E-Paper
Advertisement

దేశాన్ని దోచుకునే హవాలా కింగ్‌పిన్స్.. చివరికి ఎలా చిక్కారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

దేశాన్ని దోచుకునే హవాలా కింగ్‌పిన్స్.. చివరికి ఎలా చిక్కారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Advertisement

Crime Thriller Web Series: దేశ భద్రతకు ముప్పు తెచ్చే నేరాలు, హవాలా నెట్‌వర్క్‌లు, రాజకీయ కుట్రలు, వ్యక్తిగత ప్రతీకారం… ఈ నాలుగింటినీ ఒకే కథలో అద్భుతంగా చూపించిన వెబ్ సిరీస్ ‘Kaala’. మొదట ఇది ఒక సాధారణ దర్యాప్తు కథలా కనిపించినా, ఒక్కో ఎపిసోడ్‌ ముందుకు సాగేకొద్దీ దేశాన్ని కుదిపేసే భారీ కుట్ర బయటbపడుతుంది. ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యం, ప్రతి సంఘటన వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉండటంతో ఈ సిరీస్ చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ తెలుగులో ఉందా ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రిత్విక్ బెనర్జీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే తెలివైన అధికారి. దేశంలో అక్రమంగా తిరుగుతున్న నల్లధనం, హవాలా లావాదేవీలు, విదేశాలకు వెళ్లే వందల కోట్ల డబ్బు వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పట్టుకునే బాధ్యత అతని భుజాలపై పడుతుంది. మొదట చిన్న స్థాయి ఆర్థిక నేరంలా కనిపించిన ఈ కేసు, దర్యాప్తు సాగుతున్న కొద్దీ దేశ సరిహద్దులు దాటే అంతర్జాతీయ ముఠాలకు దారి తీస్తుంది. ఈ నెట్‌వర్క్‌లో డబ్బు మాత్రమే కాదు… ఆయుధాల వ్యాపారం, రహస్య సమాచారం మార్పిడి, అధికార వ్యవస్థలోని అవినీతి కూడా ముడిపడి ఉన్నాయని రిత్విక్ గుర్తిస్తాడు. ప్రతి ఆధారం అతన్ని మరింత ప్రమాదకరమైన వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

అయితే ఈ దర్యాప్తు కేవలం అధికారిక బాధ్యత మాత్రమే కాదని తర్వాత తెలుస్తుంది. రిత్విక్ జీవితాన్ని 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. అతని కుటుంబం ఎదుర్కొన్న అవమానం, తండ్రిపై పడిన తీవ్రమైన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన విషాదం… ఇవన్నీ అతని మనసులో చెరిగిపోని గాయాలుగా మిగిలిపోతాయి. కేసులో ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ, అప్పట్లో తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తులకే ఈ హవాలా సామ్రాజ్యంతో సంబంధం ఉందని రిత్విక్ అనుమానించడం మొదలుపెడతాడు. దీంతో ఈ దర్యాప్తు దేశ ప్రయోజనాలకే కాకుండా, అతని వ్యక్తిగత జీవితానికీ సంబంధించిన పోరాటంగా మారుతుంది.

మరోవైపు హవాలా నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నవారు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. వారి దగ్గర ప్రత్యక్ష ఆధారాలు ఉండవు. డబ్బు ప్రయాణించే మార్గాలు కనిపించవు. వారిని కాపాడే శక్తివంతమైన వ్యక్తులు వ్యవస్థలోనే ఉంటారు. రిత్విక్ వేసే ప్రతి అడుగును ముందే అంచనా వేసి అతని దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రిత్విక్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటాడు. నేరుగా దాడి చేయకుండా, వారి మధ్యే అనుమానాలు పెరిగేలా ప్రణాళికలు వేస్తాడు. ఒకరిపై ఒకరికి నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టిస్తాడు. దీంతో కొన్నేళ్లుగా అజేయంగా కనిపించిన నెట్‌వర్క్‌లో నెమ్మదిగా చీలికలు కనిపించడం మొదలవుతుంది.

Advertisement

చివరికి రిత్విక్ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా? 30 ఏళ్ల క్రితం తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి కారణమైన నిజం బయటపడిందా? దేశాన్ని దోచుకుంటున్న హవాలా సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? చివరి మలుపులో ఎదురయ్యే అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను మస్ట్ వాచ్.

తెలుగులో ఉందా లేదా?

‘కాలా’ వెబ్ సిరీస్‌లో అవినాష్ తివారీ, తాహిర్ రాజ్ భాసిన్, నివేదితా భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం jio Hotstar ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ కొత్త రహస్యాన్ని బయటపెడుతూ, క్లైమాక్స్ వరకు ఆసక్తిని ఏమాత్రం తగ్గనివ్వదు.

Read Also: జాంబీలను పని మనుషులుగా వాడుకునే జనాలు… ఇలాంటి హర్రర్ కామెడీని ఎక్కడా చూసుండరు సామీ

Related News

ఓవర్‌టేక్ చేసినందుకే నరకం చూపించే సైకో… ఈ రోడ్ రేజ్ థ్రిల్లర్ మైండ్ బ్లోయింగ్

చంబల్ అడవిలో బందిపోట్లకు చుక్కలు చూపించిన యువతి… చివరి అరగంట గూస్‌బంప్స్ గ్యారంటీ

ఒకే వ్యక్తి… ఐదు గెటప్‌లు… వందల కోట్ల మోసాలు… చివరి ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్

నెలరోజులు బ్యాడ్ బాయ్ తో ఒకే రూమ్ లో ఉండాలని కండిషన్… ఈ రొమాంటిక్ మూవీ చూశారా?

ఆకాశం నుంచి కురిసే ఆసిడ్ వర్షం… చివరి వరకు టెన్షన్ పెట్టే సర్వైవల్ థ్రిల్లర్

35వ అంతస్తులో ట్రాప్… పావురాన్ని పీక్కు తిని, వర్షపు నీళ్ళు తాగి బతికే కుర్రాడు

అమెజాన్ ప్రైమ్ వీడియో కొరియన్ విందు… రెండేళ్లలో 100కు పైగా పాపులర్ కొరియన్ సిరీస్ లు

Big Stories

Advertisement
×