E-Paper
Advertisement

సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ … సీఎం కొడుకు హిట్ కొట్టాడా?

సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ … సీఎం కొడుకు హిట్ కొట్టాడా?
Advertisement

Sigma Movie Review: చిత్రం: సిగ్మా
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, అన్బు థాసన్ మరియు ఇతరులు
సంగీత దర్శకుడు: తమన్
ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్
ఎడిటర్: ప్రవీణ్ కె. ఎల్.
నిర్మాత: ఎ. సుభాస్కరన్
రచన, దర్శకత్వం: జాసన్ సంజయ్

సిగ్మా సినిమా కథ:

హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan)ఒక లైబ్రరీలో కూర్చుని హాయిగా కాలక్షేపం చేస్తుంటాడు. పాపం, ఆడియన్స్‌కు కూడా సినిమా అయిపోయే వరకు ఆ లైబ్రీయే దిక్కు అవుతుందని ఆయనకు ముందే తెలుసేమో! ఇక ఊహించని కొన్ని నేరపూరిత పరిణామాలు హీరోను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఆ గండం నుంచి ఆయన ఎలా బయటపడ్డాడో తెలియాలంటే… థియేటర్‌‌లో నిద్ర పోకుండా బలమైన ఆత్మస్థైర్యంతో సినిమా చూడాల్సిందే!

సిగ్మా సినిమా విశ్లేషణ:-

Advertisement

లైకా ప్రొడక్షన్స్ అంటేనే భారీ బడ్జెట్, రిచ్ మేకింగ్. కానీ ఈ సినిమా చూశాక… “డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో” దర్శకుడు జాసన్ సంజయ్ ఒక మాస్టర్ క్లాస్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. హైస్ట్ థ్రిల్లర్ తీయాలని కూర్చుని, ప్రేక్షకులకు సహనానికి హైస్ట్ (అత్యున్నత) పరీక్ష పెట్టారు. కథలో ఎమోషన్స్ వెతికినా దొరకవు, స్క్రీన్‌ప్లే ఎక్కడికక్కడ దారి తప్పి దేవుడా అంటూ మొత్తుకుంటుంది. సినిమా సాగుతుంటే మన టైమ్ మీద మనకే జాలి వేస్తుంది. బోర్ కొట్టించడం అంటే ఏమిటో ప్రాక్టికల్‌గా చూపించిన ఘనత ఈ దర్శకుడికే దక్కుతుంది.

సిగ్మాసినిమా ప్లస్ పాయింట్లు:-

*ఈ సినిమాను ఫుల్లీ సీరియస్‌గా చూడకుండా, కామెడీగా తీసుకొని చూస్తే వచ్చే నవ్వులు
*థియేటర్ నుంచి బయటికి వచ్చాక మనలో పెరిగిన సహనం కోల్పోవటం.
*లైకా ప్రొడక్షన్స్ ఖర్చు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ కనీసం విజువల్స్ గ్రాండ్‌గా ఉంటాయి

Advertisement

సిగ్మా మూవీ మైనస్ పాయింట్లు:

*కథ, కథనం, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒకదానిని మించి ఒకటి దారుణంగా విఫలమవడం థ్రిల్లర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఒక్క క్షణం కూడా రాకపోవడం

*విపరీతమైన సాగదీత సీన్లతో మైండ్ బ్లాంక్ అయిపోవడం

సిగ్మా మూవీ చివరి అఖరి మాటగా:

సినిమా చూసే ప్రేక్షకుల సహనానికి ఏకంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేలా ఉంటుంది ఈ ‘సిగ్మా’. థియేటర్ సీట్లలో కూర్చుని తిప్పలు పడటం కంటే, ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకోవడం చాలా మేలు!

సిగ్మా మూవీ రేటింగ్: 1.25/5

Also Read: సుప్రీతకు సినిమా అవకాశాలు రాలేదా..అందుకే ఇలా చేస్తున్నారా?

Related News

‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ మూవీ రివ్యూ.. ఆఖరి చిత్రం ఎలా ఉందంటే?

తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ హిట్ కొట్టాడా?

తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ.. కార్తికేయ నిర్మాతగా సక్సెస్ కొట్టారా?

‘డోరతీ’ మూవీ రివ్యూ.. కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

Big Stories

Advertisement
×