America Shock to IT Firms: అమెరికా నుంచి విదేశీయులను పంపేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది ట్రంప్ సర్కార్. అందుకు సంబంధించి అన్ని అస్త్రాలను ఒకొక్కటిగా ప్రయోగిస్తోంది. తాజాగా అమెరికాలో ఉన్న భారతీయ ప్రధాన ఐటీ కంపెనీలపై కీలక చర్య తీసుకుంది. గ్రీన్ కార్డులకు అనుసంధానమైన శాశ్వత కార్మిక ధృవీకరణ-PERM కార్యక్రమం నుంచి ఆయా కంపెనీలను సస్పెండ్ చేసింది అమెరికా కార్మిక శాఖ. దీంతో ఐటీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ఆశలు అడియాసలయ్యాయి.
అమెరికా భారతీయ ఐటీ కంపెనీలకు షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. గురువారం గ్రీన్ కార్డ్ కార్యక్రమం నుంచి ఎనిమిది ప్రధాన ఐటీ కంపెనీలను సస్పెండ్ చేసింది. అందులో టాటా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌తోపాటు మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినిలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తరువాత ఆయా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం శాశ్వత కార్మిక ధృవీకరణ-PERM కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. అమెరికాలో H-1B వీసాలపై పని చేస్తున్న విదేశీ కార్మికులను శాశ్వతంగా ఉంచేందుకు కంపెనీలు దరఖాస్తు చేసుకునే ప్రక్రియే ఇది కీలకం.
ట్రంప్ సర్కార్ నిర్ణయం తర్వాత ఆయా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం శాశ్వత కార్మిక ధృవీకరణ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. స్థానిక అమెరికన్ల నుండి ఉద్యోగాలను లాక్కొని విదేశీ కార్మికులకు ఇవ్వలేమన్నది అక్కడి ప్రభుత్వం మాట. అమెరికా ప్రభుత్వం నిర్ణయంతో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న ఐటీ కంపెనీల్లో వేలాది మంది భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. అమెరికా కార్మిక శాఖ పైన పేర్కొన్న ఐటీ కంపెనీలను శాశ్వత కార్మిక ధృవీకరణ-PERM ప్రక్రియ నుండి సస్పెండ్ చేసింది. ఆయా కంపెనీలు కొత్త దరఖాస్తులు ఇకపై స్వీకరించబడవు. ఇప్పటికే కొనసాగుతున్న దరఖాస్తుల ప్రాసెసింగ్ కూడా నిలిపివేయబడింది.
PERM అంటే ఏమిటి? ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ అనేది ప్రభుత్వ అనుమతి. ఏ అమెరికన్ కంపెనీ అయినా ఒక విదేశీ కార్మికుడిని శాశ్వతంగా నియమించుకునే ముందు, గ్రీన్ కార్డ్ మంజూరు చేసే ముందు యూఎస్ కార్మిక శాఖ నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి. సదరు కంపెనీలు ప్రభుత్వానికి ఈ క్రింది విషయాలపై హామీ ఇవ్వాల్సి వుంటుంది. ఆ పనికి అర్హులైన అమెరికన్ కార్మికులను ఎవరూ లేరని చెప్పాలి. విదేశీ కార్మికుడిని నియమించుకోవడం లోకల్ అమెరికా ప్రజల పోవడం లేదని వివరించారు. వారి జీతాలపై ఎలాంటి ప్రభావం పడదని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
PERM స్థాయిలో ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ ప్రక్రియ నిలిపివేయనుంది. తదుపరి దశలో గ్రీన్ కార్డ్ పొందడానికి అనర్హులు. దీనివల్ల అమెరికాలో శాశ్వత నివాసం కోసం వారి నిరీక్షణ పెరుగుతుంది. అయితే ఈ కార్మికులను అమెరికా నుండి వెంటనే బహిష్కరించరు. కేవలం H-1B వీసాలు గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయి. దానిపై ఉండే వ్యక్తులు తమ H-1B వీసా గడువు ముగిసి ఆరేళ్ల తర్వాత తమ కంపెనీని మార్చుకోవాలి. లేకుంటే అమెరికాను విడిచి పెట్టాలి. ఈ నిర్ణయం ఇప్పటికే గ్రీన్ కార్డ్ ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపదు.
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం చాలా కష్టం, సుదీర్ఘ ప్రక్రియ. 12 నుండి 15 ఏళ్లుగా వారి నిరీక్షణ జాబితా ఉంటుంది. మీరు అనుభవజ్ఞులైన నిపుణుల వర్గం (EB-2 లేదా EB-3) కిందకు వస్తే అమెరికాలో 2012 లేదా 2014లో దరఖాస్తు చేసుకున్న భారతీయులకు గ్రీన్ కార్డ్‌లు ఇస్తున్నారు. సెప్టెంబర్ 2026 నాటి ప్రభుత్వ నివేదిక ప్రకారం ఈ సంవత్సరానికి భారతీయుల కోటా నిండిపోవడంతో కొత్త ఆమోదాలపై నిషేధం ఉంది. దీని కారణంగా భారతీయ కార్మికులు ఇకపై గ్రీన్ కార్డ్ కోసం ఉండలేరు. ఇప్పటికే 10 నుంచి 15 సంవత్సరాలుగా ఉన్నవారు మరి కొన్నాళ్లు పొడిగించబడుతుంది.
మైక్రోసాఫ్ట్ గతేడాది సుమారు 6000 మంది అమెరికన్లను ఉద్యోగులను తొలగించడంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 6300 హెచ్-1బి వీసాలు, 3000 మందికి గ్రీన్ కార్డ్‌లను ఇచ్చిందన్నారు. కొన్ని కంపెనీలు అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ కార్మికులను నియమించడానికి వలస నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత మంది భారతీయులు ప్రభావితం అమవుతారో ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ నిషేధం ఎంతకాలం కొనసాగుతుందో కూడా స్పష్టత లేదు.
టాటా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ వంటి పెద్ద భారతీయ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడనుంది. కొత్తగా కంపెనీల కొత్త PERM దరఖాస్తులు స్వీకరించబడవు. పాత పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియ కూడా నిలిపివేస్తారు. కంపెనీల ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
.@VP: "There has been no company in the United States, unfortunately, that has abused this system more than Microsoft."
Microsoft laid off 6,000 American workers in 2025 after certifying that it could not find qualified American employees — yet the company was approved for more… https://t.co/xh4ZYUDobZ pic.twitter.com/HGOY63Xwkf
— Rapid Response 47 (@RapidResponse47) October 8, 2026