E-Paper
Advertisement

42 ఏళ్ల బంధానికి టాటా… గుహలోకి వెళ్ళి 20 ఏళ్ల యంగ్ కపుల్ గా రీఎంట్రీ… ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ తెలుగులోనే

42 ఏళ్ల బంధానికి టాటా… గుహలోకి వెళ్ళి 20 ఏళ్ల యంగ్ కపుల్ గా రీఎంట్రీ… ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ తెలుగులోనే
Advertisement

Fantasy Romantic Comedy Series: వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని చెప్పే సరికొత్త ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘లవ్ ఆల్వేస్’ (Love Always). తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది. వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగి విడిపోవాలని నిర్ణయించుకున్న ఓ జంట జీవితంలో అనుకోని అద్భుతం జరుగుతుంది. ఓ మాయా శక్తి కారణంగా వాళ్లు మళ్లీ తమ యంగ్ ఏజ్‌లోకి వెళ్లిపోతారు. మరి ఈ ఇంట్రస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఉందా ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కణ్ణన్, మంజుల దాదాపు 42 ఏళ్ల వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్న వృద్ధ దంపతులు. అయితే వయసు పెరిగే కొద్దీ వారిద్దరి మధ్య మనస్పర్థలు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. చివరకు ఓ కుటుంబ వేడుకలో అందరి ముందు మంజుల తన భర్త కణ్ణన్‌కు విడాకుల నోటీసు ఇచ్చి షాక్ ఇస్తుంది. దీంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతారు. ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్న ఆ జంటను ఎలాగైనా మళ్లీ కలపాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి కణ్ణన్, మంజులను ఓ దేవాలయ యాత్రకు తీసుకెళ్తారు. అక్కడ అనుకోని సంఘటనల కారణంగా ఆ ఇద్దరూ ఓ రహస్యమైన గుహలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ గుహలో జరిగే వింత మాయాజాలం వారి జీవితాలను మార్చేస్తుంది. అప్పటివరకు వృద్ధులుగా ఉన్న కణ్ణన్, మంజుల ఒక్కసారిగా తమ 20 ఏళ్ల యువ ప్రాయంలోకి మారిపోతారు. కణ్ణన్ యువకుడిగా రంజాన్ ముహమ్మద్, మంజుల యువతిగా గౌరీ కిషన్ రూపంలో కనిపిస్తారు. అయితే యంగ్‌గా మారిన ఆ ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులు గుర్తుపట్టలేరు. పైగా వారిని అనుమానాస్పద వ్యక్తులుగా భావిస్తారు.

మరోవైపు కిడ్నాపర్లుగా భావించి పోలీసులు కూడా వారి కోసం వెతకడం మొదలుపెడతారు. దీంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి కణ్ణన్, మంజుల తమ కుటుంబ సభ్యులు బస చేసిన హోటల్‌ లోనే రహస్యంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నో సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒకప్పుడు భార్యాభర్తలుగా ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించిన ఆ ఇద్దరూ ఇప్పుడు యువకుల రూపంలో ఒకరినొకరు కొత్తగా చూసుకుంటారు. గతంలో తమ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి ? ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ ఎక్కడకు పోయింది ? మరి యవ్వనంలోకి మారిన కణ్ణన్, మంజుల తిరిగి తమ అసలు రూపాల్లోకి ఎలా వచ్చారు ? వారి విడాకుల సమస్య పరిష్కారమైందా ? ఇన్నేళ్ల బంధంలో కోల్పోయిన ప్రేమను మళ్లీ పొందగలిగారా ? అనేదే మిగతా కథ.

ఓటీటీలో తెలుగులోనూ ఉంది

Advertisement

‘లవ్ ఆల్వేస్’ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జియోహాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ… ఇలా మొత్తం ఏడు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా, ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివితో ఉంటుంది. ఈ సిరీస్‌లో వృద్ధ దంపతుల పాత్రల్లో Jayaprakash, Jayasudha నటించగా, వారి యంగ్ వెర్షన్లుగా Gouri G. Kishan, Ramzan Muhammed కనిపిస్తారు. Maya Krishnan కూడా కీలక పాత్రలో నటించారు. దర్శకురాలు Madhumitha ఈ కథను ఫాంటసీ, కామెడీ, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కించారు. వీకెండ్‌లో ఈ సిరీస్‌ను ట్రై చేయొచ్చు.

Read Also: కష్టాల మధ్య చిగురించిన ప్రేమ… టామ్ క్రూజ్‌, నికోల్ కిడ్‌మన్‌ల క్లాసిక్‌ రొమాంటిక్ డ్రామా

Tags

Related News

శవాన్ని కూడా వదలని సైకో… వరుస హత్యలతో పోలీసులకే వణుకు పుట్టించే థ్రిల్లర్

లగ్జరీ ఫ్లాట్‌ అద్దెకిచ్చే అందమైన అమ్మాయి… కలల ఇల్లు కాస్తా భయంకరమైన పీడకలగా మారితే… తమిళ హర్రర్ మూవీ తెలుగులో

ఓటీటీలోకి అడుగు పెట్టిన సీఎం విజయ్ కొడుకు ఫస్ట్ మూవీ… ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పునకాలే .. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

మాటలకందని బంధం… కుటుంబ సమేతంగా చూడదగ్గ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

హాస్టల్‌లో అమ్మాయిలు మిస్సింగ్‌… గుర్రంపై తలలేని మొండెం… వైరల్‌ హారర్‌ సిరీస్‌ వచ్చేసిందోచ్

కనిపించకుండా పోయిన తల్లి కోసం భయంకరమైన ద్వీపానికి… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×