E-Paper
Advertisement

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!
Advertisement

Best BLDC Fans: మన ఇంట్లో రోజంతా నాన్‌స్టాప్‌గా తిరిగే కొన్ని విద్యుత్ పరికరాల్లో సీలింగ్ ఫ్యాన్ ఒకటి. అయితే ఇప్పటికీ చాలామంది పాతకాలపు సాధారణ ఫ్యాన్లనే వాడుతున్నారు. వీటి వల్ల నెలాఖరులో కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు BLDC (బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్) ఫ్యాన్ల వైపు మళ్లుతోంది. ఒకప్పుడు ఇవి కాస్త ఖరీదైనవిగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే లభిస్తున్నాయి.

తక్కువ కరెంట్.. ఎక్కువ పొదుపు:

సాధారణ ఇండక్షన్ ఫ్యాన్లు సాధారణంగా 70 నుండి 80 వాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. కానీ BLDC ఫ్యాన్లు కేవలం 24 నుండి 35 వాట్లు మాత్రమే తీసుకుంటాయి. అంటే.. వీటివల్ల దాదాపు 65 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుంది. రోజంతా ఫ్యాన్ వేసే ఇళ్లలో వీటిని వాడితే సంవత్సరానికి కరెంట్ బిల్లుపై భారీగానే డబ్బులు మిగులుతాయి.

Advertisement

Also Read: భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

రిమోట్‌తో కంట్రోల్ చేయొచ్చు:

గోడకు ఉన్న స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లే పనిలేకుండా రిమోట్ ద్వారానే వీటిని ఆపరేట్ చేయవచ్చు. వేగాన్ని పెంచడం, తగ్గించడంతో పాటు బూస్ట్ మోడ్, టైమర్ సెట్టింగ్స్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లను బెడ్ మీది నుంచే హ్యాపీగా కంట్రోల్ చేయవచ్చు.

సౌండ్, వోల్టేజ్ సమస్యల చెక్:

Advertisement

పాత ఫ్యాన్లలా ఇవి తిరుగుతున్నప్పుడు విసిగించే శబ్దాలు చేయవు. చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. అంతేకాకుండా.. వేసవిలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ఇవి తమ వేగాన్ని తగ్గించకుండా స్థిరమైన గాలిని అందిస్తాయి.

రూ.3,000 లోపే బెస్ట్ మోడల్స్:

తక్కువ ధరలో మంచి ఫ్యాన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారి కోసం జస్ట్.. రూ.2,899కే లభిస్తున్న Kuhl Arctis A4 మంచి ఛాయిస్. ఇది 24W మోటార్‌తో, 5-స్టార్ రేటింగ్ కలిగి ఉంది. దీని మోటార్‌పై 5 ఏళ్ల వారంటీ కూడా లభిస్తుంది. ఇక మరింత తక్కువ ధరలో కావాలనుకుంటే రూ.2,199కే దొరికే Activa Gracia బెస్ట్ ఆప్షన్. దీనిలో ఇన్-బిల్ట్ LED లైట్, రిమోట్ కంట్రోల్‌తో పాటు 3 ఏళ్ల వారంటీ కూడా లభిస్తుంది.

Also Read: వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

Related News

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×