E-Paper
Advertisement

అబ్బో.. Wi-Fi పాస్‌వర్డ్ లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా?

అబ్బో.. Wi-Fi పాస్‌వర్డ్ లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా?
Advertisement

Wi-Fi Without Password: ఇంటికి కొత్తగా ఎవరైనా చుట్టాలొచ్చినా లేదా మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినా ముందుగా అడిగేది వైఫై పాస్‌వర్డే. అయితే ఆ పెద్ద పెద్ద అక్షరాలు, నెంబర్లను చూసి ప్రతిసారీ కరెక్ట్‌గా టైప్ చేయడం కాస్త విసుగు తెప్పించే విషయమే. పైగా ఒక్క లెటర్ తప్పుపడినా మళ్లీ మొదటికొస్తుంది. కానీ, ప్రతిసారీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చాలా సులువుగా వైఫైకి కనెక్ట్ అవ్వొచ్చని మీకు తెలుసా? ఆ సీక్రెట్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూటర్‌పై ఉండే క్యూఆర్ కోడ్..

ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని రూటర్ల వెనక లేదా కింద భాగంలో ఒక క్యూఆర్ కోడ్ కచ్చితంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేసి రూటర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు. స్క్రీన్ పై కనెక్ట్ అవ్వాలా అని అడుగుతుంది. అప్పుడు ఒకే నొక్కితే వెంటనే ఇంటర్నెట్ వస్తుంది.

ఫ్రెండ్ ఫోన్ నుండి వైఫై షేరింగ్..

Advertisement

మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఇప్పటికే వేరే వ్యక్తి ఆ వైఫైకి కనెక్ట్ అయి ఉంటే.. వారి ఫోన్ నుంచే మీరు నెట్‌వర్క్ పొందే వెసులుబాటు ఉంది. ముందుగా వారి ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫై మీద ట్యాప్ చేయాలి. అక్కడ కనెక్ట్ అయి ఉన్న నెట్‌వర్క్ పక్కన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కితే ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే పాస్‌వర్డ్ అవసరం లేకుండానే కనెక్ట్ అయిపోవచ్చు.

Also Read: Made by Google ఈవెంట్‌కు ముందే బ్యాడ్ న్యూస్.. Pixel 10 కొన్నవాళ్లకీ తప్పని తిప్పలు!

రూటర్ వెనుక ఉండే బటన్..

Advertisement

మరో సులువైన మార్గం WPS బటన్. మీరు ఫోన్‌లో వైఫై ఆన్ చేసి, సంబంధిత నెట్‌వర్క్‌పై క్లిక్ చేసిన వెంటనే.. రూటర్ వెనుక భాగంలో ఉండే WPS బటన్‌ను ఒకసారి నొక్కాలి. ఇలా చేయగానే రూటర్ కొద్ది సెకన్ల పాటు సెక్యూరిటీని సడలించి కొత్త పరికరాలను నెట్‌వర్క్‌లోకి అనుమతిస్తుంది. ఆ సమయంలో మీ ఫోన్ సులువుగా కనెక్ట్ అయిపోతుంది.

పిన్ కోడ్‌తో కూడా కనెక్షన్..

కొన్నిసార్లు ఈ ప్రాసెస్ కోసం ఎనిమిది అంకెల పిన్ (PIN) కోడ్ అడుగుతుంది. ఈ పిన్ నెంబర్ కూడా సాధారణంగా రూటర్ అడుగు భాగంలోనే రాసి ఉంటుంది. దాన్ని ఉపయోగించి కూడా నేరుగా ఇంటర్నెట్ పొందవచ్చు. ఇకపై వైఫై పాస్‌వర్డ్ మరిచిపోయినా లేదా టైప్ చేయడం బద్ధకంగా అనిపించినా ఈ సింపుల్ ట్రిక్స్ వాడి టైమ్ సేవ్ చేసుకోండి.

Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

Related News

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!

భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

ప్రయాణాల్లో ఛార్జింగ్ తిప్పలు ఇక ఉండవు! రూ.వేయ్యిలోపు బ్రాండెడ్ పవర్ బ్యాంక్

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

Big Stories

Advertisement
×