Anaganaga Oka Raju Review : నవీన్ పొలిశెట్టి అన్న వెంటనే జాతిరత్నాలు అనే సినిమా గుర్తువస్తుంది అందరికీ. దీని తర్వాత వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి పెద్దగా ఆకట్టుకోలేదు. మళ్లీ ఇప్పుడు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత అనగనగా ఒక రాజు అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీతో వచ్చాడు. హీరోగానే కాదు… ఈ సినిమాకు డైలాగ్స్ అండ్ స్క్రీన్ రైటర్‌గా కూడా చేశాడు పొలిశెట్టి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
గోదావరి జిల్లాల్లో మంచి పేరున్న జమిందారు గోపయ్య రాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). చెప్పుకోవడానికి ఇంత పెద్ద పేరున్న.. అనుభవించడానికి ఆస్తులేమీ ఉండవు. కానీ, ఊరులో జమిందారుగానే ఉంటాడు రాజు. అయితే… ఓ సారి తన ఫ్రెండ్ బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఒక్క సారిగా రిచ్ అయిపోతాడు. అక్కడ రాజుకు అవమానం కూడా జరుగుతుంది. దీని తర్వాత ఎలాగైనా… బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలా… చారులత (మీనాక్షీ చౌదరి)ని కలుస్తాడు. మరి చారులతతో రాజు పెళ్లి ఎలా జరుగుతుంది? పెళ్లి తర్వాత రాజు ఎలాంటి ఛాలెంజ్‌లను ఫేస్ చేస్తాడు అనేది మిగతా కథ.
అనగనగా ఒక రాజు.. ఈ మూవీ నవీన్ పొలిశెట్టి కోసమే రాసుకున్నట్టు ఉంటుంది. స్వయంగా మంచి రైటర్ కాబట్టి నవీన్ పొలిశెట్టి తన పాత్ర కోసం సరైన కామెడీ డైలాగ్స్ రాసుకున్నాడు. సినిమాకు అవే ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ సినిమాలో నవీన్‌ను కాకుండా ఎవరినీ ఊహించుకోలేం. అలా యాక్ట్ చేశాడు… అలాంటి డైలాగ్స్ రాసుకున్నాడు.
సినిమా అంటే… కథ గురించి చెప్పాలి కానీ, నవీన్ గురించి, ఆయన కామెడీ డైలాగ్స్ గురించి చెబుతున్నారేంటి అనుకుంటున్నారా… నిజానికి సినిమాలో కథ గురించి గానీ, కథనం గురించి గానీ, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మొత్తం నవీన్ పొలిశెట్టే ఉన్నాడు. నవీన్ పొలిశెట్టే కనిపిస్తాడు. అంతా ఓ స్వాగ్‌లో వెళ్లిపోతుంది.
ఎలాగైనా సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్‌ను నవ్వించాలని అనుకున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని ఫోర్డ్స్‌గా పెట్టిన కామెడీ సీన్స్ పెద్దగా అనిపించకపోయినా… పొలిశెట్టి స్వాగ్ వల్ల నడిచిపోయాయి.
అయితే, ఈ సినిమా చూస్తున్నంత సేపు పిల్లా జమిందార్ లాంటి కొన్ని సినిమాలు మన కళ్ల ముందుకు వచ్చి పడతాయి. అది కాస్త మైనస్ అనుకోవచ్చు. అలాగే, ఫస్టాఫ్‌లో కూడా కొన్ని సీన్స్ ల్యాగ్ గానే ఉన్నాయి. హీరోయిన్‌ను హీరో ప్రేమలో పడేసే చాలా వరకు సీన్స్ వర్కౌట్ అయినా… కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్‌కు పరీక్ష పెట్టేలా ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర ఓ మెయిన్ ట్విస్ట్ పెట్టి బ్రేక్ ఇచ్చాడు. ఇంటర్వెల్ టైంలో వచ్చిన ఇంట్రెస్ట్‌ను సెకండాఫ్‌లో బానే కంటీన్యూ చేశాడు. తర్వాత పొలిటికల్ టచ్ ఇస్తూ… జానర్ మార్చినట్టు మార్చినా… ఆడియన్ కనెక్టివ్ గానే ఉంటాడు. ప్రీ క్లైమాక్స్ దగ్గర మళ్లీ ఫ్లో కాస్త తగ్గింది. అలాగే రెగ్యులర్ క్లైమాక్స్ కొంత వరకు మైనస్. ఇంకాస్త బెటర్‌గా ప్లాన్ చేస్తే బాగుండేది. అయితే… నవీన్ పొలిశెట్టి తన కెరీర్ చేసిన ఫస్ట్ ఫైట్ వరకు ఒకే.
నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్ గురించి పైనే చెప్పాం. నవీన్ వన్ మెన్ షో చేశాడు. మీనాక్షీ లుక్స్ బాగున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లి రాజు వచ్చిన కాసేపు నవ్వులు పండించాడు. చమ్మక్ చంద్ర, భద్రం, జబర్దస్త్ ఫేం మహేష్ పర్వలేదు అనిపించారు. రావు రమేష్ పాత్ర ఉన్నా… పెద్దగా లేనట్టే. అయితే ఉన్నవరకు అయితే బానే చేశాడు.
ఇక సాంకేతిక విభాగం గురించి అంటే… మ్యూజిక్ బాగుంది. ఫస్టాఫ్‌లో కొన్ని, ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్‌పై ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్లేదు.
నవీన్ పొలిశెట్టి
కామెడీ డైలాగ్స్
ఇంటర్వెల్
కొన్ని ల్యాగ్ సీన్స్
అంచనా వేయగల స్టోరీ
మొత్తంగా… నాన్-స్టాప్ సింగల్ లైన్ డైలాగ్స్ జాతర: లాజిక్కులు పక్కన పెడితే, థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు నవ్వుకుని వచ్చే “కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజీ”.