E-Paper
Advertisement

చంబల్ అడవిలో బందిపోట్లకు చుక్కలు చూపించిన యువతి… చివరి అరగంట గూస్‌బంప్స్ గ్యారంటీ

చంబల్ అడవిలో బందిపోట్లకు చుక్కలు చూపించిన యువతి… చివరి అరగంట గూస్‌బంప్స్ గ్యారంటీ
Advertisement

Survival Crime Thriller: ఒక మామూలు అమ్మాయి… చేతిలో ఎలాంటి ఆయుధం లేదు… తప్పించుకునే దారి కూడా లేదు. ఎదురుగా మాత్రం నలుగురు క్రూరమైన బందిపోట్లు. అలాంటి పరిస్థితిలో ప్రాణాలను ఎలా కాపాడుకుంటుంది? భయంతో లొంగిపోతుందా? లేక తన తెలివితేటలతో వారినే ఎదుర్కొంటుందా? అనే ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ ‘Apurva’. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఉత్కంఠలో ముంచెత్తే ఈ సినిమా, ముఖ్యంగా చివరి అరగంటలో ఊహించని మలుపులతో మరింత ఆసక్తిని పెంచుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అపూర్వ అనే యువతి తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న ఆనందంలో ఉంటుంది. త్వరలోనే పెళ్లి జరగబోతుండటంతో తనకు కాబోయే భర్తకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఒంటరిగా ప్రయాణం మొదలు పెడుతుంది. కానీ ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని ఊహించని మలుపులోకి తీసుకెళ్తుంది. ఆమె ప్రయాణిస్తున్న బస్సు చంబల్ ప్రాంతం మీదుగా వెళ్తుండగా, దారిలో క్రూరమైన బందిపోట్ల ముఠా దాడి చేస్తుంది. ప్రయాణికులపై దాడి చేసిన వారు అపూర్వను కిడ్నాప్ చేసి అడవిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి బయటపడే మార్గమే కనిపించదు.

Advertisement

మొదట్లో అపూర్వ పూర్తిగా భయపడిపోతుంది. తనకు సహాయం చేసే వారు ఎవరూ లేరని అర్థమవుతుంది. కానీ కొద్దిసేపటికే ఒక విషయం గ్రహిస్తుంది. భయంతో కూర్చుంటే ప్రాణాలు దక్కవని… పోరాడితేనే బతికే అవకాశం ఉంటుందని నిర్ణయించుకుంటుంది. అక్కడ ఉన్న ప్రతి వస్తువును ఒక అవకాశంగా మార్చుకోవడం ప్రారంభిస్తుంది. బందిపోట్ల బలహీనతలను గమనిస్తూ, వారు ఒకరినొకరు అనుమానించేలా చిన్న చిన్న ఎత్తుగడలు వేస్తుంది. బయటకు ప్రశాంతంగా కనిపించినా, లోపల మాత్రం తప్పించుకునే ప్రణాళికను సిద్ధం చేస్తుంది.

మరోవైపు ఆ ముఠా నాయకులు కూడా చాలా క్రూరంగా వ్యవహరిస్తుంటారు. అపూర్వ చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అడవిలో ప్రతి అడుగు ప్రమాదమే. ఎక్కడి నుంచి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి. అయినా అపూర్వ ధైర్యం కోల్పోదు. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ వేటాడేవారు ఎవరు? వేటగా మారేవారు ఎవరు? అనే సందేహం ప్రేక్షకుడిలో పెరుగుతుంది. ఒక్కో సంఘటనతో పరిస్థితులు పూర్తిగా మారిపోతుంటాయి. చివరి అరగంటలో జరిగే సంఘటనలు ఉత్కంఠను మరింత పెంచుతాయి. ప్రతి నిర్ణయం ప్రాణాలతో ముడిపడి ఉండటంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Advertisement

చివరికి అపూర్వ ఆ అడవి నుంచి సురక్షితంగా బయటపడగలిగిందా? నలుగురు కిరాతకుల చెర నుంచి ఎలా తప్పించుకుంది? తన తెలివితో వారిని ఎలా ఎదుర్కొంది? అసలు చివరి మలుపులో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ స్టోరీ.

తెలుగులో అందుబాటులో ఉందా ?

అపూర్వ చిత్రంలో తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించగా, అభిషేక్ బెనర్జీ, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం Jio Hotstar ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్కంఠభరితమైన సర్వైవల్ కథలు, బలమైన మహిళా ప్రధాన పాత్రలు, చివరి వరకు ఆసక్తిని కొనసాగించే క్రైమ్ థ్రిల్లర్లు చూడాలనుకుంటే ఈ మూవీ మీ కోసమే. ప్రతి నిమిషం తర్వాత ఏమవుతుందో అనే ఉత్కంఠతో ఈ చిత్రం ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేస్తుంది.

Read Also: 35వ అంతస్తులో ట్రాప్… పావురాన్ని పీక్కు తిని, వర్షపు నీళ్ళు తాగి బతికే కుర్రాడు

Related News

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్‌ సంప్రదాయాన్ని చూశారా ?

స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్

Big Stories

Advertisement
×