E-Paper
Advertisement

Faridabad Crime: రాత్రి హల్వా తిన్నారు.. తెల్లవారేసరికి పైలోకానికి ఆ ముగ్గురు, ఫరీదాబాద్‌లో ఘోరం

Faridabad Crime: రాత్రి హల్వా తిన్నారు.. తెల్లవారేసరికి పైలోకానికి ఆ ముగ్గురు, ఫరీదాబాద్‌లో ఘోరం
Advertisement

Faridabad Crime: కారణం ఏంటో తెలీదు.. రాత్రికి హల్వా తిన్నారు. అందులో ఏమైనా కలిసిందా? లేకుంటే కలిపారా? అనేది తెలీదు. తెల్లవారేసరికి ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సంచలనం రేపిన ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో వెలుగుచూసింది. ఘటన వెనుక ఏం జరిగింది? మృతులు ఎక్కడివారు? అనే విషయాల్లోకి వెళ్తే..

ఫరీదాబాద్‌లో ఘోరం.. హల్వా తిన్న ఫ్యామిలీ

Advertisement

హర్యానాలోని ఫరీదాబాద్‌ పరిధి నసరూర్‌పూర్ ప్రాంతంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించారు. వారిలో భార్యభర్తలు, వారి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. వీరంతా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రాత్రి నిద్రపోయే ముందు వీరంతా హల్వా తీసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు కుటుంబసభ్యులు ఆ ఇంట్లో కలిసి నిద్రిస్తున్నారు.

Advertisement

బుధవారం ఉదయం వారిలో ముగ్గురు మృతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో బొగ్గు పొయ్యి కనుగొన్నారు. అలాగే పక్కన హల్వా  కనిపించింది. మరణానికి ఖచ్చితమైన తెలీదని, పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

తెల్లవారేసరికి విగతజీవులుగా, పోలీసుల విచారణ మొదలు

మృతులు రమేష్, అతడి భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ ఇంట్లో రమేష్ సోదరుడు ఉంటున్నాడు. ఇంటి యజమాని చెబుతున్న వివరాలు మేరకు.. రమేష్ దంపతులు, అతడి సోదరుడు ముగ్గురు కూలీలుగా పని చేస్తున్నారు. రెండు నెలల కిందట ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరు బీహార్‌కు చెందినవారు.

గత రాత్రి రమేష్ ఇంట్లో హల్వా తయారు చేశారు. అందరూ దాన్ని భుజించారు. ఉదయం ఐదు గంటల సమయంలో సోదరుడు.. అన్న-వదినను నిద్రలేపడానికి ప్రయత్నించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రమేష్ నోటి నుండి రక్తం కనిపించింది. మిగతా వారి నోటి నుండి నురగలు వచ్చినట్టు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు.

ALSO READ: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం 

ఆర్థిక సమస్యల నేపథ్యంలో హల్వాలో విషం కలిపి ముగ్గురు తిన్నారా? కాకపోతే ఎవరైనా చంపారా? అనేది ఆసక్తికరంగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వారి గురించి ఇరుగుపొరుగు వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తానికి పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఏం జరిగిందో తెలుస్తుందని అంటున్నారు అధికారులు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×