E-Paper
Advertisement

ఆఫీస్ డెస్క్‌పై వేడివేడి టీ,కాఫీ కావాలా? రూ.వెయ్యిలోపు ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవే!

ఆఫీస్ డెస్క్‌పై వేడివేడి టీ,కాఫీ కావాలా? రూ.వెయ్యిలోపు ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవే!
Advertisement

Best electric kettle under 1000: ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు వేడి వేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే.. ఆ కిక్కే వేరు. ప్రతిసారీ క్యాంటీన్‌కు వెళ్లకుండా, మన డెస్క్‌పైనే నిమిషాల్లో వేడి నీళ్లు, గ్రీన్ టీ లేదా ఇన్‌స్టంట్ కాఫీ రెడీ చేసుకుంటే.. ఎంతో సమయం ఆదా అవుతుంది. అందుకే తక్కువ బడ్జెట్‌లో అంటే కేవలం రూ.1000 లోపే దొరికే, ఆటో షట్-ఆఫ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్న టాప్ 5 ఆఫీస్ ఎలక్ట్రిక్ కెటిల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫీస్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్ ఎందుకు అవసరం?

ఆఫీస్ డెస్క్‌పై ఎలక్ట్రిక్ కెటిల్ వాడేటప్పుడు సేఫ్టీ, సైజు చాలా ముఖ్యం. మన పక్కనే ల్యాప్‌టాప్, ముఖ్యమైన ఫైళ్లు ఉంటాయి కాబట్టి పొరపాటున చేయి తగిలినా నీళ్లు బయటకు ఒలకకుండా ఉండే లాకబుల్ లిడ్ తప్పని సరిగా ఉండాలి. అలాగే నీళ్లు మరగగానే దానంతట అదే ఆఫ్ అయ్యే ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉంటే ..కరెంట్ ఆదా అవ్వడంతో పాటు షార్ట్ సర్క్యూట్ భయం ఉండదు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం బడ్జెట్ ధరలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే 5 మోడల్స్..

1.Milton Go Electro 1.2L:

Advertisement

ఆఫీస్ డెస్క్‌పై తక్కువ స్థలంలో చక్కగా సరి పోయే 1.2 లీటర్ల కెపాసిటీ కలిగిన స్టీల్ కెటిల్ ఇది. ఇందులో 1350 వాట్ల పవర్ హీటింగ్ ఎలిమెంట్ ఉండటం వల్ల కేవలం రెండు మూడు నిమిషాల్లోనే నీళ్లు మరుగుతాయి. నీళ్లు ఒలకకుండా ఉండే లాకబుల్ లిడ్, డ్రై బాయిల్ ప్రొటెక్షన, టీ పౌడర్ కప్పులోకి రాకుండా ఆపే మెష్ ఫిల్టర్ దీని ప్రత్యేకతలు. ప్రముఖ బ్రాండ్ కావడంతో పాటు దీని ప్రస్తుత ధర సుమారు రూ.749గా అందుబాటులో ఉంది.

2.Havells Hotsip 1L:

ప్రీమియం బ్రాండ్ క్వాలిటీ కోరుకునే వారికి 1 లీటర్ కెపాసిటీతో.. వచ్చే ఈ హావెల్స్ కెటిల్ బెస్ట్ ఆప్షన్. లోపల SS304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో చాలా దృఢంగా, హైజీనిక్‌గా ఉంటుంది. 1250 వాట్ల పవర్‌తో.. వేగంగా పనిచేస్తుంది. దీని హ్యాండిల్ పట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉండటమే కాకుండా.. వేడి తగలకుండా కూల్ టచ్ డిజైన్‌తో వస్తుంది. ఆఫర్లలో ఇది సుమారు రూ.999 నుంచి రూ.1099 మధ్య లభిస్తోంది.

3.Pigeon Favourite 1.2L:

Advertisement

కేవలం వేడి నీళ్లు, టీ, కాఫీ మాత్రమే కాకుండా.. ఆఫీస్ లంచ్ టైమ్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్, ఓట్స్ లేదా సూప్ కూడా చేసుకోవాలనుకునే వారికి ఇది సూపర్ ఛాయిస్. 1.2 లీటర్ల స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, వెడల్పాటి మూతి ఉండటం వల్ల దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. ఓవర్ హీట్ సెన్సార్ , ఆటో కట్-ఆఫ్ ఫీచర్లతో పూర్తి సేఫ్టీ ఇస్తుంది. బడ్జెట్‌లో మల్టీపర్పస్ కోసం చూసేవారికి ఇది సుమారు రూ.799 నుంచి రూ.899 ధరలో దొరుకుతుంది.

Also Read: బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!

4.Prestige PKOSS 0.6L:

ఒక్కరి కోసం మాత్రమే అయితే పెద్ద కెటిల్స్ అవసరం లేదు. 0.6 లీటర్ల (600 ml) క్యూట్ సైజులో ఉండే ఈ ప్రెస్టీజ్ కెటిల్ మీ ఆఫీస్ డెస్క్ మూలలో లేదా బ్యాగ్‌లో కూడా ఈజీగా పట్టేస్తుంది. తరచూ ట్రావెలింగ్ చేసే ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ కరెంట్ వాడకంతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, స్పిల్-ప్రూఫ్ లిడ్, ఆటో షట్-ఆఫ్ వంటి అన్ని సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర సుమారు రూ.899గా ఉంది.

5.Butterfly Rapid 1.5L:

మీ ఆఫీస్ టీమ్ అందరికీ ఒకేసారి గ్రీన్ టీ లేదా కాఫీ పెట్టాలంటే 1.5 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ కెటిల్ సరిగ్గా సరిపోతుంది. 1500 వాట్ల హై పవర్ హీటింగ్ వల్ల ఎక్కువ నీళ్లు ఉన్నా చాలా ఫాస్ట్‌గా వేడెక్కుతాయి. ఆకర్షణీయమైన ఫినిషింగ్, నీళ్లు చిందకుండా పోసే స్పాట్ డిజైన్ , ఆటో స్విచ్ ఆఫ్ దీని ప్రధాన ఆకర్షణలు. ఆన్‌లైన్ సేల్స్‌లో ఇది సుమారు రూ.849 నుంచి రూ.949 మధ్య లభిస్తుంది.

Related News

కరెంట్ బిల్లు సగానికి తగ్గించే టాప్ 5 స్టార్ గీజర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరల్లో భారీ తేడా ఇదే!

ఏఐ ఎఫెక్ట్.. 10 వేల ఉద్యోగాలకు ఎసరు, ఏ కంపెనీ తెలుసా?

బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!

రూ.9,666కే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ!ఈ టీవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రూ.426కే థండర్ సౌండ్,పంచీ బేస్!బడ్జెట్‌లో బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఇదే!

రూ.500కే 48 గంటల బ్యాటరీ బ్యాకప్!అదిరిపోయే ఫీచర్లతో ఇయర్‌బడ్స్

మీ ఫోన్ నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవ్వాలా? ఈ రియల్‌మీ కొత్త పవర్ బ్యాంక్ మీకోసమే

Big Stories

Advertisement
×