E-Paper
Advertisement

The Boys Season 5 Review : “ది బాయ్స్ సీజన్ 5” రివ్యూ

The Boys Season 5 Review : “ది బాయ్స్ సీజన్ 5” రివ్యూ
Advertisement

The Boys Season 5 Review  మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ ‘ది బాయ్స్’ సీజన్ 5 ఓటీటీలోకి వచ్చేసింది. మొత్తం 6 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ఫైనల్ సీజన్ 2026 ఏప్రిల్ 8న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్, సూపర్ హీరో జానర్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఒక వైల్డ్ ముగింపును ఇవ్వనుంది. సూపర్ పవర్స్‌ ను దుర్వినియోగం చేసే ‘ది సెవెన్’ ను ‘ది బాయ్స్’ అనే చిన్న టీమ్ ఈ సీజన్లో ఎలా ఎదుర్కొందనేది రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ

సీజన్ 4 చివర్లో మనం చూసినట్టు, ఇప్పుడు అమెరికా మొత్తం హోమ్‌ల్యాండర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అతను ఒక నియంతలా మారిపోయి, తనని ఎదిరించిన వాళ్ళని అడ్డు తొలగిస్తుంటాడు. ఇక ‘ది బాయ్స్’ టీమ్ అయిన హ్యూగీ, ఎం.ఎం, ఫ్రెంచి జైల్లో చిక్కుకుంటారు. వాళ్ళని బయట పడేయడానికి యానీ బయట ఉండి పోరాడుతుంది. ఇక చావుకు దగ్గరగా ఉన్న బుచర్, తన దగ్గర ఉన్న డేంజరస్ వైరస్‌తో అందరినీ అంతం చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగే ఆఖరి యుద్ధమే ఈ సీజన్.

విశ్లేషణ

Advertisement

ఈ సీజన్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఇది లాస్ట్ సీజన్ కాబట్టి, ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుందో అని టెన్షన్ పుట్టిస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ప్రస్తుత రాజకీయాలపై వేసిన సెటైర్లు కూడా బాగా పేలాయి. ఈ సీజన్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉండగా, ఇప్పటికి రెండు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ లో ఉన్నాయి. మిగతా ఎపిసోడ్స్ ప్రతి వారం ఒకటి చొప్పున స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. నిజానికి ఈ సిరీస్ బ్లడీ బ్లడ్ బాత్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మితిమీరిన వయొలెన్స్ తో పాటు పెద్దలకు మాత్రమే అనే సీన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆ రక్తపాతాన్ని హింసకు ఏమాత్రం లోటు లేదు ఈ సీజన్ లో కూడా. ఇక ఆంటోనీ స్టార్ నటన నెక్స్ట్ లెవల్. చూస్తుంటేనే భయం వేసేలా ఆ పాత్రను పండించాడు. బుచర్, హ్యూగీ మధ్య వచ్చే సీన్స్ కాస్త ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చింది రెండు ఎపిసోడ్ లే అయినప్పటికీ రక్తం చిమ్మే సీన్స్, వాడకూడని పదాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ సీజన్ ను కూడా ఫ్యామిలీతో కలిసి చూడడం కష్టమే. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు సాగదీసినట్టు అనిపిస్తుంది. రాజకీయాల మీద అవగాహన లేని వాళ్ళకి కొన్ని సీన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు.

ప్లస్ పాయింట్స్

హోమ్‌ల్యాండర్ యాక్టింగ్
షాకింగ్ సీన్స్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్

Advertisement

హింస ఎక్కువ
స్లో పేస్
పొలిటికల్ డ్రామా

మొత్తానికి

‘ది బాయ్స్’ సిరీస్ ఫ్యాన్ అయితే, ఈ గ్రాండ్ ఫినాలే అస్సలు మిస్ అవ్వద్దు. హోమ్‌ల్యాండర్ పతనం ఎలా ఉంటుందో చూడటానికి ఇది పర్ఫెక్ట్ ఎండ్.

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×