E-Paper
Advertisement

సుప్రీతకు సినిమా అవకాశాలు రాలేదా..అందుకే ఇలా చేస్తున్నారా?

సుప్రీతకు సినిమా అవకాశాలు రాలేదా..అందుకే ఇలా చేస్తున్నారా?
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సురేఖ వాణి(Surekha Vani) ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతను (Supritha)కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీత ప్రస్తుతం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు. అదేవిధంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

టీవీ షోస్ అంటే ఇంట్రెస్ట్..

ఇలా కెరియర్ పరంగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న సుప్రీత తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ గురించి మాట్లాడుతూ తనకు టీవీ షో అంటే చాలా ఇంట్రెస్ట్ ..ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే మాస్ జాతరలో లక్కీగా ఛాన్స్ వచ్చిందని సుప్రీత తెలిపారు. ఇలా సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొనడంతో బహుశా తనకు సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదని స్పష్టం అవుతుంది.

మాస్ జాతర షోలో ఛాన్స్…

Advertisement

ఇలా మాస్ జాతర (Mass Jathara)షో ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈమె ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న కుకింగ్ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక సుప్రీత హీరోయిన్ గా అమర్ తో కలిసి చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇదివరకే ఈమె లేచింది మహిళా లోకం, అమరావతికి ఆహ్వానం వంటి సినిమాలలో హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలో నటించారు.

Advertisement

ఇక ఈమె హీరోయిన్గా నటించిన చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో సుప్రీత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత సుప్రీత తన తదుపరి ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇలా వెండితెరపై అవకాశాలు రాని నేపథ్యంలోనే సుప్రీత బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూనే ఈమె మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అలాగే ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Also Read: ఇండస్ట్రీకి దూరంగా సురేఖ వాణి… అసలు కారణం చెప్పిన సుప్రీత!

Related News

నా వల్ల కావట్లేదు.. పెళ్లి చేసేయ్ అమ్మ.. సుప్రీత కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీకి దూరంగా సురేఖ వాణి… అసలు కారణం చెప్పిన సుప్రీత!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి…పోస్ట్ వైరల్!

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode October 2nd ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌: మనోజ్‌, రోహిణిలను విడదీసేందుకు ప్రభావతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా..?              

Podarillu Serial Today Episode October 2nd ‘పొదరిల్లు’ సీరియల్‌: గోపిక మనసును మహా మారుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode October 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినితో చాలెంజ్ చేసిన జ్యోత్స్న – సూరజ్ లో మార్పు వచ్చినట్టేనా..?              

Nindu Noorella Saavasam Serial Today Episode October 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ – పార్థు టూర్ క్యాన్సిల్ అవుతుందా…?    

Big Stories

Advertisement
×