E-Paper
Advertisement

నథింగ్ బడ్స్‌కు చెక్ పెట్టేలా JBL కొత్త స్ట్రాటజీ..ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కొత్త మోడల్ లాంచ్!

నథింగ్ బడ్స్‌కు చెక్ పెట్టేలా JBL కొత్త స్ట్రాటజీ..ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కొత్త మోడల్ లాంచ్!
Advertisement

JBL Tune Buds 3: ఆడియో ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న JBL, యూత్‌ను కట్టిపడేసేలా సరి కొత్త ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చింది. అదే JBL Tune Buds 3. సాధారణ ప్లాస్టిక్ డిజైన్‌లకు భిన్నంగా, లోపలి భాగాలు స్పష్టంగా.. కనిపించే అద్భుతమైన ట్రాన్స్‌లూసెంట్ లుక్‌తో వీటిని తీర్చిదిద్దారు. లేటెస్ట్ బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ, 48 గంటల బ్యాటరీ బ్యాకప్, బయటి సౌండ్స్ నియంత్రించే ఏఎన్సీ ఫీచర్లతో ఇవి మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ స్టైలిష్ ఇయర్‌ బడ్స్ ధర, పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు: 

డిజైన్ & కలర్ ఆప్షన్లు:

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా యూత్ మెచ్చే స్టైలిష్ లుక్‌పై జేబీఎల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ రెండూ సెమీ-ట్రాన్స్‌పరెంట్ ఫినిషింగ్‌తో వస్తున్నాయి. అంటే ఇయర్‌ బడ్స్ లోపలి సర్క్యూట్, ఇతర భాగాలు బయటికి అందంగా కనిపిస్తాయి. ఇవి డీప్ బ్లాక్ , మూన్ వైట్, ఆకర్షణీయమైన జేడ్ గ్రీన్ అనే మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 5.9 గ్రాములు మాత్రమే ..ఉండటం వల్ల చెవులకు బరువుగా అనిపించదు. దీని ఛార్జింగ్ కేస్ బరువు 40 గ్రాములుగా ఉంది. అంతేకాకుండా.. దుమ్ము , నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం వీటికి IP54 రేటింగ్ ఇచ్చారు. జిమ్‌లో వర్కవుట్స్ చేసేటప్పుడు.. లేదా చిరు జల్లుల్లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చు.

హార్మన్ ట్యూన్డ్ సౌండ్ & పర్సోని-ఫై 3.0:

Advertisement

సౌండ్ క్వాలిటీ విషయంలో జేబీఎల్ ఎప్పుడూ రాజీ పడదు. ఈ బడ్స్‌లో 10mm డైనమిక్ డ్రైవర్లను వాడారు. వీటిని  హార్మన్ ఆడియో ఇంజనీర్లు ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. దీని వల్ల జేబీఎల్ సిగ్నేచర్ ప్యూర్ బేస్ సౌండ్‌తో పాటు స్పష్టమైన వోకల్స్ వినిపిస్తాయి. ఇందులో జేబీఎల్ స్పేషియల్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది సినిమాలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు థియేటర్ ఫీల్ ఇస్తుంది. అంతే కాదు యూజర్లకు వినికిడి సామర్థ్యానికి అనుగుణంగా ఆడియోను మార్చుకునే ఫీచర్ ఇందులో హైలైట్‌గా నిలుస్తోంది. జేబీఎల్ హెడ్‌ ఫోన్స్ యాప్ ద్వారా మీకు నచ్చిన విధంగా ఈక్వలైజర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ & క్రిస్టల్ క్లియర్ కాల్స్:

బయటి రద్దీలో.. ప్రయాణిస్తున్నప్పుడు చుట్టు పక్కల సౌండ్స్ ఇబ్బంది పెట్టకుండా ఇందులో ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. ఇందులోని.. నాలుగు మైక్రోఫోన్లు బయటి సౌండ్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ..వాటిని నియంత్రిస్తాయి. ఒక వేళ మీరు బడ్స్ తీయకుండానే.. పక్క వారితో మాట్లాడాలనుకుంటే ..’స్మార్ట్ యాంబియంట్’మోడ్ ఉపయోగ పడుతుంది. ఇక ఫోన్ కాల్స్ కోసం మొత్తం.. 6 మైక్రో ఫోన్లను అందించారు. గాలి శబ్దాన్ని తగ్గించి, అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేలా ఇవి పని చేస్తాయి.

బ్లూటూత్ 6.0 & 48 గంటల భారీ బ్యాటరీ లైఫ్:

Advertisement

కనెక్టివిటీ పరంగా.. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 6.0 టెక్నాలజీని ఉపయోగించారు. ఇది ఫాస్ట్ పెయిరింగ్‌తో పాటు తక్కువ పవర్ ఖర్చు చేస్తుంది. మల్టీ-పాయింట్ కనెక్టివిటీ ద్వారా ఒకే సారి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌కు కనెక్ట్.. చేసుకోవచ్చు. గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఆరాకాస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ విషయానికి వస్తే.. ఛార్జింగ్ కేస్‌తో కలిపి.. ఏకంగా 48 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఏఎన్సీ ఆఫ్‌లో ఉంటే ఇయర్‌ బడ్స్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే 12 గంటలు,కేస్‌తో కలిపి 36 గంటల అదనపు బ్యాకప్ వస్తుంది. ఒకవేళ ..ఏఎన్సీ ఆన్‌లో ఉంచితే బడ్స్ 10 గంటలు, కేస్ 30 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. అత్యవసర సమయాల్లో.. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఏకంగా.. 4 గంటల పాటు పాటలు వినొచ్చు. పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

ధర:

ప్రస్తుతానికి జేబీఎల్ ఈ ట్రాన్స్‌లూసెంట్ మోడల్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. అక్కడ దీని ధర 729 యువాన్లుగా నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.8,500 నుంచి రూ.9,200 మధ్య ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి అక్కడ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోనూ ఈ స్టైలిష్ ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్, అదిరిపోయే సౌండ్ కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

Related News

మీ ఇంటినే..మూవీ హాల్‌గా మార్చే బెస్ట్ వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్

కరెంట్ బిల్లు సగానికి తగ్గించే టాప్ 5 స్టార్ గీజర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరల్లో భారీ తేడా ఇదే!

ఆఫీస్ డెస్క్‌పై వేడివేడి టీ,కాఫీ కావాలా? రూ.వెయ్యిలోపు ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవే!

ఏఐ ఎఫెక్ట్.. 10 వేల ఉద్యోగాలకు ఎసరు, ఏ కంపెనీ తెలుసా?

బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!

రూ.9,666కే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ!ఈ టీవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రూ.426కే థండర్ సౌండ్,పంచీ బేస్!బడ్జెట్‌లో బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఇదే!

Big Stories

Advertisement
×