Amazon Black Friday Sale: ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నేడు (నవంబర్ 27) ఘనంగా ప్రారంభమైంది. పండగ సీజన్ సేల్స్ మిస్ అయిన వారికి, కొత్త సంవత్సరానికి ముందు.. తమ పాత గాడ్జెట్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. స్మార్ట్‌ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, హోమ్ అప్లయెన్సెస్ వరకు దాదాపు అన్ని కేటగిరీలపై అమెజాన్ కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మెగా సేల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ ఫ్రైడే సేల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అమెజాన్ కేవలం ఫ్లాట్ డిస్కౌంట్లకే పరిమితం కాకుండా, ప్రముఖ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందిస్తోంది. దీనికి తోడు పాత ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ మెంబర్లకు కొన్ని ప్రత్యేక డీల్స్‌పై ఎర్లీ యాక్సెస్, ఫాస్ట్ డెలివరీ ప్రయోజనాలు లభిస్తున్నాయి.
ఈ సేల్‌లో స్పెషల్ అట్రాక్షన్లు స్మార్ట్‌ఫోన్ విభాగమే అని చెప్పాలి. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ల నుంచి బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ల వరకు అన్నింటిపై భారీగా ధరలు తగ్గాయి. ఆపిల్, శామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్, వన్‌ప్లస్, ఐకూ, రెడ్‌మీ వంటి పాపులర్ బ్రాండ్ల మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. కెమెరా క్వాలిటీ, ఏఐ ఫీచర్లు, హై-స్పీడ్ ప్రాసెసర్లతో కూడిన కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది సరైన టైం.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి.. విద్యార్థులకు, గేమర్లకు ఉపయోగపడే ల్యాప్ టాప్‌లపై కూడా మంచి డీల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాక్‌బుక్ మోడళ్లు, విండోస్ ఏఐ ల్యాప్‌టాప్‌లపై వేల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కలిగిన ప్రీమియం ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ స్పీకర్లపై 40 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపులు లభిస్తున్నాయి.
Also Read: మీ ఇంటినే..మూవీ హాల్‌గా మార్చే బెస్ట్ వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్
ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవాలనుకునే.. వారికి ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ బెస్ట్ ఆప్షన్. 4K క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలు, డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అంతే కాకుండా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, కిచెన్ అప్లయెన్సెస్ వంటి వాటిపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి.
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ..పాపులర్ ప్రొడక్ట్స్ స్టాక్ చాలా వేగంగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కావలసిన వస్తువులను ముందుగానే విష్‌లిస్ట్‌లో చేర్చుకుని, అసలు ధరను, ఆఫర్ ధరను ఒక సారి పోల్చి చూసుకోండి. అలాగే కూపన్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను చెక్అవుట్ సమయంలో సరిగ్గా .. అప్లై చేశారో లేదో గమనించండి.