E-Paper
Advertisement

PSLకు పోటీగా తాలిబ‌న్లు అదిరిపోయే ప్లాన్‌..మ‌ళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది

PSLకు పోటీగా తాలిబ‌న్లు అదిరిపోయే ప్లాన్‌..మ‌ళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది
Advertisement

Afghanistan Premier League:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) 19 సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. అయితే ఈ టోర్నమెంటును ఆదర్శంగా చేసుకుని చాలా క్రికెట్ బోర్డులు… అనేక రకరకాల టోర్నమెంటులను తీసుకువస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ (Pakistan Super League tournament), బిగ్ బాష్ లీగ్, ది 100 లీగ్ టోర్నమెంట్లు తెరపైకి వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును (Afghanistan Premier League) షురూ చేయనుంది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ ఖరారైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును ఈ ఏడాది డిసెంబ‌ర్ 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఈ టోర్న‌మెంట్ ను దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

తాలిబ‌న్లు అదిరిపోయే ప్లాన్‌..మ‌ళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బాంబు దాడులు, విధ్వంసకాండ కొనసాగుతున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వెనక్కి అడుగు వేయడం లేదు. క్రికెట్ మ్యాచ్ ల‌ను ఎంకరేజ్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా తాలిబన్స్ సపోర్ట్ తో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను (Afghanistan Premier League) మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. గతంలో ఈ టోర్నమెంట్ ప్రారంభించాలని ఎంతో ప్రయత్నించగా… కుదరలేదు. కానీ ఇప్పుడు మాత్రం తాలిబన్స్ ( Talibans) సర్కార్ పూర్తి పర్మిషన్లు ఇచ్చింది.

దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును డిసెంబర్ 27వ తేదీన ప్రారంభించేందుకు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ ను ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కాకుండా దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు సరికొత్త ప్లాన్ రచించారు. ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు భయపడతారు. పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణమున్న నేపథ్యంలో… దుబాయ్ ని వేదిక చేసుకుంది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక ఈ ఆఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మొత్తం ఐదు జట్లు ఉండనున్నాయి. కాబూల్, కందహార్, బాల్ఖ్, పాక్తియా, నంగర్హ‌ర్ ఫ్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఇక ఈ ఫ్రాంచైజీల తరఫున అంతర్జాతీయ క్రికెటర్లు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు బరిలో దిగనున్నారు.

తాలిబ‌న్ల దెబ్బ‌కు PSL దుకాణం బంద్

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఆదరణ తగ్గుతుందని… సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అందుకే తాలిబన్స్ కావాలనే ఈ టోర్నమెంట్ను తెరపైకి తీసుకువచ్చారని అంటున్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఎప్పుడు నిర్వహించినా, అదే సమయంలో APL నిర్వహించేలా తాలిబన్స్ స్కెచ్ వేశారట. అందుకే ఈ టోర్నమెంట్ కు నాంది పలికినట్లు చెబుతున్నారు.

 

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్‌..త‌న్వీర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

Big Stories

Advertisement
×