సినిమా : జీబ్రా
డైరెక్టర్ : ఈశ్వర్ కార్తీక్
నటీనటులు : సత్యదేవ్, ధనజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్ తో పాటు తదితరులు
ప్రొడ్యూసర్ : బాల సుందరం, S. N. రెడ్డి, దినేష్ సుందరం
మ్యూజిక్ : రవి బస్రూర్
విడుదల తేదీ : 22 నవంబర్ 2024
Zebra Rating – 2/5
Zebra Movie Review : సత్య దేవ్ కెరీర్ ప్రారంభం నుండీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. పెద్దగా హిట్లు లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అనే మంచి పేరు ఇతనికి ఉంది. అతను హీరోగా రూపొందిన జీబ్రా మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. చిరంజీవి పబ్లిసిటీ చేయడం వల్ల ఇది జనాలకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా చూద్దాం రండి…..
కథ :
బ్యాంక్ ఎంప్లాయ్ గా పనిచేసే సూర్య (సత్యదేవ్) తోటి బ్యాంక్ ఎంప్లాయ్ అయినటువంటి స్వాతితో (ప్రియా భవానీ శంకర్) ప్రేమలో పడతాడు. వీళ్లు
5 యేళ్ళు నుండీ ప్రేమించుకుంటున్నప్పటికి ఇంట్లో వాళ్లకి చెప్పి ఒప్పించడానికి భయపడుతూ ఉంటాడు సూర్య. అయితే అనుకోకుండా ఈమె 4 లక్షల ఫ్రాడ్ లో ఇరుక్కుంటుంది. ఆమెను సేఫ్ చేసే క్రమంలో సూర్య రూ.5 కోట్ల స్కామ్ లో ఇరుక్కుంటాడు. దీంతో ఆది (డాలీ ధనంజయ) కి టార్గెట్ అవుతాడు.దీంతో అతని నుండి సూర్య తప్పించుకోవాలి అంటే 4 రోజుల్లో రూ.5 కోట్లు సూర్యకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలో 5 అంకెలు కోసం 26 రోజులు బ్యాంక్ లో పనిచేసే సూర్య అంత మొత్తం ఆదికి ఎలా చెల్లించాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి. అసలు ఆది ఎవరు. అతని గతం ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ జీబ్రా సినిమా.
విశ్లేషణ:
బ్యాంకుల్లో జరిగే కుంభకోణం నేపధ్యంలో ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. అందులో దర్శకుడు చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. అది పీరియాడిక్ మూవీగా తీయడం వల్ల చాలా లాజిక్స్ దాని కోవలో కొట్టుకుపోయాయి. కానీ జీబ్రా ఇప్పటి టైమ్ పీరియడ్లో జరిగే సినిమా. అందువల్ల చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి.ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నంలో స్క్రీన్ ప్లేని గాలికి వదిలేశాడు. అందువల్ల సినిమా ట్రాక్ తప్పింది. ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా మొదలైంది. తర్వాత స్లో అయ్యింది. ప్రీ ఇంటర్వల్ బ్లాక్ ఓకే. సెకండ్ హాఫ్ మొదట బాగానే ఉంటుంది. తర్వాత అది కూడా ట్రాక్ తప్పింది. క్లైమాక్స్ హడావిడిగా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సమకూర్చిన పాటలు ఆకట్టుకోవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కొన్ని సీన్ లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో ఒక 10 నిమిషాలు డిలీట్ చేసే స్కోప్ ఉంది. అది ఎడిటర్ ప్రాబ్లమ్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే .. సత్యదేవ్ బాగా నటించాడు. కానీ అతనికంటే డాలి ధనంజయ రోల్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. పుష్ప లో పార్ట్ టైమ్ విలన్ గా కనిపించిన అతను ఇందులో చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. ప్రియా భవానీ శంకర్ బాగానే చేసింది. సత్య తన కామిడీతో కొంత రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాబా పాత్రలో సత్య రాజ్ తన సీనియారిటీ చూపించారు. మిగిలిన వాళ్ళ పాత్రలు అంతగా గుర్తుండవు.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
సత్య దేవ్ , ధనంజయ .. ల నటన
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే
మొత్తంగా జీబ్రా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా. మిగిలిన వాళ్ళకి నచ్చడం కష్టమే
Zebra Rating – 2/5