E-Paper
Advertisement

కరెంట్ బిల్లు సగానికి తగ్గించే టాప్ 5 స్టార్ గీజర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరల్లో భారీ తేడా ఇదే!

కరెంట్ బిల్లు సగానికి తగ్గించే టాప్ 5 స్టార్ గీజర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరల్లో భారీ తేడా ఇదే!
Advertisement

Amazon vs Flipkart geyser price: చలికాలం మొదలైందంటే ఉదయాన్నే వేడినీళ్లతో స్నానం చేయడానికి ఇంట్లో గీజర్ తప్పనిసరి. ముఖ్యంగా.. ఐదారుగురు ఉండే పెద్ద కుటుంబాలకు 25 లీటర్ల సామర్థ్యం ఉన్న 5 స్టార్ గీజర్లు అయితే బెస్ట్.అంతే కాకుండా వీటితో కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. అయితే ఆన్‌లైన్‌లో గీజర్ కొనేటప్పుడు అమెజాన్‌లో తక్కువ ధరకు వస్తుందా లేక ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్ ఉంటాయా అనే సందేహం అందరికీ ఉంటుంది. అందుకే ఏ ఫ్లాట్ ఫాంలో తక్కువ ధరకు లభిస్తాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్ద ఫ్యామిలీలకు 5 స్టార్ గీజర్లు ఎందుకు బెస్ట్?

ఉమ్మడి కుటుంబాలు లేదా నలుగురి కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఇళ్లలో రోజూ గీజర్ ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచాల్సి వస్తుంది. సాధారణ గీజర్లతో పోలిస్తే.. 5 స్టార్ రేటింగ్ ఉన్న స్టోరేజ్ గీజర్లు నీటిని చాలా సేపు వేడిగా ఉంచడమే కాకుండా కరెంట్ ఖర్చును భారీగా తగ్గిస్తాయి. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్‌లలో కొన్ని మోడల్స్‌పై బ్యాంక్ ఆఫర్లతో కలిపి లేటెస్ట్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి.

Crompton Arno Neo 5S:

Advertisement

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే 5 స్టార్ గీజర్లలో క్రాంప్టన్ ఆర్నో నియో మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో పవర్ ఫుల్ 2000 వాట్ల హీటింగ్ ఎలిమెంట్, తుప్పు పట్టని నానో పాలీబాండ్ ట్యాంక్ , అడ్వాన్స్‌డ్ 3-లెవల్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 8 బార్ ప్రెజర్ రేటింగ్ ఉండటం వల్ల అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి కూడా ఇది చాలా బాగా పని చేస్తుంది. ధరల విషయానికి వస్తే.. అమెజాన్‌లో ఇది సుమారు రూ.7,299 వద్ద లభిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో సాధారణ ధర రూ.7,299 అయినప్పటికీ బ్యాంక్ ఆఫర్లతో సుమారు రూ.6,715 కే సొంతం చేసుకోవచ్చు.

Bajaj Shield Series Popular Plus:

క్వాలిటీకి మారుపేరైన బజాజ్ నుంచి వస్తున్న ఈ 25 లీటర్ల గీజర్ పెద్ద కుటుంబాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. టైటానియం ఆర్మర్ టెక్నాలజీ.. గ్లాస్‌లైన్డ్ ట్యాంక్ ఉండటం వల్ల బోరు నీళ్లు లేదా హార్డ్ వాటర్ వాడినా ట్యాంక్ త్వరగా పాడవదు. స్వైర్ల్ ఫ్లో టెక్నాలజీ ద్వారా 20 శాతం ఎక్కువ వేడి నీరు లభిస్తుంది. అమెజాన్‌లో దీని ధర సుమారు రూ.7,699 గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,797కి లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ , కార్డ్ ఆఫర్లు కలుపుకుంటే ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

Orient Electric Cronos Pro:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో.. మంచి 5 స్టార్ రేటింగ్ గీజర్ కావాలనుకునే.. వారికి ఓరియంట్ క్రోనోస్ ప్రో ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో.. వర్ల్‌ఫ్లో టెక్నాలజీ ఉండటం వల్ల వేడి నీరు, చల్లని నీరు త్వరగా కలిసిపోకుండా.. ఎక్కువసేపు వేడిగా ఉంటాయి.మల్టీ-ఫంక్షన్ సేఫ్టీ వాల్వ్ , షాక్-ప్రూఫ్ బాడీ దీని ప్రత్యేకతలు. అమెజాన్‌లో దీని ధర సుమారు రూ.6,590 వద్ద చాలా తక్కువగా.. లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు రూ.6,999కే లభిస్తోంది.

Voltas AquaPro:

వోల్టాస్ ఆక్వాప్రో 25 లీటర్ల గీజర్ హై-రైజ్ బిల్డింగ్స్, పెద్ద ఫ్యామిలీలకు చక్కగా సరిపోతుంది. ఇందులో హై-డెన్సిటీ PUF ఇన్సులేషన్ ఉండటం వల్ల గీజర్ ఆఫ్ చేసిన తర్వాత.. కూడా గంటల తరబడి నీరు వేడిగా ఉంటుంది. దీనిపై సాధారణంగా ఇన్‌స్టాలేషన్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ధరల పోలిక చూస్తే అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో ఇది సుమారు రూ.6,750 కే దొరుకుతుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు రూ.7,499 ధర ఉంటుంది.

Also Read: బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!

AO Smith & Havells:

మీ కొంచెం బడ్జెట్ పెంచగలిగితే ఏఓ స్మిత్, హావెల్స్ మోడల్స్ చాలా బాగా పనిచేస్తాయి. బ్లూ డైమండ్ గ్లాస్-లైన్డ్ ట్యాంక్ , డిజిటల్ టెంపరేచర్ డిస్‌ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్లు వీటిలో ఉంటాయి. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ వీటి ధరలు సుమారు రూ.8,999 నుంచి రూ.11,500 మధ్య ఉన్నాయి.

అమెజాన్ వర్సెస్ ఫ్లిప్‌కార్ట్:

మొత్తం మీద ధరలను పరిశీలిస్తే.. ఓరియంట్ , వోల్టాస్ వంటి మోడల్స్‌పై అమెజాన్‌లో నేరుగా తక్కువ ధరలు కనిపిస్తున్నాయి. మరోవైపు క్రాంప్టన్ ,బజాజ్ గీజర్లపై ఫ్లిప్‌కార్ట్‌లో పాత గీజర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు , క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు బాగున్నాయి. గీజర్ ఆర్డర్ చేసే ముందు.. ఫ్రీ ఇన్‌స్టాలేషన్ , కనెక్టింగ్ పైపులు బాక్స్‌తో పాటు ఉచితంగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటే అదనంగా రూ.500 నుంచి రూ.800 వరకు ఆదా చేసుకోవచ్చు.

Related News

ఆఫీస్ డెస్క్‌పై వేడివేడి టీ,కాఫీ కావాలా? రూ.వెయ్యిలోపు ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవే!

ఏఐ ఎఫెక్ట్.. 10 వేల ఉద్యోగాలకు ఎసరు, ఏ కంపెనీ తెలుసా?

బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!

రూ.9,666కే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ!ఈ టీవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రూ.426కే థండర్ సౌండ్,పంచీ బేస్!బడ్జెట్‌లో బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఇదే!

రూ.500కే 48 గంటల బ్యాటరీ బ్యాకప్!అదిరిపోయే ఫీచర్లతో ఇయర్‌బడ్స్

మీ ఫోన్ నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవ్వాలా? ఈ రియల్‌మీ కొత్త పవర్ బ్యాంక్ మీకోసమే

Big Stories

Advertisement
×