Hong Kong Sixes 2026 – IND VS PAK: హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ (Hong Kong Sixes 2026) భారీ అంచనాల నడుమ ఇవాళ షురూ అయింది. ఈ క్రమంలో గ్యాప్ లేకుండా వరుసగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో దాయాదుల పోరు జరగగా.. అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ సూపర్ విక్టరీ అందుకుంది. గ్రూప్ సీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియాపై 8 వికెట్ తేడాతో పాకిస్తాన్ గెలిచి, ప్రతీకారం తీర్చుకుంది.
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ (Hong Kong Sixes 2026) గ్రూప్ సీ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India Vs Pakistan) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కేవలం 88 పరుగులు మాత్రమే సాధించింది. శశాంక్ సింగ్ ఒక్కడే 40 పరుగులతో రాణించగా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. రాహుల్ తెవాటియా, కెప్టెన్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) ఇద్దరు డకౌట్ కావడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇక 88 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 3.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఛేదించి బిగ్ విక్టరీ అందుకుంది. అంతకుముందు యూఏఈ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. కసితో ఆడి టీమిండియాపై ( Team India) ప్రతీకారం తీర్చుకుంది. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అటు టీమిండియాపై ట్రోల్స్ మొదలయ్యాయి.
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ లో (Hong Kong Sixes 2026) భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతూనే ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కేవలం మూడు రోజుల పాటు మాత్రమే కొనసాగనున్న నేపథ్యంలో 45 నిమిషాల చొప్పున ఒక్కో మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇక తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగింది. ఇందులో కంగారులు బిగ్ విక్టరీ అందుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై స్కాట్లాండ్ 2 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుని షాక్ ఇచ్చింది. గ్రూప్ సీలో పాకిస్తాన్ పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకే ఒక వికెట్ తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. అటు గ్రూప్ డీలో భాగంగా బలమైన సఫారీ జట్టును 49 పరుగుల తేడాతో ఒమాన్ ఓడించింది. అటు పసికూన హాంకాంగ్ చేతిలో ఇంగ్లాండు 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ బీలో భాగంగా బంగ్లాదేశ్ పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది.