Koratala Shiva -NBK 112: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోతున్న దాదా సినిమా(Dada Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ (Koratala Shiva)డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇలా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై చిత్రబృందం స్పందించారు. ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకుడి గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట అనిరుద్(Anirudh) ఎంపిక అయ్యారని, కొన్ని కారణాలవల్ల అనిరుద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మరొక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(G.V.Prakash) ఈ సినిమా సంగీత దర్శకుడుగా ఎంపిక అయ్యారు అంటూ వార్తలు జోరుగా ప్రచారం సాగాయి.
ఇలా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తాము ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ లతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించిన విషయాన్ని అధికారకంగా తెలియజేస్తామని చిత్రబృందం ఈ రూమర్లను ఖండిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా చిత్ర బృందం ఈ వార్తలపై స్పందించడంతో సంగీత దర్శకుడు ఎవరనే సందిగ్ధంలో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ సినిమా సంగీత దర్శకుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
Don't believe or fall for any rumours or speculation regarding our film #NBKxKoratalaSiva.
The music director is still under discussion and has not been officially confirmed yet.
An official announcement will be made soon.Stay tuned! ❤️@SLVCinemasOffl
— Team Koratala (@TeamKoratala) October 30, 2026
ఇక ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనే విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ దాదా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పటి సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా బాలకృష్ణకు సర్జరీ జరగడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే గోపీచంద్ మలినేని కాంబినేషన్లో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు దాదాతో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో తెలియాల్సి ఉంది.
Also Read: 35 వేల అడుగుల ఎత్తులో కర్వా చౌత్ జరుపుకున్న నటి..వైరల్ అవుతున్న వీడియో!