E-Paper
Advertisement

ఎయిర్‌పోర్ట్‌ కే కాదు.. ఇక సిటీలోనూ పుష్పక్ బస్సులు, టికెట్ ధర ఎంత అంటే!

ఎయిర్‌పోర్ట్‌ కే కాదు.. ఇక సిటీలోనూ పుష్పక్ బస్సులు, టికెట్ ధర ఎంత అంటే!
Advertisement

Hyderabad Pushpak Buses: హైదరాబాద్ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్న పుష్పక్ ఏసీ బస్సుల్లో ఇకపై నగరంలోనూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. అంటే ఎయిర్‌ పోర్టుకు వెళ్లకపోయినా పుష్పక్ బస్సు ఎక్కొచ్చు. సిటీలో ఒక స్టాప్‌లో బస్సు ఎక్కి మరో స్టాప్‌లో దిగవచ్చు. అయితే, ఈ ప్రయాణానికి కనీస టికెట్ ధర రూ.100గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

సిటీలోనూ పుష్పక్ బస్సు సేవలు

హైదరాబాద్‌లో పుష్పక్ బస్సులు అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఎయిర్‌పోర్ట్ ప్రయాణమే. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణాన్ని అందించే ఈ బస్సులను ఇకపై నగరంలో ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు. నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయాణికులు ఈ బస్సులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణాన్ని కోరుకునే వారికి ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. అయితే, సాధారణ సిటీ బస్సులతో పోలిస్తే పుష్పక్ బస్సు టికెట్ ధర ఎక్కువగా ఉండనుంది. కనీస టికెట్ ధర రూ.100గా ఉండనున్నట్లు సమాచారం.

రూ.600కే ఏడు రోజుల సిటీ బస్ పాస్

Advertisement

మరోవైపు నగరంలో నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి టీజీఎస్ ఆర్టీసీ వీక్లీ బస్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ ధర రూ.600. కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు ఇది చెల్లుబాటు అవుతుంది.ఈ పాస్ ఉన్నవారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ, నాన్ ఏసీ సిటీ బస్సుల్లో ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ప్రతిసారీ టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, ఈ వీక్లీ పాస్ పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ బస్సులకు వర్తించదు.

పర్యాటకులకు, ఉద్యోగులకు ఎంతో లాభం

హైదరాబాద్‌కు వారం రోజుల పాటు పర్యటనకు వచ్చే వారు, వ్యాపార పనులపై నగరానికి వచ్చే వారు, ఉద్యోగులు ఈ వీక్లీ పాస్ ద్వారా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఏడు రోజుల పాటు సిటీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఈ పాస్‌లు సిటీలోని టీజీఎస్ ఆర్టీసీ సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.

Advertisement

హైదరాబాద్‌లో పుష్పక్ బస్సుల్లో సిటీ ప్రయాణానికి అవకాశం, మరోవైపు రూ.600కే ఏడు రోజుల బస్ పాస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత లాభం కలగనుంది.

Read Also: బెంగళూరు–ముంబై వందేభారత్ స్లీపర్‌కు రైల్వే బోర్డు ఆమోదం.. ప్రారంభం ఎప్పుడంటే?

Tags

Related News

రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే?

బెంగళూరు–ముంబై వందేభారత్ స్లీపర్‌కు రైల్వే బోర్డు ఆమోదం.. ప్రారంభం ఎప్పుడంటే?

చేతిలో ఐఫోన్.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని 17 ఏళ్ల బాలుడు బలి!

ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. వందే భారత్ సహా 42 రైళ్లు రద్దు!

నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

Big Stories

Advertisement
×