E-Paper
Advertisement

విజయ్ ప్రభుత్వానికి ఊహించని షాక్.. ఆ జీవోలను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు!

విజయ్ ప్రభుత్వానికి ఊహించని షాక్.. ఆ జీవోలను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు!
Advertisement

Madras High Court: మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. బాధితులకు ఉద్యోగాలు ఇస్తూ సర్కారు జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదు!

Advertisement

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగమనేది ఊరికే పంచిపెట్టే ఉచిత కానుక కాదని స్పష్టం చేసింది. ఎంతోమంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి, అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని గుర్తుచేసింది. అలాంటప్పుడు ఎలాంటి ముందస్తు ప్రక్రియ లేదా అర్హత పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాలు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పంది.

రాజ్యాంగ పరిమితులు దాటకూడదు

Advertisement

ప్రభుత్వం ఎంత సంక్షేమ బాటలో నడిచినా.. రాజ్యాంగ పరిమితులకు లోబడే నిర్ణయాలు తీసుకోవాలని న్యాయస్థానం హితవు పలికింది. ‘బాధితులకు సానుభూతి తెలపడానికి, ఆర్థికంగా ఆదుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. పరి పరి విధాలుగా పరిపరిహారం అందించవచ్చు. అంతేతప్ప, అర్హులకు దక్కాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం సరికాదు’ అని ఘాటుగా స్పష్టం చేసింది.

బాధితులకు ఆర్థిక సాయం అందించడం వేరు, ప్రభుత్వ సర్వీసుల్లోకి నేరుగా తీసుకోవడం వేరు అని స్పష్టం చేసింది కోర్టు. కేవలం అర్హత, ప్రతిభ ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ప్రజామోద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టపరమైన, రాజ్యాంగపరమైన కోణాలను మర్చిపోకూడదని ఈ తీర్పు మరోసారి గుర్తుచేసింది.

Also Read: బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్!

Related News

బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్.. హ్యాకర్ల చేతిలోకి ఆధార్, లోన్ వివరాలు..!

డెడ్‌లైన్ ఫిక్స్.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక.. కేసులు ఎత్తివేయకుంటే మరిన్ని చర్యలు

టాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి, వీడియో వైరల్!

నేడు ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. చివరి సారిగా పలికిన మాటలివే!

డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లో లేచి పడ్డ బస్సు.. సీసీటీవీ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×