E-Paper
Advertisement

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?
Advertisement

OnePlus 16: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 16 రాబోతోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట్లో సెప్టెంబర్‌లోనే వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. లాంచ్ డేట్‌ను అక్టోబర్‌కు మార్చినట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయంలో వన్‌ప్లస్ ఏ మాత్రం తగ్గడం లేదు. దీనిలో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని అందించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.. క్వాల్‌కామ్ త్వరలో పరిచయం చేయనున్న పవర్‌ఫుల్ ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రొ’ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని సమాచారం. దీనివల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటాయి.

Advertisement

Also Read: ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?

OnePlus 16 లుక్ పరంగా పాత OnePlus 15 మోడల్ తరహాలోనే స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను కొనసాగించనున్నారు. దీనిలో 6.78 ఇంచుల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇక ఫొటోగ్రఫీ కోసం 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను టెస్ట్ చేస్తున్నారట. దీనికి తోడు ఫోన్‌లో ప్రత్యేకంగా ఒక AI బటన్ కూడా ఉండబోతోంది.

Advertisement

చైనాలో అక్టోబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ మోడల్ కోసం మన దేశంలోనూ చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే భారతీయ వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు ఒక చిన్న నిరాశ కలిగించే వార్త ఏంటంటే.. ఈ ఫోన్ ఇండియా మార్కెట్‌కు రాకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: Made by Google ఈవెంట్‌కు ముందే బ్యాడ్ న్యూస్.. Pixel 10 కొన్నవాళ్లకీ తప్పని తిప్పలు!

Related News

వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

ప్రయాణాల్లో ఛార్జింగ్ తిప్పలు ఇక ఉండవు! రూ.వేయ్యిలోపు బ్రాండెడ్ పవర్ బ్యాంక్

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

చిన్న పార్టీలకు పర్ఫెక్ట్ సౌండ్! తక్కువ ధరలోనే బ్లూటూత్ స్పీకర్..బాస్

ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×