iQOO Z11: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOO నుంచి త్వరలోనే మరో కొత్త ఫోన్ భారత మార్కెట్లో సందడి చేయడానికి వచ్చేస్తోంది. ఇటీవల ఇక్కడి మార్కెట్లోకి z11 Liteని తీసుకొచ్చిన ఐకూ.. ఇప్పుడు ఈ సిరీస్‌లో iQOO Z11 మోడల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వెలువడిన లీక్స్ ప్రకారం చూసుకుంటే.. ఈ ఫోన్ ఆగస్టు నెలలో గ్రాండ్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది.
చైనా వెర్షన్‌తో పోలిస్తే.. ఇండియప్ మార్కెట్లోకి వచ్చే iQOO Z11 ఫోన్‌లో ఒక ఆసక్తికరమైన మార్పు ఉండబోతోంది. భారత్‌లో విడుదలయ్యే మోడల్‌లో పవర్‌ఫుల్ ‘మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో’ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచ్ కాబోతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. దీనివల్ల గేమ్స్ ఆడటం, రోజూవారీ పనులు చేసుకోవడం చాలా స్మూత్‌గా సాగుతాయి.
Also Read: 200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?
మెరుగైన పనితీరుతో పాటు డిజైన్ విషయంలోనూ ఈ ఫోన్ ఆకట్టుకోనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రీమియం లుక్ ఇచ్చే 3D కర్వ్‌డ్ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. తద్వారా వీడియోలు చూడటం, ఫోన్ వాడటం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చైనాలో ఈ మార్చిలోనే విడుదలైనప్పటికీ.. కొన్ని ప్రత్యేక మార్పులతో ఇది మనదేశంలోకి అడుగుపెడుతుండటంతో టెక్ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
చైనాలో రిలీజైన iQOO Z11 ఫీచర్లను ఒకసారి చూస్తే.. అక్కడ 165Hz రీఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే 9,020mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. భారత వెర్షన్‌లో బ్యాటరీ, డిస్‌ప్లే వివరాలపై త్వరలోనే కంపెనీ నుంచి అధికారిక స్పష్టత రానుంది.
Also Read: వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!