Bigg Boss 10 shiv : ప్రముఖ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బుల్లితెర నటీమణి ప్రియాంక జైన్ (Priyanka Jain) తో ప్రముఖ సీరియల్ నటుడు శివకుమార్ (Shiva Kumar) ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ప్రియాంక శివ కి ప్రపోజ్ చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో ఇల్లు కట్టడం పూర్తయిన వెంటనే వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే సడన్గా బిగ్ బాస్ సీజన్ 10లోకి వైల్డ్ కార్డు ద్వారా అవకాశం రావడంతో హౌస్ లోకి అడుగుపెట్టారు శివ. అలాంటి శివ పై ముఖేష్ వేసిన అబాండాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్న దేబ్జానీతో ముడిపెడుతూ ప్రియాంకకి అన్యాయం చేస్తున్నాడు.. అనే రేంజ్ లో ముఖేష్ చేసిన కామెంట్లు ఆయనపై ఇప్పుడు వ్యతిరేకత నెలకొనేలా చేసిందని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
53వ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం గేమ్స్ తోనే జరిగింది. క్యాష్ , స్టార్స్ సంపాదించే పనిలో అందరూ తమ తమ గేమ్స్ తో మునిగిపోయారు. గొడవలు లేకుండా, తిట్టుకోకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ క్యాష్, స్టార్స్ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మధ్య మధ్యలో శివ, దేబ్జానికి లైన్ వేస్తున్నాడు అంటూ ముఖేష్ చేసిన కామెంట్లు వైరల్ గా నిలిచాయి. షోలో భాగంగా శివ వచ్చి గేమ్ ఆడకుండా.. దేబ్జానీ కోసం వెంపర్లాడుతున్నాడా అనే మాట ముఖేష్ అంటున్నాడని.. శివ వెళ్లి రాంప్రసాద్ కి చెప్పాడు. అయితే రాంప్రసాద్ నమ్మలేదు. ఇదే విషయాన్ని శివ వెళ్లి ముఖేష్ ని అడిగేసాడు. మీరిద్దరూ రాత్రిపూట మాట్లాడుకుంటున్నారు.. హగ్గిచ్చుకుంటున్నారు.. మీరు చేసేవన్నీ ఇతరులపై వేస్తారా? అని అడిగేశాడు. నిప్పు – ఉప్పులా ఉండే శివ , ముఖేష్ ఈ విషయంలో జెంటిల్మెన్స్ లా మాట్లాడుకున్నారు . కానీ అరుచుకోలేదు. అయితే ఇది కూడా విచిత్రమే.
ఇక వీటిని పక్కన పెడితే శివను చూసే ఎవరికైనా హౌస్ కి వచ్చి ఆట వదిలేసి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు ఇలాంటి అలిగేషన్స్ వేసి ముఖేష్ చెడ్డవాడు కావడం తప్పితే శివకు జరిగే నష్టమైతే ఏమీ లేదు. ముఖ్యంగా ప్రియాంకకు శివ ఎందుకు అన్యాయం చేస్తాడు? పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ అమ్మాయిని కాదనుకొని నిన్న మొన్న హౌస్ లోకి వచ్చిన దేబ్జానీ తో ఆయన రిలేషన్ ఎలా పెట్టుకుంటాడు. ఈ విషయం కూడా ముఖేష్ కి అర్థం కాలేదా? అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
also read: ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. కోటి రూపాయల ట్విస్ట్ ఎలా ఉందంటే?
ఇదే విషయాన్ని దేబ్జానితో శివ డైరెక్టుగా అడిగేసాడు. నాకు జీవితంలో అందమైన అమ్మాయి ఉంటే.. ఎందుకు పోగొట్టుకుంటాను అంటూ స్పష్టంగా చెప్పాడు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఆమె ముఖంలో ఎలాంటి భావాలు కనిపించలేదు. మొత్తానికైతే రచ్చ చేయడం కంటే టైం వచ్చినప్పుడు ముఖేష్ ను టార్గెట్ చేద్దామనుకున్నారేమో తెలియదు కానీ.. ముఖేష్ చేసిన కామెంట్లు మాత్రం ఆయన పైనే వ్యతిరేకత నెలకొనేలా చేసిందని స్పష్టం అవుతోంది. మరి టార్గెట్ గా చేసుకున్న ముఖేష్ ని శివ, దేబ్జానీ ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తారో చూడాలి.