Stuffcool Omni Pro: రోజూ ఆఫీస్‌కి వెళ్లేవారికైనా, తరచుగా ప్రయాణాలు చేసేవారికైనా ఫోన్, స్మార్ట్‌వాచ్‌లను ఛార్జ్ చేసుకోవడం పెద్ద సాహసమే. రకరకాల కేబుళ్లు, ఛార్జర్లు వెంట పట్టుకెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్టఫ్‌కూల్ ఒక సూపర్ పవర్ బ్యాంక్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే Stuffcool Omni Pro. ఇప్పుడీ గ్యాడ్జెట్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..
ఈ పవర్ బ్యాంక్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, చేతిలో పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. దీని బరువు కేవలం 214 గ్రాములు మాత్రమే. దీనిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాపిల్ వాచ్ ఛార్జర్ గురించి. పవర్ బ్యాంక్ లోపల దాగి ఉండే ఈ ఛార్జింగ్ మాడ్యూల్, అవసరమైనప్పుడు బయటకు స్లైడ్ అవుతుంది. దీంతో వాచ్ కోసం ప్రత్యేకంగా కేబుల్స్ వాడాల్సిన పనిలేదు. అంతేకాకుండా.. పవర్ బ్యాంక్‌లో ఎంత ఛార్జింగ్ ఉందో తెలుసుకోవడానికి స్పష్టమైన డిజిటల్ డిస్‌ప్లేను కూడా అందించారు.
Also Read: 200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?
Omni Pro పవర్ బ్యాంక్ 25W Qi2.2 మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఐఫోన్లను కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఒకవేళ మీరు వైర్ ద్వారా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే.. ఇందులో 35W టైప్-సి పవర్ డెలివరీ పోర్ట్ ఉంది. ఇది శాంసంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్.. ఇలా అన్నిటినీ ఒకేసారి ఛార్జ్ చేసుకునే వెసులుబాటు దీని సొంతం.
ఇందులో మరో ఉపయోగకరమైన ఫీచర్ built-in కిక్‌స్టాండ్. ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్‌ను నిలువుగా లేదా అడ్డంగా నిలబెట్టుకోవచ్చు. వీడియో కాల్స్ మాట్లాడటానికి, సినిమాలు చూడటానికి లేదా ఐఫోన్ స్టాండ్‌బై మోడ్ ఉపయోగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
భారత్‌లోనే తయారైన ఈ బిఐఎస్ (BIS) సర్టిఫైడ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.4,999. అయితే ప్రస్తుతం అమెజాన్, స్టఫ్‌కూల్ అధికారిక వెబ్‌సైట్లలో రూ.4,750 ప్రాథమిక ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా కాస్త తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఒకే పరికరంతో అన్ని గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఈ పవర్ బ్యాంక్ కచ్చితంగా నచ్చుతుంది.
Also Read: ఐఫోన్ 17, శాంసంగ్ S25పై భారీ ఆఫర్లు.. ఆ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ!