మెచ్యూరిటీ చూపించాడు. లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి.విలేజ్ గర్ల్ వరలక్ష్మి పాత్రలో భైరవి నటన సినిమాకు మెయిన్ పిల్లర్. ఆమె లుక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో పలికించిన హావభావాలు సహజంగా ఉన్నాయి.రఘుబాబు – పృథ్వీ కాంబోలో వచ్చే కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. గోదావరి యాసలో వీరి డైలాగ్ టైమింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.

టెక్నికల్ వాల్యూస్:

యశ్వంత్ నాగ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి, బీజీఎం ఎమోషనల్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. జవహర్ రెడ్డి,సుమంత్ కచర్ల కెమెరా వర్క్ సూపర్బ్. కోనసీమ లొకేషన్లను ఎంతో బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. తథాస్తు క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  •  లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ & కెమిస్ట్రీ
  • గోదావరి లొకేషన్స్, రిచ్ విజువల్స్
  • రఘుబాబు, పృథ్వీ మార్క్ వినోదం
  • యూత్‌కు కనెక్ట్ అయ్యే క్లైమాక్స్ మెసేజ్

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్‌లో సాగతీత సీన్స్
  • ఊహించదగ్గ కొన్ని డ్రామా సీన్స్

బాటమ్ లైన్:

‘కొత్త మలుపు’ అనేది లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసిన ఒక క్లీన్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌లో హాయిగా థియేటర్లో ఎంజాయ్ చేయదగ్గ చిత్రమిది.

Kotha Malupu Movie Review and Rating: 2.5/5

Related News

‘సింగ్-గీతం’ మూవీ రివ్యూ.. సింగీతం గారి ‘సంగీత’ ప్రయోగం ఎలా ఉందో తెలియాలంటే?

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

Peddi Twitter Review : ‘పెద్ది’ మూవీ ట్విట్టర్ రివ్యూ..రామ్ చరణ్ హిట్ కొట్టాడా..?

‘సందిగ్ధం’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ అదిరింది కానీ.. ఆ ఒక్కటే మైనస్!

‘బ్లాస్ట్‌ జోన్‌’ మూవీ రివ్యూ..యాక్షన్ కింగ్ మార్క్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

త్రికాల మూవీ రివ్యూ.. విజువల్ వండర్.. కానీ ఆ ఒక్కటి మిస్సైంది!

ఫస్ట్‌ టైం రివ్యూ..ఏలియన్స్.. కిడ్నాప్ డ్రామా.. ‘ఫస్ట్ టైం’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

×