E-Paper
Advertisement

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!
Advertisement

Jio vs Vi Rs 200 OTT Plans: టెలికాం రంగంలో ప్రస్తుతం తీవ్రమైన పోటీ నడుస్తోంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు ఉన్న యూజర్లు పక్క నెట్ వర్క్ వైపు చూడకుండా కంపెనీలు సరికొత్త ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ యూజర్లను ఆకర్షించేందుకు చౌకైన ప్లాన్స్ ను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ లవర్స్ కోసం రూ.200 ధరలో జియో, వీఐ తీసుకొచ్చిన ప్లాన్స్ కు మంచి స్పందన వస్తోంది. ఇంతకీ ఈ ప్లాన్స్ వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? రెండింటిలో ఏ ప్లాన్ వల్ల యూజర్లకు లాభం ఎక్కువ? వంటిది ఈ కథనంలో చూద్దాం.

వీఐ రూ. 200 ప్లాన్

వీఐ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ రూ. 200 ప్లాన్.. ప్రధానంగా ఓటీటీ ప్రియులను టార్గెట్ చేస్తూ వచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ వచ్చే ఈ ప్లాన్ ద్వారా 20కి పైగా ఓటీటీలకు యాక్సెస్ లభించనుంది. హాట్ స్టార్, సోనీ లివ్, జీ 5, లయన్స్ గేట్, మనోరమా మ్యాక్స్, ఫ్యాన్ కోడ్ వంటి ఓటీటీల్లోని కంటెంట్ ను ఫ్రీగా చూడొచ్చు. అంతేకాకుండా 30GB డేటా సైతం యూజర్లకు లభించనుంది. దీంతో పాటు వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ ద్వారా 200 పైగా లైవ్ ఛానెళ్లను వీక్షించే వెసులుబాటును ఈ రూ.200 ప్లాన్ కల్పిస్తోంది.

Jio రూ. 200 ప్లాన్

Advertisement

జియో సైతం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీంట్లో కూడా యూజర్లకు 30GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా 15 ఓటీటీలకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ సైతం పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ప్రీమియం, సోనీలివ్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీలను ఫ్రీగా చూడొచ్చు. అయితే ఇది కూడా కేవలం డేటా ప్లాన్ మాత్రమే కాబట్టి సాధారణ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు ఇందులో ఉండవు.

Also Read: మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

రెండింట్లో ఏది బెస్ట్?

Advertisement

రెగ్యులర్ గా ఓటీటీలు చూసేవారికి ఈ రెండు ప్లాన్లు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. అయితే జియోతో పోలిస్తే వీఐ రూ.200 ప్లాన్.. ఇంకాస్త బెటర్ గా కనిపిస్తోంది. ఇందులో 200 పైగా లైవ్ ఛానెళ్లకు యాక్సెస్ లభిస్తుండటం ప్రధాన అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. అలా కాకుండా ఎంతో పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్ తో పాటు యూట్యూబ్ ప్రీమియం కంటెంట్ కు యాక్సెస్ కోరుకుంటే మాత్రం జియో వైపు మెుగ్గు చూపవచ్చు.

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

Related News

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×